నిజ ఏసుక్రీస్తు మండలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భాగం వ్యాసముల క్రమం

Christian cross.svg

 
యేసు
శుద్ధ జననం · క్రూసిఫిక్షన్ · రిసర్రెక్షన్

 · క్రీస్తు యెుక్క అజ్ఞాత సంవత్సరములు

మూలాలు
చర్చి · కొత్త కాన్వెంట్
అపోస్తలులు · సామ్రాజ్యం · గోస్పెల్ · కాలపట్టిక
బైబిల్
పాత నిబంధన · కొత్త నిబంధన
గ్రంధాలు · బైబిల్ చట్టాలు · అపోక్రైఫా
క్రైస్తవ ధర్మం
త్రిత్వము · (తండ్రి · కొడుకు · పరిశుద్ధాత్మ)
చరిత్ర · ధర్మం · అపోలాజిటిక్స్
చరిత్ర, సాంప్రదాయాలు
ప్రథమ · సంఘాలు · వర్గలు · మిషనరీలు
తూర్పు పశ్చిమ సంబంధాలు · క్రుసేడులు · ఉద్ధారణలు
తెగలు
క్రైస్తవ మత విషయాలు
బోధన · ప్రార్థన · ఎక్యూమెనిజం
ఇతర మతాలతో సంబంధాలు · ఉద్యమాలు
సంగీతం · లిటర్జీ · కేలండరు
చిహ్నాలు · కళలు · విమర్శ
P christianity.svg క్రైస్తవ పోర్టల్

నిజ యేసుక్రీస్తు మండలి ఒక స్వతంత్ర క్రిస్టియను చర్చి, దీనిని చైనాలోని బీజింగ్ నగరంలో 1917వ సంవత్సరమున స్థాపించారు. దీనిని భారత దేశమునందు 1939నందు నెలకొల్పినారు. 20వ శతాబ్దం ప్రథమభాగంలో ప్రారంభమైన పెంతెకోస్తు -ప్రొటెస్టెంటు చర్చిలో ఇది ఒక భాగము. ప్రస్తుతం ఈ మండలికి 45 దేశాలలో 15 లక్షల నుండి 25 లక్షలు దాకా సభ్యులున్నారు.

యేసుక్రీస్తు ప్రవక్త పునరాగమనానికి తయారుగా భగవంతుని సందేశాన్ని అందరికీ తెలియబరచడం వీరి లక్ష్యము. మిగిలిన క్రైస్తవ పంథాలకూ, వీరికీ ప్రధాన భేదము ఏమంటే -దేవునిలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే ముగ్గురు వ్యక్తులు ఏకమై త్రిత్వము గాఉన్నారని తక్కిన చర్చిలు విశ్వసిస్తాయి. కాని నిజ క్రైస్తవ మండలి వారు మాత్రము ముగ్గురు లేరు యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు అంటారు. యేసు నామ ప్రజలు ( Jesus only people) కూడా యేసే దేవుడు అంటారు.

డిసెంబరు 25వతారీఖు పండుగ సూర్యదేవుని జన్మదినాన్ని జరుపుకొనే పండుగ అనీ, రోమను చక్రవర్తి కాన్‌స్టాంటైను కాలంలో క్రైస్తవమతంలోకి మిళితంచేయబడిందనీ విశ్వసిస్తారు గనుక నిజ‌ యేసు క్రీస్తు మండలికి చెందినవారు క్రిస్టమస్ పండుగ జరుపుకొనరు.

మలేషియాలోని పోర్క్ డిక్షన్ లో ఉన్ననిజ ఏసుక్రీస్తు మండలి శిక్షణ మందిరం

చర్చి యొక్క ఐదు ప్రాథమిక సిద్ధాంతాలు[మార్చు]

పరిశుద్ధాత్మ[మార్చు]

"ప్రత్యేకమయన భాషలలో మాట్లాడడము అనేది పరిశుద్ధ ఆత్మను అందుకొనడానికి సూచన. ఇది పరలోక రాజ్యము లభిస్తుందనడానకి ఒక ఋజువు" (రోమా 8:16, ఎఫెసీయులు 1:13-14). ఇలా భాషలలో మాట్లాడే వారిని పెంతెకోస్తు సంఘం వాళ్ళు అని అనడం వాడుక.

బాప్తిస్మము[మార్చు]

"నీటి బాప్తిస్మము అనే కార్యక్రమము పాపములను ప్రక్షాళనచేయు పవిత్ర కార్యము. బాప్తిస్మము నది నీరు, సముద్రపు నీరు, ఊట నీరు వంటి సహజమైన పరిశుద్ద జలముచే జరప వలెను. బాప్టిస్టు ముందుగా క్రీస్తు నామమున నీరు, పరిశుద్ధాత్మలను గ్రహింవలెను. ఆపై బాప్తిస్మము పొందు వ్యక్తిని పూర్తిగా నీటిలో ముంచాలి. వారి తలవంగియుండవలెను. ముఖము క్రిందివైపునకు ఉండవలెను".

కాళ్ళు కడగటం[మార్చు]

"పాదములు కడుగుట అనే పవిత్రకార్యక్రమము వల్ల బాప్తిసము తీసుకొన్నవానికి ప్రభువైన క్రీస్తుతో పాలుపంచుకొను అవకాశము కలుగును. ప్రేమ, పవిత్రత, వినయము, క్షమ, సేవ వంటి ఉత్తమగుణాలు అలవరచుకోవాలని ఈ పని మనకు ప్రబోధిస్తుంది. బాప్తిస్మము తీసికొన్న ప్రతివ్యక్తీ యేసు క్రీస్తు నామమున ఇతరుల పాదాలు కడగాలి. ఒకరిపాదములు మరొకరు కడుగుకొనవలెను".

రొట్టె, ద్రాక్ష రసము[మార్చు]

ఈ రొట్టె, ద్రాక్ష రసము తీసుకోవటం అంటే క్రీస్తు మరణాన్ని స్మరించుకొంటూ పవిత్ర భావనతో ప్రభువు రక్తమాంసాలలో పాలుపంచుకోవటం. తద్వారా శాశ్వత జీవనము లభిస్తుంది. ఈ పవిత్ర కార్యమును ప్రతి సబ్బాతు రోజున నిర్వహించాలి. ఒకే రొట్టెను, ద్రాక్ష రసపాత్రను ఎంగిలి అనే భావన లేకుండా అందరూపాలుపంచుకోవాలి.

సబ్బాతు దినము[మార్చు]

సప్తమదినం. ఏడవ రోజు (శని వారము ), దేవుడు విశ్రాంతి తీసుకున్న దినము. అది ప్రభువు కృపచే పాటింపదగినది. దేవుని సృష్టి కార్యమును స్మరించే పండుగ. తద్వారా ముందు జీవితమున శాశ్వత విశ్రాంతి, మోక్షము పొందే అవకాశము లభిస్తుంది.

ఇతర నమ్మకాలు[మార్చు]

యేసుక్రీస్తు[మార్చు]

"యేసుక్రీస్తు, శరీరధారియైన దేవుని వాక్యము. ఆయన పాపులను రక్షించుటకై తననుతాను అర్పించుకొనెను. మూడవరోజున పునరుజ్జీవుడై స్వర్గమునధిరోహించెను. ఆయనొకడే జనరక్షకుడు. భూమ్యాకాశములను సృజించినవాడు. నిజమైన దేవుడు".

బైబిల్[మార్చు]

"పరిశుద్ధ బైబిల్, కొత్త, పాత నిబంధన గ్రంథములతో కూడి, ప్రభువు ప్రేరేపణతో వెలువడిన సత్య గ్రంథము. క్రైస్తవ జీవనానికి మార్గదర్శకము".

మోక్షము[మార్చు]

" విశ్వాసము వలన భగవంతుని కృప, అందువలన మోక్షము లభిస్తాయి. విశ్వసించేవారు పరిశుద్ధాత్మపై ఆధారపడి పవిత్రతను పొంది, భగవంతుని సేవించి, మానవజాతిని ప్రేమించాలి ".

సంఘం[మార్చు]

చర్చి (సంఘం) అనేది ప్రభువైన యేసుక్రీస్తుచే పవిత్రాత్మ ద్వారా జలప్రళయకాలంలో ఏర్పరచబడింది. ఇది విశ్వాసులచే పునరారంభింపబడిన నిజమైన చర్చి".

రెండవరాకడ[మార్చు]

యేసు క్రీస్తు తిరిగి వస్తాడు. చివరి రోజున ప్రభువు స్వర్గము నుండి ప్రపంచముపై తీర్పు చెప్పుటకు అవతరించును. పరిశుద్ధులైన వారు శాశ్వత జీవనము పొందగలరు. "కౄరులైనవారు శాశ్వతముగా శపింపబడుదురు.

వనరులు[మార్చు]