Jump to content

మల్లాప్రగడ రామారావు

వికీపీడియా నుండి
మల్లాప్రగడ రామారావు
మల్లాప్రగడ రామారావు
జననంమల్లాప్రగడ రామారావు
(1947-11-03) 1947 నవంబరు 3 (వయసు 77)
అనకాపల్లి
నివాస ప్రాంతంవిశాఖపట్నం
సంస్థవిశాఖపట్నం పోర్ట్ ట్రస్టు
ప్రసిద్ధితెలుగు కథా రచయిత, నవలా రచయిత
Notable work(s)గోరంత దీపము,
నన్ను మాట్లాడనివ్వండి
తండ్రిమల్లాప్రగడ సూర్యారావు
తల్లిసూర్యకాంతమ్మ

మల్లాప్రగడ రామారావు తెలుగు రచయిత. విశాఖ సాహితి వ్యవస్థాపకులలో ఒకరు. ఆ సంస్థకు కార్యదర్శిగా సేవలను అందించాడు.

విశేషాలు

[మార్చు]

మల్లాప్రగడ రామారావు విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో 1947 నవంబర్ 3న మల్లాప్రగడ సూర్యారావు, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించాడు. విశాఖపట్నంలోని మిసెస్ ఎ.వి.ఎన్.కాలేజీలో చదువుకున్నాడు. తెలుగులో ఎం.ఎ. వరకు చదివాడు. మొదట విశాఖపట్నం పోర్ట్ ట్రస్టులో ఉద్యోగంలో చేరాడు. తరువాత కేంద్ర కార్మిక విద్యాసంస్థల, కార్మిక రాజ్య‌ బీమా సంస్థలలో పనిచేసి 2006లో పదవీ విరమణ గావించాడు.

సాహిత్యరంగం

[మార్చు]

ఇతడు అంగర వెంకటకృష్ణారావు, గణపతిరాజు అచ్యుతరామరాజు, ఘండికోట బ్రహ్మాజీరావు మొదలైన వారితో కలిసి విశాఖ సాహితి అనే భావప్రకటనా స్వేచ్ఛ కలిగిన రచయితల సంస్థను స్థాపించాడు. ఆ సంస్థ కార్యదర్శిగా ఎన్నో కార్యక్రమాలను నిర్వహించాడు. సంస్థ సభ్యుల రచనలను పుస్తకాలుగా ప్రచురించాడు. ఇతడు ఉద్యోగరీత్యా రాజమండ్రి బదిలీ అయినప్పుడు అక్కడి సాహితీమిత్రులతో కలిసి 1980లో సాహితీ వేదిక అనే సంస్థను ప్రారంభించాడు. సాహితీ వేదిక ద్వారా అనేక కార్యక్రమాలను నిర్వహించాడు. సాహితీ వేదిక సమావేశకర్తగా ఇతడు కథావేదిక, కథాగౌతమి అనే కథా సంకలనాలను, కవితా వేదిక, ఆర్కెష్ట్రా వంటి కవితా సంకలనాలను ఈ సంస్థ ద్వారా వెలువరించాడు. ఉద్యోగ నిమిత్తం పూణే బదిలీ అయినప్పుడు అక్కడ పాషాణ్ తెలుగు సంఘం స్థాపించి దాని ద్వారా అనేక సాహిత్య కార్యక్రమాలను అక్కడ నడిపాడు. ఇతడు 1960వ దశకం నుండి రచనలు చేస్తూ ఉన్నా అవి సంఖ్యాపరంగా తక్కువే అని చెప్పవచ్చు. 30 వరకు కథలను, కొన్ని కవితలను వ్రాశాడు.

రచనలు

[మార్చు]
  • గోరంతదీపము (కథా సంపుటి)
  • నన్ను మాట్లాడనివ్వండి (కవితా సంపుటి)

కథల జాబితా

[మార్చు]

ఇతని కథలు భారతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, కథాకేళి, ఆంధ్రజ్యోతి మొదలైన పత్రికలలో ప్రచురింపబడింది. ఇతడు రచించిన కథల పాక్షిక జాబితా[1]:

  • (క) మిషన్ పట్టుచీర
  • ఉదయం
  • ఎదురు తిరిగిన అలలు
  • ఎన్నాళ్లు ఇంకా
  • ఒరులేయవి యొనరించిన
  • గోరంతదీపము
  • చచ్చిపోయాను కాను
  • చుట్టలు
  • పడవ
  • బొమ్మలాంతరు
  • మరి మీకెలా కనబడుతోందీ లోకం?
  • మహాభినిష్క్రమణం
  • ముగింపు
  • ముసుగు
  • సదసత్సంశయం
  • మనకొద్దీ మంచితనం
  • ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్...
  • దిగులు
  • కళ్యాణం

మూలాలు

[మార్చు]
  1. web master. "రచయిత: మల్లాప్రగడ రామారావు". కథానిలయం. కథానిలయం. Retrieved 14 December 2023.