నీలాయపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"నీలాయపాలెం" ప్రకాశం జిల్లా చినగంజాం మండలానికి చెందిన గ్రామం.[1]


నీలాయపాలెం
గ్రామం
నీలాయపాలెం is located in Andhra Pradesh
నీలాయపాలెం
నీలాయపాలెం
నిర్దేశాంకాలు: 15°42′N 80°15′E / 15.7°N 80.25°E / 15.7; 80.25Coordinates: 15°42′N 80°15′E / 15.7°N 80.25°E / 15.7; 80.25 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాచినగంజాము మండలం
మండలంచినగంజాము Edit this on Wikidata
కాలమానం[[UTC{{{utc_offset}}}]]
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523181 Edit this at Wikidata

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం:- నీలాయపాలెం గ్రామ పొలిమేరలో వెలసిన ఈ ఆలయంలో, 2015,మే24వ తేదీ ఆదివారంనాడు, శ్రీ శ్రీనివాస కళ్యాణం, కన్నులపండువగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వచ్చిన వేదపండితుల ఆధ్వర్యంలో పూజ కార్యక్రమాలను చేపట్టినారు. తిరుమల నుండి తెచ్చిన దేవేరుల విగ్రహాలను ప్రత్యేకపూలమాలలతో అలంకరించారు. తిరుమలలో శ్రీవారికి చేసినట్లుగానే కళ్యాణ మహ్ఫోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. హోమపూజలు నిర్వహించారు. కళ్యాణ మహోత్సవం అనంతరం, తిరుమలనుండి తెచ్చిన ప్రత్యేక మాలలను, తలంబ్రాలను భక్తులకు అందజేసినారు. పొలాల మధ్య, పొలిమేర ప్రాంతములో ఉన్న ఆలయమైననూ, మండుటెండలను గూడా లెక్కచేయక, భక్తిశ్రద్ధలతో, భక్తులు ఎక్కువసంఖ్యలో, ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. చినగంజాము, ఇంకొల్లు, నీలాయపాలెం, ఉప్పుగుండూరు మదలైన గ్రామాలనుండి గూడా భక్తులు విచ్చేసి, శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి పులకించిపోయినారు. ఈ సందర్భంగా, ఆలయ కమిటీవారు భక్తుల దాహార్తి తీర్చడానికి చల్లని మజ్జిగ అందజేసినారు. కళ్యాణ మహోత్సవం అనంతరం, విచ్చేసిన భక్తులకు అన్నసంతర్పణ చేసారు. [1]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి. అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2015,మే-25; 9వపేజీ.