Jump to content

నార్ల చిరంజీవి

వికీపీడియా నుండి
నార్ల చిరంజీవి

నార్ల చిరంజీవి (1925-1971) ఒక ప్రముఖ కవి, కథకుడు, నాటక కర్త, బాల సాహిత్యకారుడు, సినీ గీత రచయిత.[1] కమ్యూనిస్టు ఉద్యమంలోనూ, అభ్యుదయ రచయితల ఉద్యమంలోనూ ఇతర ప్రజా ఉద్యమాలలోనూ పనిచేశాడు. విశాలాంధ్ర దినపత్రిక లో కొంత కాలం పాటు చిన్నారి లోకం అనే బాలల శీర్షికను నిర్వహించాడు. 1949-50 లలో విజయవాడ ఆకాశ వాణి కేంద్రంలో పనిచేశాడు.

బాల్యం

[మార్చు]

నార్ల చిరంజీవి 1925 మే 1 న కృష్ణా జిల్లా, గన్నవరం తాలూకా, కాటూరు గ్రామంలో జన్మించాడు. ఈయన పెద్దగా చదువుకోక పోయినా, సంస్కృతం, తెలుగు, హిందీ భాషల్లో పట్టు సంపాదించుకున్నాడు.

రచనలు

[మార్చు]
  • ఎర్రగులాబీ
  • తెలుగు పూలు
  • కర్రా-చెప్పులు
  • పేనూ-పెసర చేను

భాగ్య నగరం అనే గేయనాటిక బాగా ప్రాచుర్యం పొందింది. సినిమా రంగంలో ప్రవేశించి కొన్ని చలన చిత్రాలకు స్క్రిప్టు రచయితగా, కొన్ని సినిమాలకు పాటలు రాశాడు. వీనిలో ఆరాధన (1962 సినిమా) ఒక సినిమా.[2]

ఆయన జీవిత చరిత్ర అగ్ని సరస్సున వికసించిన వజ్రం నార్ల చిరంజీవి అనే పుస్తకంగా ప్రచురితమైంది.

మరణం

[మార్చు]

1971, అక్టోబరు 16న అనారోగ్యంతో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2013-11-17.
  2. యూ ట్యూబ్ లో ఆరాధన పూర్తి సినిమా.