నవీన్ పొలిశెట్టి

వికీపీడియా నుండి
(నవీన్‌ పొలిశెట్టి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
నవీన్ పొలిశెట్టి
జననం (1989-12-26) 1989 డిసెంబరు 26 (వయసు 34)
వృత్తినటుడు, రచయిత
క్రియాశీల సంవత్సరాలు2012–ఇప్పటి వరకు

నవీన్‌ పొలిశెట్టి ఒక భారతీయ నటుడు. పలు యూట్యూబ్ వీడియోలతో పాటు లఘు చిత్రాలలో నటించాడు. ఇతడి మొదటి సినిమా తెలుగులో ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ.[1] ఈ సినిమా 2019లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్నది. అదే సంవత్సరం "చిచోర్" ద్వారా హిందీ సినిమాల్లోకి ప్రవేశించి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

అతను మౌలానా ఆజాద్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటి, భోపాల్) నుండి పట్టభద్రుడయ్యాక సివిల్ ఇంజనీర్‌గా తన వృత్తిని ప్రారంభించాడు. తరువాత నాటకాలలో నటుడు అయ్యాడు. ఆ తర్వాత యూట్యూబ్ వీడియోల్లో నటించడం ద్వారా యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు పొందాడు. 2019 లో బాక్సాఫీస్ వద్ద చాలా మంచి ప్రదర్శన కనబరిచిన సినిమా "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ" లో అతను ప్రధాన పాత్ర పోషించాడు. ఆ తర్వాత చిచోర్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, శ్రద్ధా కపూర్‌లతో కలిసి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. [2][3][4]

నటించిన చిత్రాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష వివరణ
2012 లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ రాకేష్ తెలుగు ముఖ్య పాత్ర
2013 డి ఫర్ దోపిడీ హరీష్ తెలుగు ముఖ్య పాత్ర
2014 నేనొక్కడినే నవీన్ తెలుగు
2019 ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ తెలుగు కథానాయకుడు
చిచ్చోర్ అనిల్ "ఆసిడ్" దేశ్‌ముఖ్ హిందీ బాలీవుడ్ లో ప్రవేశం
2020 జాతిరత్నాలు శ్రీకాంత్ తెలుగు కథానాయకుడు
2023 మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తెలుగు కథానాయకుడు

మూలాలు

[మార్చు]
  1. Sangeetha Devi Dundoo (21 June 2019). "'Agent Sai Srinivasa Athreya' review: Crime story wrapped in humour". The Hindu. Retrieved 9 July 2019.
  2. Y Sunita Chowdhary (17 June 2019). "Wise choices". The Hindu. Retrieved 9 July 2019.
  3. "It was a one-sided love affair so far, but cinema is finally loving me back: Naveen Polishetty - Times of India". The Times of India.
  4. Dundoo, Sangeetha Devi (22 August 2019). "Naveen Polishetty: I hope to work until I'm 80". The Hindu.

బయటి లంకెలు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో నవీన్ పొలిశెట్టి పేజీ