నాచగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం
నాచగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం | |
---|---|
భౌగోళికాంశాలు: | 17°49′28″N 78°31′13″E / 17.8243801°N 78.5204004°E |
స్థానం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | సిద్ధిపేట జిల్లా |
ప్రదేశం: | నాచారం, వర్గల్ మండలం |
నిర్మాణశైలి, సంస్కృతి | |
ప్రధానదైవం: | లక్ష్మీనరసింహస్వామి |
నాచగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, వర్గల్ మండలం, నాచారం గ్రామంలోని గుట్టపై ఉన్న దేవాలయం. గజ్వేల్ పట్టణం నుండి 18 కిలోమీటర్ల దూరంలో 44వ జాతీయ రహదారిపై ఉన్న తూప్రాన్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంటుంది. ఎంతో మహిమగల దేవాలయంగా పేరుగాంచిన ఈ దేవాలయం తెలంగాణలోనే రెండో యాదాద్రిగా పిలువబడుతోంది.[1]
చరిత్ర
[మార్చు]పూర్వం ఈ దేవాలయాన్ని శ్వేతగిరి, గార్గేయ తపోవనం అని పిలిచేవారు. నారదుడు ఇక్కడ ఓడిపోయాడని, నాచార్ అనే భక్తుడి పేరు మీదుగా ఈ ప్రాంతానికి నాచారం గుట్ట అని పేరు వచ్చిందని హిందూ పురాణాల ప్రకారం స్థానికులు చెబుతున్నారు. గర్భగుడి లోపల రాతిలో అందంగా చెక్కబడిన స్వయంబు నరసింహస్వామి, లక్ష్మీ కొలువై ఉన్నారు.
ప్రాగణంలోని ఇతర దేవాలయాలు
[మార్చు]ఈ దేవాలయ ప్రాగణంలో సాయిబాబా దేవాలయం, నవగ్రహాలయం, శివాలయం, రామాలయం, ఆండాళమ్మ దేవాలయం, భైరవాలయం మొదలైనవి ఉన్నాయి.
పూజలు-ఉత్సవాలు
[మార్చు]ఈ దేవాలయలంలో ప్రతిరోజూ కుంకుమార్చన, అభిషేకం, వాహన పూజలు, శాశ్వత కల్యాణం, సత్యనారాయణ వ్రతాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు[2] స్వామివారి అధ్యయనోత్సవాలు వైభవంగా నిర్వహించబడుతాయి. శ్రావణ మాసంలో అనేకమంది భక్తులు వచ్చి స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొంటారు.[3]
అభివృద్ధి పనులు
[మార్చు]ఈ దేవాలయం సమీపంలో రూ. 7.48 కోట్లతో హల్ది వాగు సుందరీకరణ, చెక్‌డ్యామ్ నిర్మాణాలు, బతుకమ్మ ఘాట్లు, స్నానపు ఘాట్లు ఏర్పాటుచేశారు.
మూలాలు
[మార్చు]- ↑ "నాచగిరి క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తాం". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-04-09. Archived from the original on 2021-12-02. Retrieved 2021-12-02.
- ↑ "వైభగంగా నాచగిరి లక్ష్మీనరసింహుని బ్రహ్మోత్సవాలు". ETV Bharat News. Archived from the original on 2021-12-02. Retrieved 2021-12-02.
- ↑ "నాచగిరి ఆలయంలో శ్రావణ శోభ". andhrajyothy. Archived from the original on 2021-12-02. Retrieved 2021-12-02.