Jump to content

నికితా దత్తా

వికీపీడియా నుండి
నికితా దత్తా
2016లో నికిత దత్తా
జననం (1990-11-13) 1990 నవంబరు 13 (వయసు 34)[1]
ఢిల్లీ, భారతదేశం
విద్యాసంస్థసెయింట్. జేవియర్స్ కాలేజ్, ముంబై
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2014 - ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
డ్రీమ్ గర్ల్ (టీవీ సిరీస్)'
ఏక్ దుజే కే వాస్తే (సినిమా)
కబీర్ సింగ్ (సినిమా)
మస్కా (2020 చిత్రం)

నికితా దత్తా ఒక భారతీయ నటి. హిందీ సినిమాలు, హిందీ టెలివిజన్‌లో కనిపిస్తుంది. ఫెమినా మిస్ ఇండియా 2012 ఫైనల్‌కు చేరిన ఆమె, లేకర్ హమ్ దీవానా దిల్‌తో తన నటన, చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది. ఇందులో ఆమె సహాయక పాత్రలో నటించింది. ఆ తర్వాత డ్రీమ్ గర్ల్ షోతో తన టెలివిజన్ అరంగేట్రం చేసింది. ఏక్ దూజే కే వాస్తేలో సుమన్ తివారీ పాత్ర పోషించినందుకు ప్రసిద్ధి చెందింది.[2][3] ఆమె 2018లో గోల్డ్‌తో సినిమాల్లోకి తిరిగి వచ్చింది. కబీర్ సింగ్ (2019)లో సహాయక పాత్రలో కనిపించిన తర్వాత,[4][5] అప్పటి నుండి ఫైనాన్షియల్ థ్రిల్లర్ ది బిగ్ బుల్ (2021), హారర్ డ్రామా డైబ్బక్ (2021) లలో ముఖ్య పాత్రల్లో ఆలరించింది.

బాల్యం, విద్య

[మార్చు]

1990 నవంబరు 13న ఢిల్లీలో నికితా దత్తా జన్మించింది. ఆమె తండ్రి భారత నావికాదళంలో నావికాదళ అధికారి అయినందున, ఆమె తన జీవితంలో ఎక్కువ భాగం విశాఖపట్నం, ముంబైలలో గడిపింది.[6] ఆమె ముంబైలో పాఠశాల విద్యను పూర్తి చేసింది. అక్కడే సెయింట్ జేవియర్స్ కాలేజీ నుండి ఎకనామిక్స్ లో ఆమె పట్టభద్రురాలైంది.[7]

కెరీర్

[మార్చు]

నికితా దత్తా 2012 ఎడిషన్ ఫెమినా మిస్ ఇండియాలో పాల్గొని ఫైనలిస్టులలో ఒకరిగా నిలిచింది. ఆ తరువాత సైఫ్ అలీ ఖాన్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ లేఖర్ హమ్ దీవానా దిల్ (2014) లో ఆమె ఒక చిన్న పాత్రతో వెండితెర అరంగేట్రం చేసింది. 2015లో లైఫ్ ఒకే డ్రామా సిరీస్ డ్రీమ్ గర్ల్ - ఏక్ లడ్కీ దీవానీ సితో టెలివిజన్ అరంగేట్రం చేసింది. ఆమె శ్రద్ధా ఆర్య, మొహ్సిన్ ఖాన్ లతో కలిసి నటించింది. ఇందులో ప్రేమలో పడే ఔత్సాహిక నటి లక్ష్మి మాథుర్ పాత్రలో నటించింది.[8] 2016లో సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ ఏక్ దుజే కే వాస్తేలో నమిక్ పాల్ సరసన ఆమె నటించింది.[9][10] తదుపరి 2017 అక్టోబరులో మొదలైన టెలివిజన్ షో రొమాంటిక్ థ్రిల్లర్ హాసిల్ లో నటించింది.[11] 2018లో గోల్డ్ సినిమాతో సినిమాల్లోకి తిరిగి వచ్చింది.[12]

గుర్తింపు

[మార్చు]
సంవత్సరం పురస్కారం వర్గం సినిమా ఫలితం
2015 ఇండియన్ టెలీ అవార్డ్స్ ఫ్రెష్ న్యూ ఫేస్ (యాక్ట్రస్) డ్రీమ్ గర్ల్ నామినేట్
2016 ఆసియన్ వ్యూయర్స్ టెలివిజన్ అవార్డ్స్ బెస్ట్ యూక్ట్రస్ ఏక్ దూజే కే వాస్తే నామినేట్
2017 లయన్ గోల్డ్ అవార్డ్స్ టెలివిజన్ అవార్డ్ (బెస్ట్ ఆన్ స్క్రీన్ కపుల్ - జ్యూరీ) ఏక్ దూజే కే వాస్తే విజేత
2018 లయన్ గోల్డ్ అవార్డ్స్ బెస్ట్ యూక్ట్రస్ హాసిల్ విజేత
2018 ది ఐకానిక్ అచీవర్స్ అవార్డ్ బెస్ట్ ఎమర్జింగ్ టీవీ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ - విజేత[13]
2020 గోల్డ్ గ్లామ్ & స్టైల్ అవార్డ్స్ స్టైల్ ఐకాన్ అవార్డ్ మస్కా విజేత[14]

వెబ్ సిరీస్

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Zayed Khan and Vatsal Sheth celebrated co-star Nikita Dutta's birthday in advance". India Today. 11 November 2017. Retrieved 2021-04-12.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. Baddhan, Raj (10 February 2016). "Sony TV to launch 'Ek Duje Ke Vaaste' this month". BizAsia | Media, Entertainment, Showbiz, Events and Music (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 10 July 2019.
  3. "Nikita Dutta, Vatsal Seth, Zayed khan start shooting for Haasil - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 10 July 2019.
  4. "EXCLUSIVE: Nikita Dutta talks about more recognition coming her way after Kabir Singh, film's criticism & more". PINKVILLA (in ఇంగ్లీష్). Retrieved 17 August 2019.
  5. "Nikita Dutta on Kabir Singh: "I've been told I'm the best thing in the second half of Kabir Singh"". Masala.com (in ఇంగ్లీష్). Retrieved 10 July 2019.
  6. "Happy Father's Day, daddy!". Retrieved 14 November 2017.
  7. Lifestyle, The Trending World (7 July 2019). "Nikita Dutta (Actress) Lifestyle, Biography, Unknown Facts, Age and More — Biography Adda". Medium (in ఇంగ్లీష్). Archived from the original on 11 జూలై 2019. Retrieved 11 July 2019.
  8. India, The Hans (17 November 2015). "Nikita Dutta exits the show Dream Girl". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 10 July 2019.
  9. "Nikita Dutta to star in 'Ek Dooje Ke Vaaste'". The Times of India. 27 January 2016. Retrieved 28 January 2016.
  10. "Nikita Dutta to star in 'Ek Dooje Ke Vaaste'". The Indian Express. 27 January 2016. Retrieved 28 January 2016.
  11. "Haasil Review: Nikita Dutta outshines Zayed Khan and Vatsal Sheth in this romantic thriller". bollywoodlife.com. 31 October 2017.
  12. Desk, India com Entertainment (20 September 2017). "Ek Duje Ke Vaaste Actress Nikita Dutta To Make Her Bollywood Debut With Akshay Kumar's Gold". India.com (in ఇంగ్లీష్). Retrieved 10 July 2019.
  13. Wolfe, Barbara (2018-09-18). "The Effects of Financial Aid Offers on Postsecondary Educational Outcomes: New Experimental Evidence from the Fund for Wisconsin Scholars Grant". AEA Randomized Controlled Trials. Retrieved 2022-08-09.
  14. "Access all areas". Nursing Standard. 25 (36): 62–63. 2011-05-11. doi:10.7748/ns.25.36.62.s54. ISSN 0029-6570.