Jump to content

నాగార్జున్

వికీపీడియా నుండి
నాగార్జున్
పుట్టిన తేదీ, స్థలంవైద్యనాథ్ మిశ్రా
(1911-06-30)1911 జూన్ 30
సత్లాఖా గ్రామం, మధుబని జిల్లా, బీహార్
మరణం1998 నవంబరు 5(1998-11-05) (వయసు 87)
ఖ్వాజా సరాయ్, దర్భంగా జిల్లా, బీహార్
కలం పేరునాగార్జున్
వృత్తికవి, రచయిత, వ్యాసకర్త, నవలా రచయిత, బౌద్ధుడు
భాషహిందీ, మైథిలీ
జాతీయతఇండియన్
పురస్కారాలుసాహిత్య అకాడమీ అవార్డు, సాహిత్య అకాడమీ ఫెలోషిప్
చురుకుగా పనిచేసిన సంవత్సరాలు1930–1994
జీవిత భాగస్వామిఅపరాజితా దేవి

లువా తప్పిదం: bad argument #2 to 'title.new' (unrecognized namespace name 'Portal')
ఎల్.ఎన్ మిథిలా విశ్వవిద్యాలయంలోని లైబ్రరీ పార్కులో నాగార్జున్ శిల్పం

వైద్యనాథ్ మిశ్రా (30 జూన్ 1911 - 5 నవంబర్ 1998) ఒక హిందీ, మైథిలీ కవి. అతను అనేక నవలలు, చిన్న కథలు, జీవిత చరిత్రలు, యాత్రా కథనాలను రాసారు. తన కలం పేరు నాగార్జున్ తో సుపరిచితుడు. ప్రజాకవిగా గుర్తింపుతెచ్చుకున్న వైద్యనాథ్ మిశ్రాకు మరోపేరు జనకవి. అతని సాహితీసేవకు మైథిలి భాషలో ప్రముఖ కవిగా పరిగణించబడ్డాడు.[1][2]

జీవిత చరిత్ర

[మార్చు]

1911లో జూన్ 30న బీహార్‌లోని దర్భంగా జిల్లాలోని తరౌని గ్రామంలో వైద్యనాథ్ మిశ్రా జన్మించారు. అతను బీహార్‌లోని మధుబని జిల్లాలోని తన తల్లి గ్రామమైన సత్లాఖాలో ఎక్కువ రోజులు గడిపాడు. ఆ తర్వాత బౌద్ధమతం స్వీకరించి నాగార్జున్ గా పేరు మార్చుకున్నాడు. అతను మూడు సంవత్సరాల వయస్సులోనే తల్లిని కోల్పోయాడు. అతని తండ్రి ఆదరణ కరువైంది. ఇక బంధువుల సహాయంతో చదువు కొనసాగించాడు. అనతికాలంలోనే అసాధారణమైన విద్యార్థిగా ఎదిగి స్కాలర్‌షిప్‌లు సంపాదించగలిగాడు. సంస్కృతం, పాళీ, ప్రాకృత భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. అతని చదువు మొదట స్థానికంగా, ఆ తరువాత వారణాసి, కలకత్తాలలో సాగింది. చదువును కొనసాగిస్తూనే పార్ట్ టైమ్ ఉద్యోగం కూడా చేసాడు. అపరాజితా దేవితో వివాహం జరిగింది. ఆ దంపతులకు ఆరుగురు పిల్లలు ఉన్నారు.

అతను 1930ల ప్రారంభంలో యాత్రి (హిందీ:यात्री) అనే కలం పేరుతో మైథిలీ పద్యాలతో తన సాహిత్య జీవితాన్ని ప్రారంభించాడు. 1930ల మధ్య నాటికి, అతను హిందీలో కవిత్వం రాయడం ప్రారంభించాడు. సహరన్‌పూర్ (ఉత్తరప్రదేశ్)లో అతను ఉద్యోగరీత్యా ఉపాధ్యాయుడు. అయితే బౌద్ధ గ్రంధాలను లోతుగా పరిశోధించాలనే కోరికతో అతను అక్కడ ఎక్కువ కాలం ఉండలేదు. అతను శ్రీలంకలోని కెలానియాలోని బౌద్ధ విహారానికి వెళ్లాడు. అక్కడ 1935లో బౌద్ధ సన్యాసి అయ్యాడు. అక్కడ ఆశ్రమంలో గ్రంధాలను అభ్యసించాడు. అంతకుముందు అతని గురువు రాహుల్ సాంకృత్యాయన్ చేసినట్లే నాగార్జున్ అనే పేరును స్వీకరించాడు. ఆశ్రమంలో ఉన్నప్పుడు, అతను లెనినిజం, మార్క్సిజం సిద్ధాంతాలను కూడా అధ్యయనం చేశాడు. 1938లో భారతదేశానికి తిరిగి వచ్చే ముందు ప్రముఖ రైతు నాయకుడు, కిసాన్ సభ వ్యవస్థాపకుడు సహజానంద్ సరస్వతి నిర్వహించిన సమ్మర్ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ లో చేరాడు. 1930, 1940 లలో భారతదేశం అంతటా ప్రయాణించడానికి గణనీయమైన సమయాన్ని నాగార్జున్ వెచ్చించాడు.

స్వాతంత్య్రానికి ముందు, తరువాత అనేక సామూహిక మేల్కొలుపు ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. 1939, 1942ల మధ్య, బీహార్‌లో రైతు ఆందోళనకు నాయకత్వం వహించినందుకు బ్రిటీష్ కోర్టులచే జైలుకు వెళ్లాడు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చాలా కాలం పాటు జర్నలిజంలో నిమగ్నమయ్యారు.[3]

ఎమర్జెన్సీ కాలానికి (1975–1977) ముందు జయప్రకాష్ నారాయణ్ ఉద్యమంలో అతను చురుకైన పాత్ర పోషించాడు. ఎమర్జెన్సీ కాలంలో పదకొండు నెలల పాటూ జైలు శిక్ష అనుభవించాడు. అతను లెనినిస్ట్-మార్క్సిస్ట్ భావజాలంతో బలంగా ప్రభావితమయ్యాడు. అతను 1998లో తన 87వ ఏట దర్భంగాలో మరణించాడు.

అవార్డులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. An ocean of intellect passes into history The Tribune, 29 November 1998.
  2. Obituary http://www.revolutionarydemocracy.org.
  3. Poets of Mithila – Nagarjun
  4. Hindi authors