నాగరాజు కువ్వారపు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాగరాజు కువ్వారపు
జననంనాగరాజు
(1991-09-21) 1991 సెప్టెంబరు 21 (వయసు 32)
పేరువంచ, క‌ల్లూరు మండలం, ఖమ్మం జిల్లా
నివాస ప్రాంతంహైదరాబాద్, తెలంగాణ
ఇతర పేర్లురాజ్
వృత్తిసినీగేయ రచయిత, కవి
ఎత్తు5.8"
బరువు72
మతంహిందూ
భార్య / భర్తపల్లవి
పిల్లలుఅభిజ్ఞ,
తండ్రిశ్రీనివాసరావు
తల్లిఅరుణ

నాగరాజు కువ్వారపు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వర్ధమాన సినీగేయ రచయిత,[1] కవి.[2]

నేపథ్యం[మార్చు]

నాగరాజు 1991, సెప్టెంబర్ 21న శ్రీ‌నివాస‌రావు, అరుణ‌ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా క‌ల్లూరు మండ‌లంలోని పేరువంచ గ్రామంలో జ‌న్మించాడు.[3] వీరిది వ్య‌వ‌సాయ కుటుంబం. తండ్రి శ్రీ‌నివాస‌రావు క‌ల్లూరు ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల‌లో తెలుగు అధ్యాప‌కులుగా ప‌నిచేస్తున్నాడు. త‌ల్లి గృహిణి. ప్రాధ‌మిక ఉన్న‌త పేరువంచ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో పూర్తి చేశాడు. నాగ‌రాజు తండ్రి వెన‌క త‌రాల వారు నుండి పాట‌లు పాడేవారు. త‌ల్లి వెన‌క త‌రాల వారంతా వాయిద్య‌కారులు అవ‌డంవ‌ల్ల నాగ‌రాజు చిన్న‌ప్ప‌టి నుండే పాట‌లు బాగా పాడేవాడు. ఆయ‌న‌లోని ప్ర‌తిభ‌ను గుర్తించిన హిందీ టీచ‌ర్ జ‌గ‌న్నాధ‌రావు గారు ఎంతో ప్రోత్స‌హించ‌డంతో, ప‌లు కార్యక్ర‌మాల‌లో 9 సార్లు ఉత్త‌మ గాయ‌కుడిగా అవార్డులు లభించాయి. 10వ త‌ర‌గ‌తిలో రంగారావు మాష్టారి ప్రోత్సాహంతో స్కూల్ ఫ‌స్ట్ వ‌చ్చి, పాట‌ల‌లోనే కాదు చ‌దువులోనూ త‌ను ముందే అని నిరూపించుకున్నాడు.


సాహిత్య బీజం[మార్చు]

నాగ‌రాజు 10వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న సంవ‌త్స‌రం 2006-2007. ఆ సంవ‌త్స‌ర‌మే వందేమాత‌రం గీతం రాసి 100 సంవ‌త్స‌రాలు అవ‌డంతో నియోజ‌కవ‌ర్గ స్థాయిలో వ్యాస‌ర‌చ‌న‌, వ‌కృత్వం పోటీలు నిర్వ‌హించారు. ఆ పోటీలో నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో వ్యాస‌ర‌చ‌న‌లో మొద‌టి బ‌హుమ‌తి పొందాడు. అప్ప‌టి నుంచి సాహిత్యం పై మ‌క్కువ‌ పెరిగి క‌విత్వం వైపు ఆక‌ర్షితుడ‌య్యాడు.

ఉన్న‌త విద్య‌[మార్చు]

ఇంట‌ర్మీడియ‌ట్‌ స్పెక్ట్రా జూనియ‌ర్‌ క‌ళాశాల‌లో పూర్తి చేశారు. ఆ స‌మ‌యంలో క‌విత్వంలోని మాధుర్యాన్ని అనుభ‌వించాడు. 2009-2013 ఖ‌మ్మంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాల‌జీ అండ్ సైన్సెస్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్‌లో బి.టెక్ బ్యాచ‌ల‌ర్ డిగ్రీని పొందాడు. ప్ర‌తి సంవ‌త్స‌రం క‌ళాశాల‌లో నిర్వ‌హించే 'ఎక‌త్రా' అనే టెక్నిక‌ల్ & క‌ల్చ‌ర‌ల్ ఫెస్ట్ లో క్రీయాశీలంగా ప‌నిచేసేవాడు. ఆ స‌మ‌యంలో బొల్ల‌గాని వీర‌భ‌ద్రం అనే తెలుగు మాష్టారిని గురువుగా స్వీక‌రించాడు. ఆయ‌న స‌న్నిహిత్యంలో 400 క‌విత్వాలు రాశాడు.

క‌విత్వ ప్ర‌చురితాలు[మార్చు]

 • నీటి ప్రాముఖ్య‌త‌పై రాసిన 'జ‌ల‌మే జీవం' అనే క‌విత `నేటి నిజం` ప‌త్రిక‌లో ప్ర‌చురిత‌మైంది.
 • 'తీపిగాయాల యుగ‌ళ‌గీతం'[2]

పాటల రచయితగా[మార్చు]

మొదటగా ల‌వ్ అన్‌ ప్లెగ్డ్ అనే లఘుచిత్రానికి నాగ‌రాజు రాసిన 'ఈ క్ష‌ణ‌మే' అనే పాట 2013, డిసెంబ‌ర్ 15న ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో విడుద‌లైంది. 2015, ఆగ‌స్టు 15న స్వేరోస్ నిర్వ‌హించిన రాష్ట్రస్థాయి క్రీడ‌ల‌ను ఉద్దేశించి రాసిన 'లవ్ ఇండియా' పాట నాగరాజు మంచి పేరును తెచ్చిపెట్టింది.

సినీరంగ ప్ర‌వేశం[మార్చు]

2015లో వచ్చిన అమీర్‌పేటలో చిత్రంలోని 'సాప్ట్‌వేర్ లైఫ్‌కోసం' అనేపాటతో సినీరంగ ప్ర‌వేశంచేశాడు.[4] 2017, డిసెంబరు 15న విడుదలైన ఉందా.. లేదా? అనే చిత్రంలో రెండు పాట‌లు రాశాడు.[5] 2020, జనవరి 3న విడుదలైన ఉత్తర చిత్రంలో 'ఓ చూపే చుక్కల ముగ్గుల' పాటను రాశాడు. ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 100 పాట‌ల‌ను రాశాడు.[6]

అవార్డులు[మార్చు]

 • 2016 సంవ‌త్స‌రానికి గానూ, ఉత్త‌మ గీత ర‌చ‌యిత‌గా 'నాన్న‌తో అనుబంధం' అనే డాక్యుమెంట‌రీ చిత్రానికి అవార్డు వ‌చ్చింది.
 • 2017, మార్చి 19న న 'తెలంగాణ‌ క‌ళాప‌రిష‌త్‌' ఖ‌మ్మం వారు గీత ర‌చ‌యిత‌గా ఉగాది పుర‌స్కారాన్ని అందించారు.[1]
 • 2020, జనవరి 19న కాకతీయ కళోత్సవంలో 'కాకతీయ కళాకెరటం' పురస్కారం అందుకున్నాడు.[7]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 నమస్తే తెలంగాణ. "సినీగేయ రచయిత నాగరాజుకు తెలంగాణ ఉగాది పురస్కారం". Retrieved 22 March 2017.[permanent dead link]
 2. 2.0 2.1 వన్ ఇండియా. "తెలుగు కవిత: తీపి గాయాల యుగళగీతం". telugu.oneindia.com. Retrieved 22 March 2017.
 3. కల్లూరు టూ అమీరుపేటలో, నవ తెలంగాణ ఖమ్మం జిల్లా ఎడిషన్, ఏప్రిల్ 13, 2017.
 4. కల్లూరు టూ అమీరుపేటలో, నవ తెలంగాణ ఖమ్మం జిల్లా ఎడిషన్, ఏప్రిల్ 13, 2017.
 5. ఆంధ్రప్రభ, సినిమా (16 November 2017). "స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ఉందా లేదా." Archived from the original on 28 ఫిబ్రవరి 2020. Retrieved 28 February 2020.
 6. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (25 September 2021). "ప్రేమ గీతాల రాజు". Namasthe Telangana. తిరునగరి శరత్‌ చంద్ర. Archived from the original on 27 సెప్టెంబరు 2021. Retrieved 27 September 2021.
 7. ఇద్దరు జిల్లా వాసులకు అవార్డులు, ఆంధ్రజ్యోతి, ఖమ్మం జిల్లా ఎడిషన్, 21 జనవరి 2020, పుట. 6

ఇతర లంకెలు[మార్చు]