Jump to content

కలువ

వికీపీడియా నుండి
(నింఫియేసి నుండి దారిమార్పు చెందింది)

కలువ
Temporal range: 130–0 Ma Early Cretaceous - Recent
Giant Water Lily sprouting a flower
Scientific classification
Kingdom:
(unranked):
Order:
Family:
నింఫియేసి

ప్రజాతులు
Flower of Victoria cruziana or Victoria regia, giant water lily of the Amazon basin.

కలువ (శాస్త్రీయ నామం: నింఫియేసి Nymphaeaceae) నింఫియేలిస్ (Nymphaeales) క్రమానికి చెందిన పుష్పించే మొక్కల కుటుంబం. ఈ జాతి పువ్వుల్ని తెలుగులో కలువ పువ్వులు అనే పేరుతో వ్యవహరిస్తారు. కలువపువ్వులు అనేక మెత్తని మృదువైన రేఖలు కలిగి ఉండి, చెరువు లలోను, కొన్ని నీటి కుంటలలో, కాలువలలో కనిపిస్తాయి. కలువ పువ్వులు తెలుగు ప్రాంతాల్లోని అన్ని తటాకాల్లో, చెరువుల్లోనూ కనిపించే పుష్పం. కలువ పువ్వును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పుష్పంగా గుర్తించింది. మాగ్నోలిప్సిడా తరగతికి చెందిన ఈ పుష్పాన్ని ఇంగ్లీష్ లో వాటర్ లిల్లీ (water lily) అని పిలుస్తారు. నీటిలోని భూభాగంలోనికి పొడవాటి కాడతో పెరిగే ఈ పువ్వులు తెలుపు, గులాబీ, నీలం రంగుల్లో చాలా అందంగా కనిపిస్తాయి.

కలువపువ్వు విశేషాలు

[మార్చు]

కలువ కుటుంబ లక్షణాలు

[మార్చు]

కలువ మొక్కలు మన దేసమందంతటను బెరుగు చున్నవి. వేళ్ళు బురదలో నాటుకొని యుండును.

  • ప్రకాండము నీళ్ళలోనె పొట్టిగా నుండును.
  • ఆకులు : పెద్దవి. గుండ్రము, తొడిమలు మిక్కిలి పొడుగుగాను గుండ్రముగాను నున్నగాను నుండును. ఇవి కడ్డివలె గట్టిగాలేవు. వీని పొడుగునను సొరంగములలో గాలి యుండును. కావున ఆకులు నీటి మీద తేలును. కాడలు వంగ గల్గుట చేతను సాగ గల్గుట చేతను నీరు తగ్గినను హెచ్చిననను ఆకులు నీటి మీదనే తేలు చుండును. కాడ పత్రముతో గలియు చోట నెత్తుగా కణుపు వలె నున్నది. పత్రము రెండు వైపుల సన్నగా నుండును. 72
  • పుష్పమంజరి : నీటి లోపల నుండి దీర్ఘమౌ కాడపైకి వచ్చును. కాడ చివర నొక్కటే పుష్పము గలదు. పుష్పము వికసింపక మొగ్గగా నున్నప్పుడు నీళ్ళలోనే యుండును.
  • పుష్పకోశము : రక్షక పత్రములు 4. నిడివి చౌకపు నాకారము. అడుగు ఆకు పచ్చగాను పైన తెల్లగా నుండును. నీచము.
  • దళవలయము : ఆకర్షణ పత్రములు అసంఖ్యములు వృంతాశ్రితము తెల్లగా నుండును.
  • కింజల్కములు : అసంఖ్యములు వెలుపల నున్నవి. వెడల్పుగాను ఆకర్షణ పత్రముల వలెను మాఱియు నుండును. వృతాశ్రితము.
  • అండకోశము : పుష్ప పళ్ళెరములో దిగియున్నది. ఉచ్చము. చాల గదులు గలవు. ఒక గదులో చాల గింజలు గలవు. కుడ్య సంహోగము గింజలకు బీజ పుచ్ఛము గలదు. కాయ కండకాయ.

కలువయు దామర యు నొక కుటుంబము లోనివే. ఈ కుటుంబపు మొక్కలన్నియు నీళ్ళలోనె పెరుగును. ఆకుల యొక్కయు పుష్పముల యొక్కయు గాడలు మిక్కిలి పొడుగుగా నుండును. వీని యందు గాలి యుండుటకు సొరంగములు ఉన్నాయి. వీనిలో పుష్స్పములు పూచెడు కాడకు నొక్కటే పుష్పముండును. ఇందు నాకర్షణ పత్రమును కింజల్కములును బెక్కులు గలవు. అండాశయములు కూడ చాల యున్నవి. వీని గదులలో సన్నిగోడల నుండియు గింజలు పుట్టు చున్నవి. 73

కలువ మొక్క ప్రతి చెరువులోను దొరువుల లోను పెరుగ గలదు గాని తామర మొక్క పెరుగ జాలదు. ఇవి రెండును అందమునకు ప్రసిద్ధి కెక్కినవి. కలువల లోను, దామరల లోను తెలుపు, ఎరుపు, నలుపు భేదములచే మూడు తెగల గలవు. కలువ కంటే దామరయే ఎక్కువ యందముగా నుండును. తామర పువ్వు విష్ణునాభి యందుండి యుత్పత్తియైన దనియు, లక్ష్మికి వాస యోగ్యమయిన గృహమనియు గాధలుండుట చే దాని యందు భక్తియు గలుగు చున్నది. కలువ సాయంత్ర మందును, దామర ప్రాతఃకాల మందును వికసించు ననుట కవి సమయముగాని యదార్థము గాదు. కలువ పువ్వు పెక్కు గదులు కలిగిన నొక కాయనే కాచును. తామర వుప్పులో గదులన్నియు విడిపోయి పెక్కు కాయలు కాచును. వీని రెండింటికి నిదియే ముఖ్య భేదము.

ఉపయోగములు

[మార్చు]

ఎఱ్ఱ కలువల వువ్వుల రేకులు హృదయ రోగములను నరముల నీరసము బోగొట్టును. పువ్వుల ఱేకులు మరగ బెట్టి ఱేకులను నీళ్ళను గలిపి, ఒక గుడ్డలో వేసి పిండవలెను. ఈ వచ్చిన ద్రవములో పంచ దార వేసి తిరిగి సగమగు వరకును మరుగ బెట్టవలెను. ఇప్పుడు దానిని మందుగ బుచ్చుకొనవచ్చును. 74 ఎర్రని కలువ గింజలు, అజీర్ణమునకును, వేళ్ళు జిగట విరేచనములు, రక్త విరేచనములకును పని యేయును. వీనిని ఎండ బెట్టి పొడుము గొట్టి పుచ్చుకొనవచ్చును. ఇతర కలువలకును దామలకును గూడ ఈ గుణములు గలవు. కాని అన్ని తెగలను గలిపి మందు చేయుట కంటే విడివిడిగా చేయుట మంచిది.

చిత్రమాలిక

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కలువ&oldid=3886529" నుండి వెలికితీశారు