నుజ్హత్ పర్వీన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నుజ్హత్ పర్వీన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
నుజ్హత్ మసిహ్ పర్వీన్
పుట్టిన తేదీ (1996-09-05) 1996 సెప్టెంబరు 5 (వయసు 27)
సింగ్రౌలి, మధ్యప్రదేశ్
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్-కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక వన్‌డే (క్యాప్ 121)2017 మే 15 - ఐర్లాండ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.23
తొలి T20I (క్యాప్ 51)2016 నవంబరు 18 - వెస్టిండీస్ తో
చివరి T20I2021 మార్చి 21 - దక్షిణాఫ్రికా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2012/13–2015/16మధ్యప్రదేశ్
2017/18–ప్రస్తుతంరైల్వేస్
2020ట్రైల్‌బ్లేజర్స్
కెరీర్ గణాంకాలు
పోటీ వన్డే ట్వంటీ20
మ్యాచ్‌లు 1 5
చేసిన పరుగులు 1
బ్యాటింగు సగటు 1.00
100లు/50లు 0/0
అత్యధిక స్కోరు 1
క్యాచ్‌లు/స్టంపింగులు 1/0 1/1
మూలం: ESPNcricinfo, 8 నవంబరు 2022

నుజ్హత్ మసిహ్ పర్వీన్, మధ్యప్రదేశ్ కు చెందిన భారతీయ క్రికెటర్.[1][2] వికెట్ కీపర్‌గా రాణిస్తున్న నుజ్హత్, రైల్వేస్ తరపున మహిళల సీనియర్ వన్డే ట్రోఫీ, మహిళల సీనియర్ టీ20 ట్రోఫీలలో ఆడుతుంది. మధ్యప్రదేశ్ అండర్-16 ఫుట్‌బాల్ జట్టు మాజీ ఫుట్‌బాల్ కెప్టెన్ గా ఆడిన ఈమె, [3] 2011లో సింగ్రౌలీ జిల్లా క్రికెట్ జట్టులో చేరింది. 2016 నవంబరులోవెస్టిండీస్‌తో జరిగిన ట్వంటీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో భారత జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసింది.[4]

జీవిత విశేషాలు[మార్చు]

నుజ్హత్ 1996, సెప్టెంబరు 5న మసీహ్ ఆలం - నసీమా బేగం దంపతులకు మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలిలో జన్మించింది. ఆమెకు నలుగురు తోబుట్టువులు (అన్నయ్య అమీర్ సోహైల్, అక్క నెమత్ పర్వీన్, చెల్లెలు ఆసియా పర్వీన్, తమ్ముడు అయాన్ అష్రఫ్ సోహైల్) ఉన్నారు.[5]

మధ్యప్రదేశ్, సెంట్రల్ జోన్ తరపున తన దేశీయ క్రికెట్ ఆడేది.[6][7] ఇప్పుడు రైల్వేస్ తరపున ఆడుతోంది.

నుజ్హత్ చిన్నప్పటి నుంచి తన స్కూల్‌మేట్స్‌తో కలిసి గల్లీ క్రికెట్ ఆడేది.[5] క్రికెట్‌లోకి రాకముందు, ఫుట్‌బాల్ నేషనల్స్‌లో మధ్యప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించింది. రాష్ట్ర అథ్లెటిక్స్ (100 మీ) లో బంగారు పతకాన్ని సాధించింది. 2017 ప్రపంచ కప్‌లో పాల్గొన్నది.[5]

ఫుట్‌బాల్ అనుభవం ఆమెకు వికెట్ కీపర్‌గా రాణించడానికి, శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడింది. 2012లో టోర్నమెంట్‌లో మిథాలీ రాజ్‌ను కలుసుకుంది, క్రికెట్‌లో పాల్గొనడానికి ప్రేరణ పొందింది.[5]

క్రికెట్ ఆడుతూనే 12వ తరగతిలో 91.8% (కామర్స్) మార్కులు సాధించింది.[5] చదువుకునే సంవత్సరాల్లో, పర్వీన్‌కు అవసరమైన అవకాశాలను తీసుకురావడానికి కుటుంబం ఒక ప్రసిద్ధ ప్రైవేట్ పాఠశాలలో చేరాలని నిర్ణయం తీసుకుంది.[2]

క్రికెట్ రంగం[మార్చు]

నుజ్హత్ ఫుట్‌బాల్ ఆటలో అండర్-16 ఫుట్‌బాల్ జట్టుకు మధ్యప్రదేశ్ కెప్టెన్‌గా వ్యవహరించింది.[8]

కేవలం ఐదేళ్ళలోపు జాతీయ జట్టులోకి వచ్చిన తొలి భారతీయ క్రీడాకారిణిగా నిలిచింది.[8]

క్రికెట్‌లో 2011లో సింగ్రౌలీలో అంతర్-జిల్లా టోర్నమెంట్ కోసం మహిళల జట్టును ఏర్పాటు చేయడంతో క్రికెట్ లోకి వచ్చింది. తగినంత మంది క్రీడాకారులు లేకపోవడంతో జాతీయ జూనియర్ ఫుట్‌బాల్ ఆటలో ఉన్న నుజ్హత్‌ను జట్టులోకి ఆహ్వానించారు.[3] సింగ్రౌలీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ అంతర్-జిల్లా క్రికెట్ పోటీలో వికెట్ కీపర్‌గా ప్రారంభించింది. తన ఆటతీరు వల్ల మధ్యప్రదేశ్ అండర్-19 మహిళల క్రికెట్ జట్టులో ఆమెకు ప్రత్యేక స్థానం లభించింది.[8]

2012–13లో, తన ఆటతీరు వల్ల సెంట్రల్ జోన్ అండర్-19 మహిళల క్రికెట్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికైంది.[8]

రేవా డివిజనల్ క్రికెట్ అసోసియేషన్ కోచ్ ఆరిల్ ఆంథోనీ ఆధ్వర్యంలో కోచింగ్ తీసుకుంది.[9] తన కోచ్‌లో ప్రాక్టీస్ చేయడానికి 3 నెలల్లో 15-20 రోజుల పాటు సింగ్రౌలీ నుండి రేవా వరకు బస్సులో తొమ్మిది గంటలు రోడ్డు మార్గంలో ప్రయాణించేది.[5]

భోపాల్ నుంచి రైలులో సింగ్రౌలీకి తిరిగి ప్రయాణిస్తున్నప్పుడు జాతీయ జట్టుకు ఎంపికైన విషయం నుజాత్‌కు తెలిసింది.[5] దీప్తి శర్మ తర్వాత ప్రపంచ జట్టులోకి వచ్చిన అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది.[5] జెర్సీ నంబర్ ఏడు.[10]

2017, మే 15న 2017 దక్షిణాఫ్రికా క్వాడ్రాంగులర్ సిరీస్‌లో ఐర్లాండ్‌పై మహిళల వన్డే అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసింది.[11]

2017 మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు చేరిన భారత జట్టులో భాగమయింది. అందులో భారత్ తొమ్మిది పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది.[12][13][14]

సింగ్రౌలికి తిరిగి వచ్చినప్పుడు, రైలు స్టేషన్‌లో ఆమెకు పిల్లలు, డిసిఏ సింగ్రౌలీ సభ్యులు, మీడియా, ఆమె కుటుంబ సభ్యులతో సహా పెద్ద సంఖ్యలో ప్రజలు స్వాగతం పలికారు.[5]

మూలాలు[మార్చు]

  1. "Nuzhat Parween". CricketArchive. Retrieved 2023-08-08.
  2. 2.0 2.1 Pradhan, Snehal (జూన్ 18, 2017). "ICC Women's World Cup 2017: Nuzhat Parween has the ability to make full use of limited chances". Firstpost. Retrieved 2023-08-08.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. 3.0 3.1 Trivedi, Vivek (2017-05-30). "Nuzhat Fought Taboos to Play Cricket, Picked for ICC World Cup". News18. Retrieved 2023-08-08.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Nuzhat Parveen". Cricinfo. Retrieved 2023-08-08.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 5.6 5.7 5.8 "Interview with Nuzhat Parween". femalecricket.com. Retrieved 2018-12-15.
  6. "Forced Into Cricket, MP's Nuzhat Now Slated to Play World Cup". The Quint (in ఇంగ్లీష్). 30 May 2017. Retrieved 2018-12-15.{{cite web}}: CS1 maint: url-status (link)
  7. "Nuzhat Parveen a new kid on the block in Indian women’s cricket", One India, 6 November 2016. Retrieved 2023-08-08.
  8. 8.0 8.1 8.2 8.3 "Nuzhat Parveen: Meet next MS Dhoni of Indian cricket team". CatchNews.com (in ఇంగ్లీష్). Retrieved 2023-08-08.
  9. Tomar, Shruti (2016-11-11). "Meet Dronacharyas who help women players script success". www.hindustantimes.com (in ఇంగ్లీష్). Retrieved 2023-08-08.{{cite web}}: CS1 maint: url-status (link)
  10. Sarkar, Sujata (2016-11-06). "Nuzhat Parveen a new kid on the block in Indian women's cricket". www.mykhel.com (in ఇంగ్లీష్). Retrieved 2023-08-08.
  11. "Women's Quadrangular Series (in South Africa), 8th Match: India Women v Ireland Women at Potchefstroom, May 15, 2017". ESPN Cricinfo. Retrieved 2023-08-08.
  12. Live commentary: Final, ICC Women's World Cup at London, Jul 23, ESPNcricinfo, 23 July 2017.
  13. World Cup Final, BBC Sport, 23 July 2017.
  14. England v India: Women's World Cup final – live!, The Guardian, 23 July 2017.

బయటి లింకులు[మార్చు]