నులకపేట
నులకపేట | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | గుంటూరు |
మండలం | తాడేపల్లి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
నులకపేట, గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామ చరిత్ర
[మార్చు]సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]
గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు
[మార్చు]తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది. ఈ గ్రామం విజయవాడ నగరమునకు సమీపముగా తాడేపల్లి మండలంలోఉన్నది. కానీ బస్సు రవాణా సదుపాయము లేదు. ప్రకాశం బ్యారేజీ మూసివేసిన తరువాత ఈ గ్రామం వైభవాన్ని కోల్పోయింది. కృష్ణా నది పక్కనే ఉంది. కానీ విజయవాడకు మాదిరిగా రక్షిత నీరు రాదు.ఇక్కడ 200 ముస్లిం కుటుంబాల వారు నులక నేస్తారు. గ్రామం రాను రాను ఉన్న సదుపాయాలను కోల్పోతోంది. కృష్ణా కెనాల్ జంక్షన్ను తాడేపల్లి రైల్వేస్టేషన్ గా అభివృద్ధి చేసి, కనకదుర్గ వారధి నుండి ఉండవల్లి సెంటర్ను కలుపుతూ ఫ్లై ఓవర్ నిర్మిస్తే ఈ ఊరు మళ్ళీ కీలకమవుతుంది.
గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు
[మార్చు]శ్రీ మాతా శివచైతన్య తపోవనం (మాతాజీ ఆశ్రమం)
[మార్చు]తాడేపల్లి పట్టణ పరిధిలోని నులకపేటలోని ఈ ఆశ్రమంలో, శివకేశవులకు ఆలయాల నిర్మాణం జరుగుచున్నది. 2015, మార్చి-9వ తేదీ ఉదయం 7 గంటలకు, కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ, ఈ ఆలయ నిర్మాణాలను పరిశీలించెదరు.
65 అడుగుల శివుని విగ్రహం:- ప్రకాశం బ్యారేజి - మంగళగిరి గ్రామం మధ్య, రహదారి వెంబడి, రాజధాని ప్రాంతమైన నులకపేటలోని మాతాజీ ఆశ్రమంలో, ఈ శివుని విగ్రహం నెలకొల్పినారు. నూతన రాజధానిలో ఇంత పెద్ద విగ్రహం, ఇదే కావడం విశేషం.
ఈ ఆశ్రమంలో 2017, మార్చి-8వతేదీ బుధవారంనాడు, శ్రీ శివకేశవాలయ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 65 అడుగుల ఎత్తయిన శ్రీ చంద్రశేఖరస్వామి, 16 అడుగుల ఎత్తయిన మహానంది విగ్రహాలను ఆవిష్కరించారు.
ఈ ఆశ్రమంలో శ్రీ వల్లభ గణపతి వార్షిక బ్రహ్మోత్సవాలు 2017, జూన్-12వతేదీ సోమవారం నుండి ప్రారంభమైనవి. ఈ ఉత్సవాలలో భాగంగా, 14వతేదీ బుధవారం ఉదయం సర్వదేవతా మహా పూర్ణాహుతి నిర్వహించారు. గణపతిని కనువిందుగా అలంకరించి, శ్రీ వల్లభ గణపతి శాంతికళ్యాణం నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదం వితరణ చేసారు. ఈ సందర్భంగా కోలాట భజనలు, పారాయణం చేసారు. ఈ ఉత్సవాలు 12వతేదీతో ముగిసినవి. [4]
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-18.