నామ అపరాధం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నారదుడు సనత్కుమారునితో "గురువర్యా! నామాపరాధములు ఎన్నియో సెలవిండు, జీవుడు నామ యజ్ఞము చేయవలెను. ఆ యజ్ఞము చేయునపుడు పతనము రాకుండుటకు మార్గము కూడా చెప్పుడు. ప్రాకృత బుద్ధితో నామము చేసిన యెడల ప్రాకృత ఫలమునే ఇచ్చును గదా! కావున వీటన్నిటిని గూర్చి విపులీకరించి తెలియజేయుడు" అని అడుగగా, మంగళ స్వరూపుడైన హరియే పరతత్త్వము. అప్రాకృత స్వరూపముతో భగవంతుడు వ్రజ మండలములో విహరించుచున్నాడు. ఆ హరియొక్క నామమును జపము చేయునపుడు కల్గు అపరాధములు ఫది. అవి ఈ క్రింద చెప్పినట్లుగా ఉన్నవి

  1. సాధు నింద
  2. శివాది దేవతలను భగవానునితో సమానమను భావము కలిగియుండుట
  3. శృతి శాస్త్ర నింద
  4. గురువును నిర్లక్ష్యము చేయుట
  5. ఇతర శుభ కర్మలతో నామము సమానమని తలంచుట
  6. నామము కల్పితమని భావించుట
  7. నామ బలముతో పాపము చేయుట
  8. విశ్వాస హీనునకు నామమును ఉపదేశించుట
  9. నామ మహిమను కేవలము స్తవమని తలంచుట
  10. శ్రీనామ మహాత్మ్యమును వినియు అహంకార మమకార యుక్తుడై నామము నందు రుచి లేనివాడగుట