తూప్రాన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
తూప్రాన్
—  మండలం  —
మెదక్ జిల్లా పటములో తూప్రాన్ మండలం యొక్క స్థానము
మెదక్ జిల్లా పటములో తూప్రాన్ మండలం యొక్క స్థానము
తూప్రాన్ is located in Telangana
తూప్రాన్
తూప్రాన్
తెలంగాణ పటములో తూప్రాన్ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°50′41″N 78°28′48″E / 17.8447°N 78.4800°E / 17.8447; 78.4800
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మెదక్
మండల కేంద్రము తూప్రాన్
గ్రామాలు 34
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 60,580
 - పురుషులు 30,333
 - స్త్రీలు 30,247
అక్షరాస్యత (2011)
 - మొత్తం 54.51%
 - పురుషులు 68.35%
 - స్త్రీలు 40.16%
పిన్ కోడ్ {{{pincode}}}
తూప్రాన్
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మెదక్
మండలం తూప్రాన్
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

తూప్రాన్ (ఆంగ్లం: Toopran), తెలంగాణ రాష్ట్రములోని మెదక్ జిల్లాకు చెందిన ఒక మండలము. హైదరాబాదుకు సుమారు 55 కి.మీ. దూరంలో 7 వ నెంబరు జాతీయ రహదారిలో ఇది ఉంది. ఇక్కడికి దగ్గరలోని నాచారం నరసింహస్వామి దేవస్థానం చాలా ప్రసిద్ధి. ఈ గ్రామంలో ప్రాచీన రామాలయము, మహంకాళి దేవాలయము, బాలాంజనేయ స్వామి దేవాలయము ఉన్నాయి. ఈ గ్రామానికి ఈ పేరు రావడానికి గల కారణము ఈ గ్రామం తూర్పుకు రాణి వంటిది కావున తూర్పురాణి అని పిలిచేవారు. కాలక్రమంలో తూర్పురాణి కాస్త తూపురానీగా తరువాత తూప్రాన్గా మారింది.

చరిత్ర, సంస్కృతి[మార్చు]

 • ఈ గ్రామం కాకతీయుల కాలము నాటిదని ప్రశస్తి. ఈ గ్రామం తదనంతర కాలంలో దొంతి సంస్థానములో భాగంగా ఉండేది. దొంతి సంస్థానముకు మరియు వడ్డేపల్లి సంస్థానముకు సరిహద్దు గ్రామముగా విలసిల్లింది. ఆ కాలంలోనే మంచి వ్యాపార కేంద్రంగా భాసిల్లింది .
 • హిందు ముస్లిం సమైక్యత, హోలి నాడు జరిగే సంబరాల్లో పిడి తాడు లాగే సంప్రదాయం ఉంది. మహంకాలి జాతర తెలంగాణలో మొత్తము ముగిసిన తరువాత శ్రావణ మాసంలో ఘనంగా జరుగుతుంది, కుల, మత భేద రహితంగా అన్ని మతాల వారు ఇందులో పాల్గొంటారు. గ్రామములోని స్వయంభువు రామాలయములో ఏటా రామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుగుతాయి.

సదుపాయాలు[మార్చు]

 • ఒక ప్రాథమిక పాఠశాల, ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల బాలికలకు ప్రత్యేకంగా కలదు ఒక ప్రభుత్వ గురుకుల పాఠశాల ఉంది.
 • సుమారు 15 ప్రయివేటు పాఠశాలలు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జునియర్ కళాశాల, 3 ప్రయివేటు జునియర్ కళాశాలలు, 2 ప్రయివేటు డిగ్రి కళాశాలలు, ఒక ప్రయివేటు బిఎడ్, ఒక ప్రయివేటు బిఫార్మసి, 3 ప్రయివేటు పిజి కళాశాలలు ఉన్నాయి.
 • ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రము 8 ప్రయివేటు వైద్యశాలలు ఉన్నాయి. ఒక ప్రభుత్వ గ్రంథాలయం, పోస్టాఫీసు, బస్సు సౌకర్యం ఉంది. హైదరాబాదు నుండి, హైదరాబాదుకు ప్రతి 15 నిముషాలకు ఒకసారి బస్సులు ఉన్నాయి. సమీపాన 2 రైల్వేస్టేషన్లు ఉన్నాయి.
 • వివిధ రంగాలకు సంబంధించిన బహు వ్యాపార సంస్థలు ఉన్నాయి. 1 సినిమా హాలు ఉంది.

సమస్యలు[మార్చు]

 • ట్రాఫిక్ స్థిరీకరణ లెకపొవడం
 • పారిశుధ్య నిర్వహణ లోపం

ఆర్థికం[మార్చు]

 • గ్రామానికి ప్రధాన నీటి వనరు పెద్ద చెరువు, ఇదే కాక మేడక్క చెరువు, కొత్త చెరువు, వీటితో పాటు గ్రామానికి కిలోమీటరు దూరంలోని పసుపులేరు వాగుకు వెళ్ళె లింక్ కాల్వ కూడా వ్యవసాయానికి, త్రాగునీటికి ప్రధాన జల వనరులు, వరి, చెరుకు, మొక్కజొన్న ప్రధాన పంటలు, కూరగాయల సాగు కుడా జరుగుతుంది. సాధారణ గ్రామీణ వృత్తులు అన్ని యధావిధిగా కొనసాగుతున్నాయి. అదే విదంగా ప్రొ ఆగ్రొ, టాటా కాఫీ కంపెనిలు ఉన్నాయి.మరియు కాళ్ళకళ్ పెద్ద పారిశ్రామిక వాడ, పాడి పరిశ్రమ చాలా పెద్దది, సుగుణ కోళ్ళ దాణా కేంద్రము ఆసియాలోనే పెద్దది .

ఆలయాలు[మార్చు]

 • ప్రాచీన రామాలయం ఊరికి చివర కలదు, ఉజ్జయిని మహంకాళీ దేవాలయం కూడా ప్రాచీనమైనదే. అయితే ఉజ్జయిని మహంకాళీ దేవాలయానికి ఒక ప్రాముఖ్యత ఉంది. పట్టణానికి 55 కి.మీ. దూరంలో ఉన్న హైదరబాద్ లస్కర్ ఉజ్జయిని మహంకాళీ దేవాలయంలో అమ్మవారి ప్రతిష్ఠ గురించి అప్పటి పూజారులు మహారాష్ట్ర ఉజ్జయిని పట్టణం నుంచి గంఢ ద్వీపాన్ని తీసుకువస్తుండగా మార్గమధ్యంలో తూప్రాన్ పట్టణానికి చేరుకొగానే చీకటి పడడంతో వారు ఆ ద్వీపాన్ని, అక్కడ ద్వీపాన్ని వెలిగించి మరుసటి రోజు హైదరబాద్‌కు చేరుకున్నారు. గ్రామంలోని శ్రీ బాలాంజనేయ స్వామి దేవాలయం 500 సంవత్సరాల నాటిది. ప్రాచీన బాలాంజనేయ స్వామి దేవాలయమును 1994లో పునర్నిర్మాణము చేయడము జరిగింది. కప్పర నరసింహ స్వామి దేవాలయం ఉంది. ఇవేకాక 2 హనుమాన్ దేవాలయాలు, ఒక శివాలయము, ఒక అయ్యప్ప దేవాలయం, ఒక సాయి బాబ దేవాలయం, ఒక గీతా మందిరం ఉంది.

చర్చిలు, మసీదులు[మార్చు]

ప్రముఖులు[మార్చు]

ఇతర విశేషాలు[మార్చు]

1998-2004 కాలంలో చెక్ డ్యాంల నిర్మాణము జరిగింది. గ్రామము అంతటా సిసి రోడ్లు వేయడము జరిగింది .బైర్రాజు ఫౌండేషన్ వారి సహకారంతో మినరల్ వాటర్ ఫ్లాంట్‌ను గ్రామ పంచాయతి వారు నిర్మించడం జరిగింది. రీడ్స్ అనే స్వచ్ఛంద సంస్థ బాల కార్మికుల విద్యాభీవృద్దికై ఒక పాఠశాలను నిర్వహిస్తోంది .

 • తూప్రాన్‌కు సరిహద్దులుగా తూర్పున నాచారం లక్ష్మినరసింహ స్వామి వారు
 • పశ్చిమాన దొంతి వేణుగోపాల స్వామి వారు
 • దక్షిణాన బొజ్జమ్మ గుట్ట రాజరాజెశ్వర స్వామి వారు
 • ఉత్తరాన రామప్ప గుట్ట రామలింగేశ్వర స్వామి వార్లు వెలసి ఉన్నారు.
 • కాళ్ళకల్ వనదుర్గా మాత ఆలయము కలదు,
 • వెంకటాపురము (పిటి)లో లలితా పరమేశ్వరి దేవాలయం నిర్మాణంలో కలదు
 • గజ్వెల్ నియోజకవర్గములో తూప్రాన్ అతి పెద్ద మండలం
 • తూప్రాన్ మండలం క్రింద 132 పల్లెలు ఉన్నాయి

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 60,580 - పురుషులు 30,333 - స్త్రీలు 30,247

మూలాలు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]

Medak.jpg

మెదక్ జిల్లా మండలాలు

మనూరు | కంగిటి | కల్హేరు | నారాయణఖేడ్ | రేగోడు | శంకరంపేట (ఎ) | ఆళ్ళదుర్గ | టేక్మల్ | పాపన్నపేట | కుల్చారం | మెదక్ | శంకరంపేట (ఆర్) | రామాయంపేట | దుబ్బాక | మీర్‌దొడ్డి | సిద్దిపేట | చిన్న కోడూరు | నంగనూరు | కొండపాక | జగ్దేవ్ పూర్ | గజ్వేల్ | దౌలతాబాదు | చేగుంట | యెల్దుర్తి | కౌడిపల్లి | ఆందోళ్‌ | రైకోడ్‌ | న్యాల్కల్ | ఝారసంగం | జహీరాబాద్ | కోహిర్‌ | మునుపల్లి | పుల్కల్లు | సదాశివపేట | కొండాపూర్‌ | సంగారెడ్డి | పటాన్ చెరువు | రామచంద్రాపురం | జిన్నారం | హథ్నూర | నర్సాపూర్ | శివంపేట | తూప్రాన్ | వర్గల్‌ | ములుగు


"https://te.wikipedia.org/w/index.php?title=తూప్రాన్&oldid=2291796" నుండి వెలికితీశారు