నియోరా వ్యాలీ జాతీయ ఉద్యానవనం
నియోరా వ్యాలీ జాతీయ ఉద్యానవనం | |
---|---|
Location | కాలింపాంగ్ జిల్లా, పశ్చిమ బెంగాల్, భారతదేశం |
Nearest city | కాలింపాంగ్ |
Coordinates | 27°04′N 88°42′E / 27.06°N 88.7°E |
Area | 88 కి.మీ2 (34 చ. మై.) |
Established | 1986 |
Governing body | భారత ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం |
నియోరా వ్యాలీ జాతీయ ఉద్యానవనం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కాలింపాంగ్ జిల్లాలో ఉంది.[1]
చరిత్ర
[మార్చు]ఈ ఉద్యానవనం 1986 లో స్థాపించబడింది. ఇది 88 కిమీ² విస్తీర్ణంలో విస్తరించి ఉంది.[2]
జంతు, వృక్ష సంపద
[మార్చు]ఈ ఉద్యానవనంలో ఉష్ణమండల, ఉప-ఉష్ణమండల, ఉప-సమశీతోష్ణ, సమశీతోష్ణ వృక్షసంపద వ్యవస్థను కలిగి ఉంది. ఇక్కడి అడవుల్లో రోడోడెండ్రాన్, వెదురు, ఓక్, ఫెర్న్లు, సాల్ లాంటి మిశ్రమ జాతులు మొక్కలు ఉన్నాయి.
మరిన్ని విశేషాలు
[మార్చు]ఈ ఉద్యానవనం 183–3,200 మీ (600–10,499 అడుగులు) ఎత్తులో ఉంటుంది. ఇందులో ఎత్తైన ప్రదేశం రాచెలా దండా. ఇక్కడి లోయలో దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. ఇక్కడ ఉండే కాలింపాంగ్ కొండలలో తెలియని భూభాగాన్ని అన్వేషించడానికి ప్రకృతి ప్రేమికులకు, ట్రెక్కింగ్ చేసేవారికి ఈ ప్రాంతం సాహసోపేతమైన ప్రదేశంగా మారింది. ఈ ఉద్యానవనంలో వర్జిన్ సహజ అడవులు, దట్టమైన వెదురు తోటలు, రోడోడెండ్రాన్ చెట్ల రంగురంగుల పందిరి, పచ్చని లోయ, మెరిసే నదులు, మంచుతో కప్పబడిన పర్వతాలలు కలిసి ఒక సుందరమైన ప్రకృతి దృశ్యాన్ని ఏర్పరుస్తాయి.
మూలాలు
[మార్చు]- ↑ Codrops. "WildBengal". www.wildbengal.com. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 25 October 2019.
- ↑ Mallick, J. K. (2012). "Mammals of Kalimpong Hills, Darjeeling District, West Bengal, India". Journal of Threatened Taxa. 4 (12): 3103–3136.