అక్షాంశ రేఖాంశాలు: 18°25′35″N 79°02′27″E / 18.426493°N 79.040847°E / 18.426493; 79.040847

ఎలగందల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎలగందల్, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, కొత్తపల్లి మండలంలోని గ్రామం.[1]

ఎలగందల్
—  రెవెన్యూ గ్రామం  —
ఎలగందల్ is located in తెలంగాణ
ఎలగందల్
ఎలగందల్
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 18°25′35″N 79°02′27″E / 18.426493°N 79.040847°E / 18.426493; 79.040847
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్ జిల్లా
మండలం కొత్తపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,937
 - పురుషుల సంఖ్య 1,976
 - స్త్రీల సంఖ్య 1,961
 - గృహాల సంఖ్య 997
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఇది మండల కేంద్రమైన కరీంనగర్ నుండి 10 కి. మీ. దూరంలో కామారెడ్డి రోడ్డి మార్గంలో మానేరు నది తీరాన ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత కరీంనగర్ జిల్లా లోని కరీంనగర్ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన కొత్తపల్లి మండలం (కరీంనగర్) లోకి చేర్చారు.  [2] 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 997 ఇళ్లతో, 3937 జనాభాతో 1720 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1976, ఆడవారి సంఖ్య 1961. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 577 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 7. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 572304[3].పిన్ కోడ్: 505401.

గ్రామం పేరు వెనుక చరిత్ర

[మార్చు]

పూర్వం ఈ ఊరి పేరు బహుధాన్యానగరం. కాకతీయుల కాలం నుండి ఎలిగందులగా పిలవబడుతుంది.ఈ గ్రామం చుట్టు పక్కల పూర్వం తెల్ల కందులు ఎక్కువగా పండేవట. అలా తెల్లకందుల, ఎలగందులగా మారి పేరు స్థిరపడిందని చెబుతారు. తెల్లకందుల అన్న పేరు చింతామణి చెరువు వద్ద ఉన్న శాసనంలో స్పష్టంగా చెక్కబడి ఉంది.[4]

గ్రామం చరిత్ర

[మార్చు]

కాకతీయుల కాలం నాటి సామంతుల పాలనలో వైభవాన్ని చాటుకుంది. నిమ్మల (నిర్మల్) పాలకుడు శ్రీనివాసరావు కాలంలో ఇది అతని అధీనంలో ఉండేది. 1754లో ఎలగందల్ కోటకు ధ్వంస అధిపతిగా ఉన్నప్పుడు నిజాం నవాబు ఆసఫ్ జా ఆజ్ఞ మేరకు శ్రీనివాసరావును బంధించి అతను పాలకుడయ్యాడు.[5] 1905 వరకు ఎలగందల్ జిల్లాకు రాజధానిగా ఉంది. 1905లో రాజధాని కరీంనగరుకు మార్చి, జిల్లా పేరును కూడా కరీంనగర్ జిల్లాగా మార్చబడింది.

ఈ గ్రామం పూర్వం కాకతీయుల పాలనలోను, తరువాత ముస్లిం రాజుల పాలనలోను ఉన్నప్పటి చరిత్రాత్మక చిహ్నాలు ఇక్కడ ఉన్నాయి. ఎలగందల్ గ్రామం ఎంతో చారిత్రిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. పూర్వం ఐదు రాజవంశీయులు పరిపాలించారు. వారు కాకతీయులు, బహమనీ సుల్తానులు, కుతుబ్ షాహీలు, మొగలులు, ఆసఫ్ జాహీలు. ఎలగందల్‌లోని చారిత్రక ప్రదేశాల్లో శ్రీరామాలయం, నీలకంఠస్వామి ఆలయం, ఆలంగీరు మసీదు, నిజాముద్దౌలా అసఫ్‌జాహీ కూతురు మెహరున్నీసా ఖానుమ్ సమాధి మందిరం, అనేక ముల్లాలు, మౌల్వీల సమాధులు ముఖ్యమైనవి.

ఎలగందల్ కోటలోని మసీదు
ఎలగందల్ కోటలోని మసీదు ముందు వైపు నుండి

ఎలగందల్లో ఓ పురాతనమైన కోట (ఖిల్లా) ఉంది. ఈ మధ్యనే తెలంగాణ పర్యాటక శాఖ వారు దీనిని పర్యాటక స్థలంగా గుర్తించారు. ఎత్తైన కోట గోడలు, అగడ్తలు, బలమైన చెక్క తలుపులు, వంకర టింకర దారులు, రాజ దర్బారు కలిగిన మసీదులతో ఈ ఖిల్లా అలరారుతోంది. టర్కీ, ఫ్రెంచి ఇంజనీర్ల ప్రభావం వల్ల ఈ కోట అనేక విషయాల్లో మధ్యయుగపు ఐరోపా ఖండపు కోటలతో పోలి ఉంది.[6] ఈ గిరిదుర్గాన్ని తొలుత కాకతీయులు కట్టించారు. 1195లో ప్రసిద్ధ యాదవవంశపు రాజు జైతుగి ఎలగందుల కోటను వశపరచుకున్నాడు. 1345 నుండి 1439 వరకు బహమనీ సుల్తానుల పాలనలో ఉంది. మొఘలులు ప్రత్యక్షంగా 39 సంవత్సరాల పాటు పాలించారు. కరీంనగర్ గ్రామాన్ని స్థాపించిన సయ్యద్ కరీముద్దీన్ ఎలగందల్ కోటకు ఖిలాదారుగా పనిచేశాడు.[7] 1905 వరకు జిల్లా యొక్క పాలనా యంత్రాంగమంతా ఎలగందల్ కోట నందే కేంద్రీకృతమై ఉండేది.

మానేరు నదితీరంలో తాటిచెట్ల మధ్య సుందర ప్రకృతిక నేపథ్యంలో యలగందల్ కోట నిర్మించబడి ఉంది. కోటకు ఒకవైపు మానేరు నది, మరోవైపు ఎలగందల్ గ్రామం ఉన్నాయి. ఇక్కడ నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మానకొండూరు గ్రామానికి సొరంగమార్గమున్నదని ప్రతీతి.[8] కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన ఈ గిరి దుర్గం ఆ తరువాత బహమనీలు, కుతుబ్‌షాహీలు, ఇమాద్ షాలు, అసఫ్‌జాహీల పాలనలో జిల్లా యొక్క రాజకీయాలకు కేంద్రబిందువైంది. పురాతన జ్ఞాపక చిహ్నాలు కొండశిఖరాన ఉన్న కోట, తూర్పు ద్వారానికి వెలుపల ఉన్న బృందావన్ సరస్సు 1774లో జాఫర్ ఉద్దౌలా చేత నిర్మించబడింది. ముస్లిం సన్యాసులైన సయ్యద్ షా మునావర్ ఖాద్రి సాహెబ్, దూలా షాహ్ సాహెబ్, సయద్ మరూఫ్ సాహెబ్, షాహ్ తాలిబ్ బిస్మిల్లా సాహెబ్, వలీ హైదర్ సాహెబ్ల సమాధులు కదిలించినప్పుడు అక్కడ ఉన్న మినార్లు ఊగుతాయి. ఉన్నత పాఠశాల వద్ద మరోరెండు మీనార్లు ఉన్నాయి. ఈ మీనార్లు ఎక్కడానికి లోపలి నుండి మెట్లు ఉన్నాయి.

దో మినార్

ఈ గ్రామం లోనే ఇంకో చివర "దో మినార్ "అనే కట్టడం ఉంది. ఇది ముస్లింలు పండగ రోజుల్లో ప్రార్థన చేసే ఈద్‌గా. దీనిని బహమనీ సుల్తానులు నిర్మించారు. దీని పైకి వెళ్ళడానికి లోపలి నుండి మెట్లు వుంటాయి.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

ఈ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు (ఒకటి నుండి పదవ తరగతి వరకు) ఉన్నాయి.గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప బాలబడి ఆసిఫ్ నగర్లో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల కరీంనగర్లో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ కరీంనగర్లో ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కరీంనగర్లో ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

ఆరోగ్య కేంద్రం లేదు కాని ఊళ్ళో కొందరు ఆర్.ఎమ్.పీ. డాక్టర్లు ఉన్నారు.ఎల్గందల్లో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

ఎల్గందల్లో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

గ్రామానికి కమాన్ పూర్, బావుపేట మీదుగా ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

రాష్ట్ర రహదారి గ్రామం గుండా పోతోంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి.

ఏటీఎమ్, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆశా కార్యకర్త గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

ఎల్గందల్లో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 531 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 100 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 30 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 15 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 4 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 483 హెక్టార్లు
  • బంజరు భూమి: 151 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 404 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 808 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 230 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

ఎల్గందల్లో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 230 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

ఎల్గందల్లో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, ప్రత్తి, మొక్కజొన్న

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 225 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "కరీంనగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. District Census Handbook, Andhra Pradesh, Census 1961: Karimnagar
  5. నిర్మల్ చరిత్ర, అంకం రాములు రచయిత, ప్రథమ ముద్రణ మే 2007, పేజీ 39
  6. Journal of the Andhra Historical Research Society, Volume 35
  7. Encyclopaedia of the Hindu World: A-Aj, Volume 1 edited by Gaṅgā Rām Garg
  8. "Wild bears make Elgandal Fort their home - The Hindu". Archived from the original on 2010-11-23. Retrieved 2012-11-16.

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఎలగందల్&oldid=4326160" నుండి వెలికితీశారు