నల్లమోతు చెంచు రామానాయుడు
శ్రీ. నల్లమోతు చెంచు రామానాయుడు గౌరవ మంత్రి | |
---|---|
పురపాలక , అటవీ మంత్రి , ఆంధ్రప్రదేశ్ | |
In office 1965–1972 | |
ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు | |
In office 1962–1972 | |
నియోజకవర్గం | కందుకూరు శాసనసభ నియోజకవర్గం |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1914 చింతలపాలెం, జరుగుమల్లి మండలం, ప్రకాశం జిల్లా , ఆంధ్రప్రదేశ్ |
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ |
సంతానం | సాయి బాబా నాయుడు |
నల్లమోతు చెంచు రామానాయుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి , భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకుడు.[1]
ప్రాథమిక జీవితం
[మార్చు]చెంచు రామానాయుడు ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్ లోని అవిభక్త నెల్లూరు జిల్లా కందుకూరు ప్రాంతం లోని చింతలపాలెం గ్రామంలో సంపన్న రైతు కుటుంబంలో జన్మించాడు.అతను హైస్కూల్ విద్య పూర్తి చేశాడు. వీరి సోదరి కుమారుడు పోతుల రామారావు మాజీ శాసనసభ్యుడు
రాజకీయ జీవితం
[మార్చు]1935 లో అతని 20 సంవత్సరాల చింతలపాలెం సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.1936 - 1939 వరకు జరుగుమల్లి సమితి అధ్యక్షుడిగా పనిచేశాడు. జరుగుమల్లి సమితి అధ్యక్షుడిగా పనిచేస్తున్న సమయంలోనే కందుకూరు సమితి అధ్యక్షుడు , స్నేహితుడు దివి కొండయ్య చౌదరి ప్రోద్బలంతో కాంగ్రెస్ పార్టీ లో చేరాడు.
కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కందుకూరు ప్రాంతంలో కీలకమైన నాయకుడిగా ఎదుగుతున్న సమయంలోనే నెల్లూరు జిల్లాకు చెందిన ఏ. సి. సుబ్బారెడ్డి సహకారంతో 1937 లో నెల్లూరు జిల్లా బోర్డుకు ఎన్నికై 1939-49 వరకు జిల్లా బోర్డు ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. జిల్లా బోర్డు ఉపాధ్యక్షుడిగా కావలి , కందుకూరు , ఉదయగిరి ప్రాంతాల్లో మంచి పట్టు సాధించాడు. 1949-52 వరకు నెల్లూరు జిల్లా బోర్డు అధ్యక్షుడిగా పనిచేశాడు.
1952 లో జరిగిన ఉమ్మడి మద్రాస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కందుకూరు (జనరల్) నియోజకవర్గం నుంచి కాంగెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించాడు. [2] 1955 లో కొండపి నియోజకవర్గం నుంచి మొదటి శాసనసభ్యుడిగా,[3] 1962,1967 లలో కందుకూరు నియోజకవర్గం నుంచి మరో రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా విజయం సాధించాడు.[4] [5]
1965 -72 వరకు కాసు బ్రహ్మానంద రెడ్డి , పి. వి. నరసింహ రావు మంత్రివర్గాలలో అటవీ , పురపాలక శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.1970 లో ప్రకాశం జిల్లా ఏర్పాటు లో కీలకమైన పాత్ర పోషించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "నలుగురు మంత్రులు, ఒక గవర్నర్, ఒక దౌత్య ప్రతినిధి, సినీతారల తాకిడి" (PDF). jamIn raithu. 25 August 1967. p. 3.
- ↑ "మద్రాసు శాసనసభ సమీక్ష - 1952-57" (PDF). తమిళనాడు శాసనసభ. p. 82. Archived (PDF) from the original on 2020-10-15. Retrieved 2021-11-03.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1955". Elections in India. Archived from the original on 2021-03-01. Retrieved 2021-10-07.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1962". Elections in India. Archived from the original on 2020-07-12. Retrieved 2021-10-07.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1967". Elections in India. Archived from the original on 2020-07-12. Retrieved 2021-10-07.
వెలుపలి లంకెలు
[మార్చు]- ANDHRA_PRADESH_1967_03_01_Volume_no_11_issue_no_5