విశాఖ సాహితి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విశాఖ సాహితి
విశాఖ సాహితి
స్థాపన4 ఏప్రిల్ 1971 (1971-04-04)
వ్యవస్థాపకులుఅంగర వెంకటకృష్ణారావు
కేంద్రీకరణసాహిత్య, సాంస్కృతిక సంస్థ
కార్యస్థానం
అధికారిక భాషతెలుగు
ముఖ్యమైన వ్యక్తులుఅంగర వెంకటకృష్ణారావు,
గణపతిరాజు అచ్యుతరామరాజు,
ఘండికోట బ్రహ్మాజీరావు,
మల్లాప్రగడ రామారావు
నినాదంవాక్యం రసాత్మకం కావ్యం

విశాఖ సాహితి విశాఖ పట్నం కేంద్రంగా ఏర్పడిన సాహిత్య సంస్థ. ఈ సంస్థ విశాఖపట్నం థాంప్సన్ వీధిలోని బ్రూక్ బాండ్ (ఇండియా) లిమిటెడ్ కార్యాలయంలో 1971, ఏప్రిల్ 4వ తేదీన 16 మంది సభ్యులతో ప్రారంభించబడింది.

నేపథ్యం

[మార్చు]

1970వ దశకం తొలినాళ్ళలో నక్సల్బరీ ఉద్యమం శ్రీకాకుళం సాయుధ పొరాటంగా విస్తరించింది. సుబ్బారావు పాణిగ్రాహి వంటి కవులు, రచయితలు ఉద్యమానికి నాయకత్వం వహించారు. తరువాత శ్రీశ్రీ షష్టిపూర్తి మహాసభ విశాఖపట్నం పురపాలక సంఘ మైదానంలో జరిగినప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు శ్రీశ్రీకి కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ఒక కరపత్రం విడుదల చేశారు. ఈ పరిణామాల ఫలితంగా రచయితలంతా వర్గపోరాట సిద్ధాంతానికి బద్ధులై ఉండాలని సూత్రీకరణ జరిగింది. విశాఖ రచయితల సంఘం సాయుధపోరాటానికి సహకరించే నిబద్ధత కలిగిన రచయితలకే తమ సంస్థలో చోటు ఉందని, ఇతరులకు హేళనలు, దూషణలు తప్పవు అనే పరిస్థితిని కల్పించింది. దీనితో అంగర వెంకటకృష్ణారావు భావప్రకటనా స్వేచ్ఛ మౌలిక ప్రాతిపదికగా కల ఒక వేదిక విశాఖ రచయితలకు అవసరం అని భావించి ఈ విశాఖ సాహితి అనే సంస్థను నెలకొల్పాడు. గణపతిరాజు అచ్యుతరామరాజు గౌరవాధ్యక్షునిగా, ఘండికోట బ్రహ్మాజీరావు అధ్యక్షుడిగా, మల్లాప్రగడ రామారావు కార్యదర్శిగా రూపుదిద్దుకున్న ఈ సంస్థ 1971, అక్టోబర్ 28న రిజిస్టర్ చేయబడింది.

కార్యక్రమాలు

[మార్చు]

ఈ సంస్థ ఇప్పటి వరకూ అనేక సమావేశాలను నిర్వహించింది. ఈ సమావేశాలలో పుస్తకావిష్కరణలు, కవి సమ్మేళనాలు, కథా కచేరీలు, చర్చలు, గోష్ఠులు, ఉపన్యాసాలు, స్మారకోపన్యాసాలు మొదలైనవి ఉన్నాయి. ఈ సమావేశాలలో సభ్యుల స్వీయ రచనలు చదవడం, వాటిపై ఇతర సభ్యులు తమ అభిప్రాయాలను తెలపడం వంటివి ఉన్నాయి. సభ్యుల రచనలను సంకలనాలుగా ప్రచురించింది. భారతదేశ సమగ్రతకు భంగం వాటిల్లినప్పుడు 1971 డిసెంబర్ నెలలో 'సమరవాణి ' పేరుతో, బంగ్లాదేశ్‌తో యుద్ధానంతరం 'విజయ కాహళి 'పేరుతో కవితాసమ్మేళనాలను నిర్వహించింది. 1977లో సాహితీమహోత్సవం పేరుతో మూడురోజుల పాటు కార్యక్రమాలను నిర్వహించింది. 1982లో దశమ వార్షికోత్సవ మహాసభలను నిర్వహించింది. 2021లో స్వర్ణోత్సవ సభలను నడిపింది. ఈ సంస్థ ద్వారా శివల జగన్నాథరావు, నవులూరి వెంకటేశ్వరరావు, ఆదూరి వెంకటసీతారామమూర్తి, అడపా రామకృష్ణ, ద్విభాష్యం రాజేశ్వరరావు, వెల్చేరు చంద్రశేఖర్, అంగర వెంకట శివప్రసాదరావు, బాలి, రాణీ మోహనరావు, ఇందూ రమణ, సుస్మితా రమణమూర్తి, ఎల్.ఆర్.స్వామి మొదలైన ఎంతోమంది రచయితలుగా ఎదిగారు.

ప్రచురణలు

[మార్చు]
  • ప్రతిబింబాలు (కథా సంకలనం)
  • ప్రతిరూపాలు (కథా సంకలనం)
  • ప్రతిధ్వనులు (కథా సంకలనం)
  • కథలు 15 (కథా సంకలనం)
  • తోరణం (కథా సంకలనం)
  • వి||సా|| కథలు (కథా సంకలనం)
  • మెనీ మినీ కథలు (కథా సంకలనం)
  • ఒక దశాబ్ది బహుమతి కథలు (కథా సంకలనం)
  • కదిలే బొమ్మలు (కథల సంపుటి) - రచన: అంగర వెంకటకృష్ణారావు
  • తెల్లవారిన రాత్రి (కథల సంపుటి) - రచన: ద్విభాష్యం రాజేశ్వరరావు
  • అదిగో పులి (కథల సంపుటి) - రచన: ఆదూరి వెంకటసీతారామమూర్తి
  • వన్నెలనీడ (కథల సంపుటి) - రచన:భమిడిపాటి రామగోపాలం
  • అచ్యుతరామరాజు నాటికలు - రచన:గణపతిరాజు అచ్యుతరామరాజు
  • ఆవేదనావేదం (కవితా సంపుటి) - రచన: మండలీక వెంకటేశ్వర్లు
  • ఆనంద హేల (కవితా సంపుటి) - రచన:గణపతిరాజు అచ్యుతరామరాజు
  • శృతి (కవితా సంకలనం)
  • అనంత సాగరం (కథల సంపుటి) - రచన:ఎల్.రాజేష్[1]

మొదలైనవి.

మూలాలు

[మార్చు]