కల్లూరు (ఖమ్మం)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఇదే పేరుతో మరి కొన్ని గ్రామాలున్నాయి. వాటి లింకులకొరకు అయోమయ నివృత్తి పేజీ కల్లూరు చూడండి.


కల్లూరు,ఖమ్మం
—  మండలం  —
ఖమ్మం జిల్లా పటములో కల్లూరు,ఖమ్మం మండలం యొక్క స్థానము
ఖమ్మం జిల్లా పటములో కల్లూరు,ఖమ్మం మండలం యొక్క స్థానము
కల్లూరు,ఖమ్మం is located in Telangana
కల్లూరు,ఖమ్మం
తెలంగాణ పటములో కల్లూరు,ఖమ్మం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°12′16″N 80°33′13″E / 17.2044°N 80.5535°E / 17.2044; 80.5535
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండల కేంద్రము కల్లూరు,ఖమ్మం
గ్రామాలు 23
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 63,828
 - పురుషులు 31,800
 - స్త్రీలు 32,028
అక్షరాస్యత (2011)
 - మొత్తం 56.11%
 - పురుషులు 64.92%
 - స్త్రీలు 46.84%
పిన్ కోడ్ 507209

కల్లూరు, తెలంగాణ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక చిన్న పట్టణము (గ్రామము), అదే పేరుతో గల మండలానికి కేంద్రము. పిన్ కోడ్: 507209 .[1].

  • ఇది ఖమ్మం నుండి సత్తుపల్లి లేదా తిరువూరు వెళ్ళేదారిలో ఉంది. ఆ రెండు మార్గాలు ఇక్కడ చీలిపోతాయి.
  • ఇక్కడ ఓ చక్కర కర్మాగారము ఉంది.
  • ఈ ప్రాంతము గుండా నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ వెళ్తూ భూమిని సస్యస్యామలం చేస్తుంది.
  • ఈ పట్టాణములో మూడు "సీ" క్లాసు సినిమా హాళ్ళు ఉన్నాయి.ఇప్పుడు ఒక్కటి కూడా ఆడటం లేదు) ఒకటి తీసివేసి ఇళ్ళ స్తలాలుగా అమ్మేశారు,మరొ రెండింటిని వ్యాపారులు ధాన్యపు గొడవున్లకు ఉపయొగిస్తున్నారు.
  • దగ్గరలోని చాలా గ్రామాలకు ఇది ఓ విద్యాకేంద్రముగా, వ్యాపార కూడలిగా ఉంది.
  • ఈ ఊరులో ఎక్కువగా రైస్ మిల్లులు ఉన్నాయి.
  • పంచాయితి ఆఫీసు ఊరి సెంటర్ లోను, మిగిలిన ప్రభుత్వ కార్యాలయాలు యన్.స్.పి క్యాంప్ లోను ఉంటాయి.
  • కల్లూరులో ప్రభుత్వ కళాశాల ఉంది.
  • ఆర్.టి.సి బస్ స్టాండ్ ఊరికి కొంచెం దూరంలో ఉండటం వల్ల దీనిని ఎవరు ఉపయోగించటం లేదు, ఇది ప్రభుత్వ ఆసుపత్రి పక్కనే ఉంది.

విశేషాలు[మార్చు]

ఇక్కడ కల్లూరు పెద్దచెరువు అనే ఒక చెరువు ఉంది .. ఇది ఈ మండలం చుట్టుపక్కల గల గ్రామాలకు తాగునీటి అవసరాలను తీరుస్తుంది. ఈ చెరువు నాగార్జునసాగర్ కెనాల్ ద్వారా నిండుతుంది. ఈ ఊరిలో ప్రభుత్వ ఆసుపత్రి ఉంది . ప్రతి శనివారం ఇక్కడ సంత జరుగుతుంది .. ఇందులో ఎక్కువగా పశువులు అమ్మకం జరుగుతుంది.

  • ఈ గ్రామములో, శ్రీ సంతాన వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి, గోపాలదేవబోయినపల్లి గ్రామములో, 217.11 ఎకరాల మాన్యం భూములున్నవి. సారవంతమైన ఈ భూములలో నాగార్జునసాగరు కాలువల ద్వారా ఏడాదికి రెండు పంటలు పండుతవి.
[1]
కల్లూరులో మెయిన్ రోడ్
కల్లూరు హైవే జంక్షన్
కల్లూరు షుగర్ ఫ్యాక్టరీ

[1] ఈనాడు ఖమ్మం, 29 నవంబరు 2013. 1వ పేజీ.

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 63,828 - పురుషులు 31,800 - స్త్రీలు 32,028

మూలాలు[మార్చు]