నాన్సీ అలెన్
నాన్సీ అలెన్ | |
---|---|
జననం | బ్రోంక్స్, న్యూయార్క్, యుఎస్ | 1950 జూన్ 24
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1962–2008, 2012–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | రాండీ బెయిలీ
(m. 1998; div. 2007) |
భాగస్వామి | మైఖేల్ పారే (1984–1985) |
నాన్సీ అలెన్ అమెరికన్ సినిమా నటి. 1970లు, 1980ల ప్రారంభంలో బ్రియాన్ డి పాల్మా దర్శకత్వం వహించిన అనేక సినిమాలలో నటించి ప్రసిద్ధి చెందింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు, మూడు సాటర్న్ అవార్డులకు నామినేట్ అయింది.
జననం
[మార్చు]అలెన్ 1950, జూన్ 24న యూజీన్ - ఫ్లోరెన్స్ అలెన్ దంపతులకు న్యూయార్క్ నగరంలోని బ్రోంక్స్ బరోలో జన్మించింది.[1] తండ్రి పోలీసు లెఫ్టినెంట్.[2]
సినిమారంగం
[మార్చు]డ్యాన్సర్ శిక్షణ కోసం హైస్కూల్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ లో చదివింది. నటనపై ఆసక్తితో లాస్ ఏంజిల్స్ కు వెళ్ళింది. బ్రియాన్ డి పాల్మా తీసిన క్రిస్ హర్జెన్సన్ (1976) సినిమాలో తొలిసారిగా నటించింది. తరువాత రాబర్ట్ జెమెకిస్ దర్శకత్వం వహించిన ఐ వన్నా హోల్డ్ యువర్ హ్యాండ్ (1978) సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. తరువాత స్టీవెన్ స్పీల్బర్గ్ తీసిన 1941 (1979) లో సహాయక పాత్ర పోషించింది.
సైన్స్ ఫిక్షన్ సినిమాలైన స్ట్రేంజ్ ఇన్వేడర్స్ (1983), ది ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్ (1984), అబెల్ ఫెరారా తీసిన టివి సినిమా ది గ్లాడియేటర్ (1986) లో నటించింది. పాల్ వెర్హోవెన్రోబోకాప్ (1987) లో అన్నే లూయిస్ పాత్రను పోషించింది. పోల్టర్జిస్ట్ III (1988), లిమిట్ అప్ (1990), లెస్ పేట్రియాట్స్ (1994) సినిమాలలో నటించింది.
సినిమాలు
[మార్చు]- క్యారీ
- 1941
- బ్లో అవుట్
- ది గ్లాడియేటర్
- రోబోకాప్
- పోల్టర్జిస్ట్ III
- రోబోకాప్ 2
- రోబోకాప్ 3
- ది మ్యాన్ హూ వుడ్ నాట్ డై
- డస్టింగ్ క్లిఫ్ 7
- పాస్
- కిస్ టోలెడో వీడ్కోలు
- చిల్డ్రన్ ఆఫ్ ది కార్న్ 666: ఐజాక్ రిటర్న్
- సర్క్యూట్
- ఇన్ సెర్చ్ ఆఫ్ డార్క్నెస్: పార్ట్ II
మూలాలు
[మార్చు]- ↑ "Allen, Nancy, 1950 June 24–". Library of Congress. Washington, D.C. Archived from the original on October 13, 2016.
- ↑ "A More Physical Cop". Los Angeles Times. June 2, 1990. Retrieved 2023-07-04.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో నాన్సీ అలెన్ పేజీ