నాయని సుబ్బారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాయని సుబ్బారావు
నాయని సుబ్బారావు సాహితీ జీవితం పుస్తక ముఖచిత్రం
జననంనాయని సుబ్బారావు
అక్టోబర్ 29, 1899
ప్రకాశం జిల్లా పొదిలి
మరణంజూలై 8, 1978
వృత్తిఉపాధ్యాయుడు
ప్రసిద్ధితెలుగు భావకవి. భారత స్వాతంత్ర్యసమరయోధుడు.
భార్య / భర్తహనుమాయమ్మ
పిల్లలునాయని కృష్ణకుమారి

నాయని సుబ్బారావు (అక్టోబర్ 29, 1899 - జూలై 8, 1978) తొలితరం తెలుగు భావకవి, భారత స్వాతంత్ర్యసమరయోధుడు.

జననం[మార్చు]

సుబ్బారావు అక్టోబర్ 29, 1899న ప్రకాశం జిల్లా పొదిలి పట్టణములో జన్మించాడు.

ఈయన రచనలలో ప్రముఖమైనది 1937లో రాసిన సౌభద్రుని ప్రణయ యాత్ర అనే ఆత్మ కథాత్మక కావ్యం. ఈయన మాతృగీతాలు (1939), వేదనా వాసుదేవము (1964), విషాద మోహనము (1970) అనే స్మృతి కావ్యాలూ, జన్మభూమి (1973) అనే మహాకావ్యమూ రాశాడు.వీరి సౌభద్రుని ప్రణయయాత్ర సుప్రసిద్ధం. తానే అర్జునుడు . తాను ప్రేమించిన మేనకోడలు సుభద్ర సరస మధుర కావ్యమిది.ఫలశ్రుతి, నిత్యక్రీడ మొదలైన ఖండికలు విశిష్టాలు. నాయని వారి మాతృ గీతాలు బాగా ప్రచారం పొందాయి.

సుబ్బారావు స్వాతంత్ర్యపోరాటములో సహాయనిరాకరణోద్యమములో పాల్గొన్నాడు. ప్రముఖ తెలుగు కవయిత్రి నాయని కృష్ణకుమారి ఈయన కూతురు. విశ్వనాథ సత్యనారాయణ, తన వేయి పడగలు నవలలో కిరీటీ పాత్రను నాయని సుబ్బారావు దృష్టిలో పెట్టుకునే చిత్రించారు.

1928 నుండి అధ్యాపక వృత్తిలో కొనసాగి,[1] 1955లో గుంటూరు జిల్లా, నరసరావుపేట పురపాలక ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పదవీ విరమణ చేసిన సుబ్బారావు. 1958లో హైదరాబాదు నగరంలో నివాసమేర్పరచుకొని హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో ఆయా ప్రసారాలకు అవసరమయ్యే విషయాలను వ్రాసే పనిని చేపట్టాడు. ఎక్కువగా గ్రామస్థుల కార్యక్రమాలకు వ్రాస్తుండేవాడు. స్త్రీల కార్యక్రమాలు నడిపే న్యాపతి కామేశ్వరి కూడా సుబ్బారావుచే తన కార్యక్రమాలకు కవితలు, పద్యాలు, నాటికలు వ్రాయించుకునేది.[2]

హైదరాబాదుకు వచ్చిన కొత్తలో వివిధ అంశాలపై వ్రాసిన 25 ఖండికలను భాగ్యనగర కోకిల అనే కావ్యంగా ప్రకటించాడు.

మరణం[మార్చు]

నాయని సుబ్బారావు 1978, జూలై 8న మరణించాడు.

మూలాలు[మార్చు]

3. https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Prasarapramukulu022372mbp.pdf/23