నవులూరి వెంకటేశ్వరరావు
నవులూరి వెంకటేశ్వరరావు | |
---|---|
జననం | నవులూరి వెంకటేశ్వరరావు 1949 జనవరి 6 |
ప్రసిద్ధి | తెలుగు కథా రచయిత, నవలా రచయిత |
భార్య / భర్త | వరలక్ష్మి |
పిల్లలు | భావన, భార్గవ, భాస్కర |
తండ్రి | లక్ష్మీనరసింహం |
తల్లి | వరలక్ష్మమ్మ |
నవులూరి వెంకటేశ్వరరావు విశాఖపట్నానికి చెందిన రచయిత, చరిత్రకారుడు. విశాఖ సాహితి సభ్యుడు.
రచనలు
[మార్చు]కథలు
[మార్చు]ఇతని కథలు ఆంధ్రప్రభ, విపుల, ఉదయం, ఆహ్వానం, ఆంధ్రజ్యోతి, జ్యోతి, నవ్య, కౌముది, మధురవాణి మొదలైన వివిధ ప్రింటు, అంతర్జాల పత్రికలలో ప్రచురితమయ్యాయి.
ఇతని కథల పాక్షిక జాబితా[1]:
- అంతర్నాటకాలు
- అతడు నిద్రపోయాడు
- అద్దం
- అహింస
- ఆకలి ఆకలి
- ఆఖరిమెట్టు
- ఊత-ఊరట
- ఎలుకల బోను
- ఎలోయ్ ఎలోయ్ లామా సబాచ్తనీ
- కాకిపాడిన హంస గీతం
- కాగితం పడవలు
- కీరవాణి
- గర్భగుడిలో గబ్బిలాలు
- గుమాస్తాగారి కోపం
- చరిత్ర పాపాలు
- చాటు ఉడతలు
- చిచ్చు
- చీకటి
- చీకట్లో చిన్నది
- చూపులు
- జనారణ్యం
- జారిన కన్నీటి బిందువు
- జాలి
- జీవన్మరణాల సమతుల్యం
- తామరపాకు-కన్నీటిబొట్టు
- దిక్సూచి
- నిత్యదుఃఖితుడు
- నిర్హేతుకం
- నిష్క్రియత్వం
- నూతిలో రూపాయి
- నెక్లెస్
- న్యాయవాది మరణం
- పలుకురాళ్లమీద రెండెడ్లబండిప్రయాణం
- పిల్లతెమ్మెర
- పొగమంచు
- పౌరసేవ
- ప్రవాహం
- ఫుల్ స్టాప్
- బొమ్మలు
- బ్రహ్మకడగని పాదం
- భయం
- మరీచిక
- మల్లెలు
- మిథ్యా బింబాలు
- మీమాంస
- ముక్కాలి పీటమీద వీనస్
- యంత్రజాలం
- విషాదయోగం
- వెల
- వ్యథ
- శక్తి
- శిఖరారోహణ
- శైతల్యం
- శ్మశానం
- సదుంకున్న బాబులు
- సహజీవనం
- హాబ్సన్స్ ఛాయిస్
- హింస
- హృదయం
నవలలు
[మార్చు]- గుణాంతరం
- అవశేషం
ఇతర రచనలు
[మార్చు]- A HISTORY OF VISAKHAPATNAM
గుర్తింపులు
[మార్చు]ఇతని రచనలకు వివిధ పోటీలలో అనేక బహుమతులు లభించాయి. పొగమంచు, పిల్లతెమ్మెర, జాలి, ఎలుకలబోను, తామరపాకు - కన్నీటి బొట్టు మొదలైన కథలు వాటిలో కొన్ని. కథాసాహితి 1996, 2000 వార్షిక కథాసంకలనాలలో ఇతని కథలకు చోటు దక్కింది. కురెళ్ళ సోమేశ్వర రావు గారి సాహిత్య పురస్కారం క్రింద 'శిథిలం' అన్న నవలకు ప్రథమ బహుమతి వచ్చింది. ఘండికోట బ్రహ్మాజీరావు, సీతారామ స్మారక పురస్కారం 2021లో ఇతనికి ఇచ్చారు. పిడపర్తి వెంకటరమణ శర్మగారి జ్ఞాపకార్థం కౌముది నిర్వహించిన నవలల పోటీలో ఇతని నవల గుణాంతరం ఉత్తమ నవలగా ఎంపికయ్యింది. ఇతని రచనలను భమిడిపాటి రామగోపాలం, మునిపల్లె రాజు, వాకాటి పాండురంగారావు, వసుంధర తదితరులు ప్రశంసించారు.[2]
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "రచయిత: నవులూరి వెంకటేశ్వరరావు". కథానిలయం. కథానిలయం. Retrieved 11 December 2023.
- ↑ సంపాదకుడు (17 November 2010). "నవ్యనీరాజనం - నవులూరి వెంకటేశ్వరరావు". నవ్య వీక్లీ.