నీలిమా అజీమ్
నీలిమా అజీమ్ | |
---|---|
జననం | |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1989 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | |
పిల్లలు | షాహిద్ కపూర్ ఇషాన్ ఖట్టర్ |
నీలిమా అజీమ్ (జననం 1958 డిసెంబరు 2) భారతీయ నటి, శాస్త్రీయ నృత్యకారిణి, రచయిత్రి. నటులు షాహిద్ కపూర్, ఇషాన్ ఖట్టర్‌ల తల్లి.[4] ఆమె టెలివిజన్ షోలలో తన పాత్రలకు ప్రసిద్ధి చెందింది.
జీవితం తొలి దశలో
[మార్చు]నీలిమా అజీమ్ తండ్రి బీహార్‌కు చెందిన మార్క్సిస్ట్ జర్నలిస్ట్, ఉర్దూ రచయిత అన్వర్ అజీమ్. ఆమె తల్లి ఖదీజా ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ బంధువు.[5] నీలిమా అజీమ్ భారతీయ శాస్త్రీయ నృత్యం కథక్ రూపాన్ని అభ్యసించింది. ఆమె ప్రముఖ గురువులు బిర్జు మహారాజ్, మున్నా శుక్లాల వద్ద శిక్షణ పొందింది.[6][7][8]
కెరీర్
[మార్చు]ఆమె హిందీ భాషా చలనచిత్రాలు, టెలివిజన్ ధారావాహికలలో నటిస్తుంది. ఆమె దూరదర్శన్ లో ప్రసారమైన ఫిర్ వాహీ తలాష్ (1989-90), ఆమ్రపాలి, ది స్వోర్డ్ ఆఫ్ టిప్పు సుల్తాన్, జునూన్ వంటి అనేక చారిత్రక, నాటకీయ ధారావాహికలలో నటించింది. 2014లో, ముంబైలోని భారతీయ విద్యాభవన్ క్యాంపస్‌లో బిర్జు మహారాజ్ కలాశ్రమ్ నిర్వహించిన పంచతత్వ వార్షిక కథక్ ఉత్సవంలో ఆమె ప్రదర్శన ఇచ్చింది.[6] దీపక్ తిజోరి సరసన సడక్ (1991) అనే హిందీ సినిమాలో కూడా నటించింది.[9]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆమె 1979 సంవత్సరంలో పంకజ్ కపూర్‌ను వివాహం చేసుకుంది, అయితే వారు తర్వాత విడాకులు తీసుకున్నారు.[10] ఆమె కుమారుడు షాహిద్ కపూర్ బాలీవుడ్ నటుడు.[11] ఆమె తర్వాత రాజేష్ ఖట్టర్‌ను వివాహం చేసుకుంది. వారికి బాలీవుడ్ నటుడు ఇషాన్ ఖట్టర్ అనే కుమారుడు ఉన్నాడు.[12]
మూలాలు
[మార్చు]- ↑ "Happy birthday Ishaan Khatter: His 10 best family pics with Shahid Kapoor, Mira Rajput". Hindustan Times. 1 November 2019.
- ↑ "Beyhadh actor Rajesh Khattar blessed with baby boy at the age of 53". India Today. 31 August 2019.
- ↑ "Sanjay Dutt, Lucky Ali, Kishore Kumar - Meet the Bollywood stars who found love thrice in marriage". Bollywood Bubble. 31 March 2020.
- ↑ Eenadu (19 September 2020). "అమ్మని చూసి హీరో కన్నీరు..!". Archived from the original on 25 అక్టోబరు 2021. Retrieved 25 October 2021.
- ↑ KBR, Upala (13 June 2016). "Like Shahid, Ishaan is a fabulous dancer, says mom Neelima Azim on his Bollywood debut". DNA India (in ఇంగ్లీష్). Retrieved 21 July 2021.
- ↑ 6.0 6.1 "Shahid Kapoor's mom Neelima Azeem back to stage after 40 years". India Today. 3 June 2014.
- ↑ "Meet Shahid Kapoor Family". Archived from the original on 4 August 2018. Retrieved 5 July 2018.
- ↑ "Neelima Azeem". veethi.com.
- ↑ "Bihar Urdu Youth Forum". Archived from the original on 2022-11-09. Retrieved 2023-04-24.
- ↑ "Neelima Azeem opens up about her divorce from Pankaj Kapur when son Shahid Kapoor was 3.5 years old". DNA India (in ఇంగ్లీష్). 8 May 2021. Retrieved 16 June 2021.
- ↑ "Neelima Azeem on relationship with son Shahid Kapoor, daughter-in-law Mira Rajput: 'He is honest and brave, she is my friend'". The Indian Express (in ఇంగ్లీష్). 14 April 2021. Retrieved 16 June 2021.
- ↑ "Neelima Azeem on her failed marriages with Pankaj Kapur and Rajesh Khattar: 'Experienced grief, rejection, anxiety'". Hindustan Times (in ఇంగ్లీష్). 12 April 2021. Retrieved 16 June 2021.