నల్ సరోవర్
నల్ సరోవర్ | |
---|---|
ప్రదేశం | సనంద్,అహ్మదాబాద్, గుజరాత్ |
సరస్సు రకం | సహజ సరస్సు |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
నల్ సరోవర్ భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో గల అహ్మదాబాద్ కు పశ్చిమాన 64 కిలోమీటర్ల దూరంలో, సనంద్ గ్రామానికి సమీపంలో ఉన్న సరస్సు. దీనిని ఏప్రిల్ 1969 లో నల్ సరోవర్ పక్షుల అభయారణ్యంగా ప్రకటించారు.[1]
విస్తీర్ణం
[మార్చు]ఇది గరిష్ఠంగా 120.82 చదరపు కిలోమీటర్ల (46.65 చదరపు మైళ్ళు) విస్తీర్ణం కలిగి, చిత్తడి నేలలతో కూడిన పక్షుల అభయారణ్యం.[2]
ప్రత్యేకత
[మార్చు]ఇక్కడికి శీతాకాలంలో, వసంతకాలంలో వలస పక్షులు వలస వస్తాయి. ఇది భారతదేశంలోని అతిపెద్ద చిత్తడి నేల కలిగిన పక్షుల అభయారణ్యం.[3]
పక్షులు
[మార్చు]నల్ సరోవర్ ప్రాంతంలో ఇప్పటివరకు 225 రకాల పక్షులు గుర్తించబడ్డాయి. వాటిలో 140 నీరు-పక్షులు వాటిలో 70 వలస పక్షులు. ఈ 70 లో, 25 నుండి 30 వరకు మాత్రమే సందర్శకులు, పర్యాటకులు సులభంగా చూడవచ్చు. అక్కడి వ్యాఖ్యాన కేంద్రం ఫ్లెమింగో, పెలికాన్, ఎగ్రెట్, హెరాన్, బాతులు, కార్మోరెంట్, క్రేన్ వంటి ఈ 30 జాతుల పక్షులపై దృష్టి పెడుతుంది. సందర్శకులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి రివర్స్ ఓస్మోసిస్ ప్లాంట్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడింది.[4]
గుర్తింపు
[మార్చు]దీనిని "రామ్‌సర్ కన్వెన్షన్ సైట్ - వెట్ ల్యాండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్" గా ప్రతిపాదించారు.
24 సెప్టెంబర్ 2012 న నల్ సరోవర్‌ను రామ్‌సర్ సైట్‌గా ప్రకటించారు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Nalsarovar". Ramsar Sites Information Service. Retrieved 25 April 2018.
- ↑ "Forest Environment Department | Wildlife | Nal Sarovar Birds Sanctuary". gujenvfor.gswan.gov.in. Archived from the original on 2015-08-04. Retrieved 2015-07-22.
- ↑ New Nal Sarovar interpretation center is now open
- ↑ Ramsar site status sought for Nal Sarovar; By Sajid Shaikh, TNN, 17 February 2002, Times of India
- ↑ Ramsar designation of IBA lacking (159 IBAs); Important Bird Areas and potential Ramsar Sites in Asia – India Archived 2009-01-03 at the Wayback Machine; 31 August 2005; birdlife.org