Jump to content

నాగరాజు సురేంద్ర

వికీపీడియా నుండి
నాగరాజు సురేంద్ర
నాగరాజు సురేంద్ర
జననం1953
వృత్తివైద్యుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కవి, రచయిత, వైద్యుడు
నోట్సు
సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం 2023

నాగరాజు సురేంద్ర , తెలంగాణ రాష్ట్రం , కరీంనగర్ జిల్లా, కరీంనగర్ మండలం లోని ఎలగందుల గ్రామానికి చెందిన కవి, రచయిత. పవన్ కె. వర్మ రాసిన ‘గాలిబ్: దమ్యాన్, ద టైమ్స్’' గ్రంథాన్ని గాలిబ్ నాటి కాలం పేరుతో తెలుగు భాషలో అనువదించి పుస్తకం ప్రచురించినందుకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం - 2023 లభించింది.[1][2][3] ఎలనాగ కలం పేరుతో రచనలు చేస్తూ రాణిస్తుంటాడు. వృత్తిరీత్యా వైద్యుడు, ప్రవృత్తి రీత్యా కవి, రచయిత, అనువాదకుడు, విమర్శకుడుగా ప్రసిద్ధి.

జీవిత విశేషాలు

[మార్చు]

నాగరాజు సురేంద్ర, కరీంనగర్ జిల్లా , ఎలగందుల గ్రామంలో 1953లో జన్మించాడు.[4] అతను ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పడే రచనా వ్యాసంగం ప్రారంభించాడు. విద్యార్థి దశలో అతను రాసిన కవిత మొదటిసారిగా కరీంనగర్ నుండి అప్పట్లో వెలువడుతుండిన ‘గౌతమి’ అనే పత్రికలో ప్రచురితమైంది. అప్పుడు మొదలైన రచనా వ్యాసంగం మెడిసిన్ చదువుతున్నప్పుడు మరింత విస్తరించింది.

వృత్తి

[మార్చు]

1. వైద్య విధాన పరిషత్ లో రాష్ట్ర స్థాయిలో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు.

పుస్తకాలు

[మార్చు]
  • వాగంకురాలు (కవితా సంపుటి)
  • సజల నయనాల కోసం (కవితా సంపుటి)
  • అంతర్లయ (కవితా సంపుటి)
  • అంతర గాంధారం (కవితా సంపుటి)
  • అంతర్నాదం (కవితా సంపుటి)
  • పెన్మంటలు – కోకిలమ్మ పదాలు (గేయసంపుటి)
  • అంతస్తాపము (ఛందోబద్ధ పద్యాల సంపుటి)
  • మోర్సింగ్ మీద మాల్కౌఁస్ రాగం (ప్రయోగ పద్యాల సంపుటి)
  • కొత్తబాణి (ప్రయోగ పద్యాల సంపుటి)
  • పొరుగు వెన్నెల (ఆంగ్లం నుండి తెలుగులోకి తర్జుమా చేసిన కవితా సంపుటి)
  • ఊహల వాహిని (ఆంగ్లం నుండి తెలుగులోకి తర్జుమా చేసిన కవితా సంపుటి)
  • ఫేడెడ్ లీవ్స్ అండ్ ఫైర్ ఫ్లైస్ (ఆంగ్లం నుండి తెలుగులోకి తర్జుమా చేసిన కవితా సంపుటి)
  • ఇంప్రెషన్-ఇమేజెస్ (ఆంగ్లం నుండి తెలుగులోకి తర్జుమా చేసిన కవితా సంపుటి)
  • మెమొరబుల్ మెలోడీ మేకర్స్ అండ్ అదర్ పోయెమ్స్ ఆన్ మ్యూజిక్ (ఆంగ్లం నుండి తెలుగులోకి తర్జుమా చేసిన కవితా సంపుటి)
  • కథాతోరణం (వివిధ దేశాల కథల అనువాద గ్రంథం)
  • గాలిబ్ – నాటి కాలం (పవన్ కె. వర్మ రాసిన ‘గాలిబ్: దమ్యాన్, ద టైమ్స్’ గ్రంథ అనువాదం)
  • భాషాసవ్యతకు బాటలు వేద్దాం
  • యుక్తవాక్యం
  • నుడిక్రీడ (ప్రామాణిక గళ్లనుడికట్ల పుస్తకం)
  • పన్’నీటి జల్లు
  • మేధామథనం
  • పళ్లెరం (భాష, సాహిత్యం, సంగీతాల మీద రాసిన వ్యాసాల సంపుటి)
  • ఉత్తమ ఆఫ్రికన్ కథలు

పురస్కారాలు

[మార్చు]
  • తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారం-2017.
  • కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం-2023.

మూలాలు

[మార్చు]
  1. "నాగరాజు సురేంద్రకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం". EENADU. Retrieved 2024-03-12.
  2. https://www.eenadu.net/telugu-news/ap-top-news/general/2501/124048895
  3. "[[ఎలనాగ]]కు సాహిత్య అకాడమీ అనువాద అవార్డు - Prajasakti". 2024-03-11. Retrieved 2024-03-13. {{cite web}}: URL–wikilink conflict (help)
  4. telugu, NT News (2024-03-12). "నాగరాజు సురేంద్రకు కేంద్ర సాహిత్య అవార్డు". www.ntnews.com. Retrieved 2024-03-13.

వెలుపలి లింకులు

[మార్చు]