Jump to content

నాగిళ్ళ రామశాస్త్రి

వికీపీడియా నుండి
నాగిళ్ళ రామశాస్త్రి
నాగిళ్ళ రామశాస్త్రి చిత్రం
జననం
వృత్తిరచయిత, విమర్శకుడు
ఉద్యోగంవిద్యుత్ శాఖ ఉద్యోగి(పదవీవిరమణ)

నాగిళ్ళ రామశాస్త్రి రచయిత, కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షులు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటులో ఉద్యోగం చేసి పదవీవిరమణ చేసారు. ఆయన కాళోజీ కి అత్యంత సన్నిహితుడు. ఆయనకు కాళోజీ నారాయణరావు గారిలో నాలుగు దశాబ్దాల సాన్నిహిత్యం ఉన్నది. ఆయన ఎక్కువగా రాయలేదు.ఆయన ఒక సహృదహద సాహిత్యాధ్యయనశీలిగా గుర్తింపు పొందారు.ఆయన "కాళోజీ ముచ్చట్లు" తో తన వచర రచనా ప్రజ్ఞను ప్రపంచానికి తెలియజేసారు. ఈ పుస్తకం చదివితే మన మధ్యలేని కాళోజీతో గంటల తరబడి మాట్లాడినట్లు ఉంటుంది. అందులో మరుగున పడిపోతున్న తెలంగాణ నుడికారపు కమ్మదనం పరిమళభరితంగా పరిచయమవుతుంది.

ఆయన అనేక సాహితీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అయన "మిత్రమండలి" కి కన్వీనరుగా కూడా యున్నారు. ఆయన కాళోజీ ఫౌండేషన్ కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంటారు. కాళోజీ జ్ఞాపకార్థం మ్యూజియం ఏర్పాటుకు కృషిచేస్తున్నారాయన. ఆయన కవి కానప్పటికీ కరీంనగర్ జిల్లాలో ముల్కనూరు కు చెందిన శాస్త్ర అద్భుతమైన సాహిత్య విమర్శకుడుగా గుర్తింపబడ్డారు.

అవార్డులు

[మార్చు]

ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు 'జీవిత చరిత్ర'విభాగంలో లో "కీర్తి పురస్కారాన్ని" ప్రకటించారు.[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. "కాళోజీ స్వప్నం సాకారం చేద్దాం". Archived from the original on 2016-03-05. Retrieved 2015-06-30.
  2. తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రకటన[permanent dead link]
  3. Kirti Puraskar for Nagilla Rama Sastry
  4. "35 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". www.andhrajyothy.com. 2015-06-27. Archived from the original on 2022-09-17. Retrieved 2022-09-17.

ఇతర లింకులు

[మార్చు]