నిహారిక ఖాన్
నిహారిక ఖాన్ | |
---|---|
జననం | 1969 నవంబరు 21 |
వృత్తి | కాస్ట్యూమ్ డిజైనర్ |
క్రియాశీల సంవత్సరాలు | 2007-ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ (ది డర్టీ పిక్చర్) |
జీవిత భాగస్వామి | ఆయుబ్ ఖాన్ |
పిల్లలు | 2 |
బంధువులు | అర్జున్ భాసిన్ (సోదరుడు) |
నిహారిక భాసిన్ భారతీయ కాస్ట్యూమ్ డిజైనర్. హిందీ సినిమా (బాలీవుడ్) లకు పనిచేసింది. 2011లో వచ్చిన ది డర్టీ పిక్చర్ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్గా జాతీయ చలనచిత్ర అవార్డుతోపాటు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్‌కి ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా అందుకుంది.
జననం
[మార్చు]నిహారిక 1969 నవంబరు 21న పంజాబీ తండ్రి, పార్సీ తల్లికి జన్మించింది. యునైటెడ్ స్టేట్స్ లోని సీటెల్‌లో పబ్లిక్ రిలేషన్స్, హెచ్‌ఆర్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేసింది.[1]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఉత్తరాన్ (2008) అనే టీవీ సిరీస్‌తో పేరుగాంచిన సినిమా, టీవి నటుడు అయూబ్ ఖాన్‌తో నిహారిక వివాహం జరిగింది. అయూబ్ ఖాన్ సినీ నటులు దిలీప్ కుమార్, సైరా బానోల మేనల్లుడు.[2][3]
నిహారిక సోదరుడు అర్జున్ భాసిన్ దిల్ చాహ్తా హై (2001), రంగ్ దే బసంతి (2006), జిందగీ నా మిలేగీ దొబారా (2011) సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశాడు.[4][5]
సినిమారంగం
[మార్చు]2007లో వచ్చిన ఖోయా ఖోయా చంద్ సినిమాతో తన కెరీర్‌ని ప్రారంభించింది. 2008లో వచ్చిన రాక్ ఆన్ సినిమాతో గుర్తింపు పొందింది. యష్ రాజ్ ఫిల్మ్స్ వారి బ్యాండ్ బాజా బారాత్ (2010) తో ప్రశంసలు అందుకుంది.[6]
సినిమాలు
[మార్చు]- ఖోయా ఖోయా చంద్ (2007)
- రాక్ ఆన్!! (2008)
- భూత్‌నాథ్ (2008)
- రాకెట్ సింగ్: సేల్స్‌మ్యాన్ ఆఫ్ ది ఇయర్ (2009)
- కార్తీక్ కాలింగ్ కార్తీక్ (2010)
- బ్యాండ్ బాజా బారాత్ (2010)
- ఢిల్లీ బెల్లీ (2011)
- తృష్ణ (2011)
- ది డర్టీ పిక్చర్ (2011)
- ఎఫ్.ఎ.ఎల్.టి.యు (2011)
- అజబ్ గజబ్ లవ్ (2012)
- రౌడీ రాథోడ్ (2012)
- హీరోయిన్ (2012)
- ఇంకార్ (2013)
- కై పో చే! (2013)
- చష్మే బద్దూర్ (2013)
- ది లంచ్ బాక్స్ (2013)
- టైగర్స్ (2014)
- రాయ్ (2015)
- బాంబే వెల్వెట్ (2015)
- ఉంగ్లీ (2014)
- రంగ్ రసియా (2014)
- మార్గరీట విత్ ఎ స్ట్రా (2014)
- ఫితూర్ (2016)
- ఫాన్ (2016)
- మిర్జియా (2016)
- శివాయ్ (2016)
- పెట్ట (2019)
- దే దే ప్యార్ దే (2019)
- పతి పత్నీ ఔర్ వో (2019)
- దర్బార్ (2020)
- శకుంతలా దేవి (2019)
అవార్డులు
[మార్చు]సంవత్సరం | అవార్డు | విభాగం | సినిమా | ఫలితం |
---|---|---|---|---|
2011 | జాతీయ చలనచిత్ర అవార్డులు | ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ | ది డర్టీ పిక్చర్[7] | విజేత |
2012 | ఫిల్మ్‌ఫేర్ అవార్డులు | ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ | విజేత | |
2011 | ఐఫా అవార్డులు | ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ | బ్యాండ్ బాజా బారాత్[8] | విజేత |
2012 | ది డర్టీ పిక్చర్ | విజేత | ||
2020 | ఫిల్మ్‌ఫేర్ అవార్డులు | ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ | ఫోటోగ్రాఫ్ | నామినేట్ |
మూలాలు
[మార్చు]- ↑ "Brunch Date with costume designer Niharika Khan Bhasin". Hindustan Times. 5 April 2013. Archived from the original on 2013-04-07. Retrieved 8 April 2013.
- ↑ "Destiny's couple: Niharika & Ayub Khan". Archived from the original on 23 July 2015. Retrieved 14 March 2013.
- ↑ "Ayub has always been my first love: wife Niharika Khan". DNA. 15 March 2010.
- ↑ "Characters can't afford designer labels: Niharika". The Times of India. 18 August 2009. Archived from the original on 11 April 2013.
- ↑ "Keep it stylish". Indian Express. 17 August 2011.
Zindagi Na Milegi Dobara 's unsung hero is its stylist, the tour de force that is Arjun Bhasin
- ↑ "Dressing up with Niharika Khan and Arjun Bhasin". The Times of India. 10 November 2012. Archived from the original on 11 April 2013. Retrieved 14 March 2013.
- ↑ "59th National Film Awards for the Year 2011 Announced". Press Information Bureau (PIB), India.
- ↑ "Dabangg, Band Baaja Baaraat win big at IIFA technical awards". Indian Express. 26 June 2011. Retrieved 14 March 2013.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో నిహారిక ఖాన్ పేజీ