నిఖిలా విమల్
నిఖిలా విమల్ | |
---|---|
జననం | నిఖిలా విమల్ |
జాతీయత | ఇండియన్ |
విద్యాసంస్థ | సర్ సయ్యద్ కళాశాల, తాలిపరంబ |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2009, 2015 – ప్రస్తుతం |
నిఖిలా విమల్ దక్షిణ భారతీయ నటి, ఆమె ప్రధానంగా తెలుగు చిత్రాలతో పాటు మలయాళం, తమిళ చిత్రాలలో నటిస్తుంది.[1][2]
2009లో ఆమె భాగ్యదేవత చిత్రంలో సపోర్టింగ్ రోల్‌తో అరంగేట్రం చేసింది. 2015లో ఆమె శ్రీబాల కె మీనన్ చిత్రం లవ్ 24x7లో ఆమె మలయాళ సీనియర్ నటుడు దిలీప్ సరసన ప్రధాన పాత్రలో నటించింది.
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]నిఖిల కేరళలోని తాలిపరంబలో ఎం. ఆర్. పవిత్రన్, కలమండలం విమలాదేవి దంపతులకు జన్మించింది.[3] ఆమె తండ్రి స్టాటిస్టికల్ డిపార్ట్‌మెంట్ నుండి రిటైర్ కాగా, ఆమె తల్లి డ్యాన్సర్. ఆమె అక్క అఖిలా విమల్ ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్‌లో రీసెర్చ్ స్కాలర్.
ఆమె 2016లో సర్ సయ్యద్ కళాశాల, తాలిపరంబ నుండి బి.ఎస్సీ (బోటనీ) పట్టభద్రురాలైంది. ఆమె భరతనాట్యం, కూచిపూడి, కేరళ నటనం, మోనోయాక్ట్ నేర్చుకుంది.[4]
కెరీర్
[మార్చు]షాలోమ్ టీవీలో ప్రసారమైన సెయింట్ అల్ఫోన్సాపై డాక్యుమెంటరీలో ఆమె తన నటనా జీవితాన్ని టెలివిజన్ రంగంలో ప్రారంభించింది. 2009లో ఆమె తొలి చిత్రం భాగ్యదేవతలో సహాయక పాత్రలో నటించింది. 2015లో కథానాయికగా లవ్ 24x7లో నటించింది. ఆమె తమిళ చిత్రసీమ అరంగేట్రం పంజుమిట్టై(2018)తో జరిగింది. ఆమె రెండవ తమిళ చిత్రం ఒన్బతు కుజి సంపత్. కాగా వెట్రివెల్ (2016) సినిమాలో ఆమె నటన అందరి ప్రశంసలు అందుకుంది.[5] ఆమె పాత్ర సాదాసీదాగా ఉన్నప్పటికీ, ఆ సినిమాలో తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది.[6] ఆమె ఆ తరువాత కిడారి (2016)లో కథానాయికగా నటించింది.[7] ఇది వాణిజ్యపరంగా విజయవంతమైంది, ఆమె సహజమైన నటనకు విమర్శకులచే ప్రశంసించబడింది.[8]
అల్లరి నరేష్(2017)తో కలిసి ఆమె తెలుగు తొలి చిత్రం మేడ మీద అబ్బాయి.[9] ఆ తరువాత గాయత్రి(2018), దొంగ(2019)లలోనూ ఆమె నటించింది.[10] ఆమె నటించిన మరో మలయాళ చిత్రం అరవిందంటే అతిధికల్ కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది.
2017లో ఆమె SIIMA అవార్డ్స్ 2017లో కిడారి చిత్రానికి ఉత్తమ తొలి నటిగా ఎంపికైంది. 2019లో కేరళ కౌముది ఫ్లాష్ మూవీ 2019లో అరవిందంటే అతిధికల్ చిత్రానికి ఆమె మోస్ట్ పాపులర్ యాక్ట్రెస్ అవార్డును గెలుచుకుంది.[11] ఈ చిత్రానికి ఆమె ఉత్తమ స్టార్ పెయిర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా వనిత ఫిల్మ్ అవార్డ్స్ 2019లో గెలుచుకుంది.
మూలాలు
[మార్చు]- ↑ "From child actor to heroine: Nikhila". Deccan Chronicle. Retrieved 2016-06-17.
- ↑ "In the news". The Hindu (in Indian English). 2015-07-09. ISSN 0971-751X. Retrieved 2016-06-15.
- ↑ "Nikhila Vimal (Actress) – Profile". Cochin Talkies. Retrieved 2016-06-17.
- ↑ Manalethu, Biju Cherian (2016-01-22). "Nikhila Vimal Actress Profile and Biography". Cinetrooth. Retrieved 2016-06-17.
- ↑ "Nikhila Vimal plays a crucial role in Vetrivel - Times of India". The Times of India. Retrieved 2016-06-17.
- ↑ "'I am Comfortable in Tamil'". The New Indian Express. Archived from the original on 2016-06-09. Retrieved 2016-06-17.
- ↑ RAO, SUBHA J (2016-09-01). "Actor Nikhila Vimal is here for the long haul". The Hindu. Retrieved 2016-09-19.
- ↑ "Nikhila Vimal on working in Kidaari". Retrieved 2016-09-19.
- ↑ "Meda Meeda Abbayi review: A decent remake". The Hindu. 9 September 2017. Retrieved 2 October 2021.
- ↑ "Nikhila Vimal's girl-next-door look". The Hans India. 15 January 2018. Retrieved 2 October 2021.
- ↑ "Kerala Kaumudi Flash Movies: Aravindante Athidhikal, Nikhila Vimal and Aju Varghese shine bright in 2018!". Mollywood 24x7. Archived from the original on 2019-03-13. Retrieved 2019-01-06.