నాయిని రాజేందర్ రెడ్డి
నాయిని రాజేందర్ రెడ్డి | |||
పదవీ కాలం 2023 డిసెంబర్ 03 - ప్రస్తుతం | |||
ముందు | దాస్యం వినయ్‌భాస్కర్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | పశ్చిమ వరంగల్ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1965 వరంగల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | నీలిమ | ||
సంతానం | విశాల్ రెడ్డి | ||
నివాసం | నయీమ్ నగర్ జాగృతి కాలనీ, హనుమకొండ[1] |
నాయిని రాజేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికల్లో పశ్చిమ వరంగల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2][3]
రాజకీయ జీవితం
[మార్చు]నాయిని రాజేందర్ రెడ్డి విద్యార్థి దశ నుండే కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్‌ఎస్‌యూఐ నాయకుడిగా, లైబ్రరీ కమిటీ చైర్మన్‌గా, యూత్ కాంగ్రెస్‌లో వివిధ హోదాల్లో పని చేసి 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు 2014 ఏప్రిల్‌లో డిసిసి ఇంచార్జి అధ్యక్షుడిగా బాధ్యతలు ఆ ఎన్నికల్లో అసెంబ్లీ టిక్కెట్ నిరాకరించినందుకు నిరసనగా రాజీనామా చేశాడు.
నాయిని రాజేందర్ రెడ్డి 2015లో ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[4] ఆయన 2018లో పశ్చిమ వరంగల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ టికెట్ ఆశించగా, ఆ ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా టీడీపీకి కేటాయించింది.[5]
నాయిని రాజేందర్ రెడ్డి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ వరంగల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ పై 15331 ఓట్ల మెజారితో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[6][7]
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (30 March 2023). "రాహుల్‌జీ మా ఇంటికి రండి." Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ 10TV Telugu (4 December 2023). "119 అసెంబ్లీ నియోజకవర్గాల విజేతలు ఎవరో తెలుసుకోండి" (in telugu). Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Andhrajyothy (4 December 2023). "TS Elections Winners: విజేతల వివరాలు ఇలా." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
- ↑ The Hindu (12 January 2015). "Naini Rajender Reddy is Warangal DCC" (in Indian English). Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
- ↑ The New Indian Express (14 November 2018). "Ally got his seat, but this Congress leader Naini Rajender Reddy to go ahead with nomination". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
- ↑ BBC News తెలుగు (5 December 2023). "తెలంగాణ రిజల్ట్స్ 2023: మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు?". Archived from the original on 5 December 2023. Retrieved 5 December 2023.
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.