నిరంజన నాగరాజన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిరంజన నాగరాజన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
నిరంజన నాగరాజన్
పుట్టిన తేదీ (1988-10-09) 1988 అక్టోబరు 9 (వయసు 36)
మద్రాస్, తమిళ నాడు,
మారుపేరునింజా
బ్యాటింగుకుడి చేతి వాటం
బౌలింగుకుడిచేతి బౌలింగ్ మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 77)2014 13 ఆగస్ట్ - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు2014 16 నవంబర్ - దక్షిణ ఆఫ్రికా తో
తొలి వన్‌డే (క్యాప్ 90)2008 30 ఆగస్ట్ - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2016 ఫిబ్రవరి 19 - శ్రీలంక తో
తొలి T20I (క్యాప్ 34)2012 జూన్ 26 - ఇంగ్లాండ్ తో
చివరి T20I2016 ఫిబ్రవరి 26 - శ్రీలంక తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2006–2013, 2018–ప్రస్తుతంతమిళనాడు మహిళా క్రికెట్ జట్టు
2006–2013దక్షిణ మండల మహిళా క్రికెట్ జట్టు
2013–2017రైల్వేస్
2013–2014కేంద్ర మండల మహిళా క్రికెట్ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ WTest WODI WT20I
మ్యాచ్‌లు 2 22 14
చేసిన పరుగులు 27 70 42
బ్యాటింగు సగటు 27 8.75 7.00
100s/50s 0/0 0/0 0/0
అత్యధిక స్కోరు 27 12* 15
వేసిన బంతులు 236 965 271
వికెట్లు 4 24 9
బౌలింగు సగటు 23.75 28.04 26.22
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 4/19 3/24 2/15
క్యాచ్‌లు/స్టంపింగులు 3/- 4/- 3/-
మూలం: ESPNcricinfo, 2017 జనవరి 22

నిరంజన నాగరాజన్ ఒక భారతీయ క్రికెట్ క్రీడాకారిణి.[1] ఆమె తమిళనాడుకు చెందిన మద్రాస్ (చెన్నైగా మార్చబడింది) లో 1988 అక్టోబరు 9న జన్మించింది. ఆమెని నింజా అనే పేరుతో కూడా పిలుస్తారు. ఆమె 10 సంవత్సరాల వయస్సులో ఆట ఆడటం ప్రారంభించింది. ఆమె భారతీయ రైల్వేస్‌లో ఉద్యోగిగా, జట్టులో క్రీడాకారిణిగా చేరింది. ఆమె వికెట్లు తీయగలదు, క్రింది క్రమములో ఉండి బాటింగ్ లో సహకరించగల ఆల్‌రౌండర్.

క్రికెట్ జీవితం

[మార్చు]

ఆమె 2 టెస్ట్ మ్యాచ్ లు, 22 ఒక రోజు అంతర్జాతీయ మ్యాచ్ లు, 14 మహిళా టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.[2] ఆమె కుడిచేతి వాటం ఉన్న బ్యాట్స్‌ వుమెన్, కుడిచేతి మీడియం-ఫాస్ట్ బౌలింగ్ చేస్తుంది.[3]

ఆమె 2008 ఆగస్టు 30న భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా నార్త్ పరేడ్, బాత్ వద్ద ఇంగ్లాండ్‌తో జరిగిన ఒక రోజు అంతర్జాతీయ మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. ఆమె దేశీయ క్రికెట్‌లో తమిళనాడు, రైల్వేస్, దక్షిణ మండలం, కేంద్ర మండలం తరపున కూడా ఆడింది.

2014లో భారత మహిళలు తమ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్‌తో ఆడినప్పుడు ఆమె ఇంగ్లీష్ గడ్డపై తన బౌలింగ్ ప్రతిభను ప్రదర్శించింది. ఆమె అద్భుత ప్రదర్శన (4/19) కారణంగా ఇంగ్లాండ్ జట్టు కేవలం 92 పరుగులకే ఆలౌటైంది.[4]

[5]

ప్రస్తావనలు

[మార్చు]
  1. "N Nagarajan". Cricinfo. Retrieved 2009-11-02.
  2. "N Nagarajan". CricketArchive. Retrieved 2009-11-02.
  3. "Niranjana Nagarajan continues the hard grind in quest for India comeback". ESPN Cricinfo. Retrieved 19 May 2021.
  4. "Live Cricket Scores & News International Cricket Council" (in ఇంగ్లీష్). Retrieved 2017-09-24.
  5. "So far to so near: Women sniff history in blue". The New Indian Express. Retrieved 2017-09-24.

బాహ్య లింకులు

[మార్చు]