నువ్వులు
Sesame | |
---|---|
Sesame plants | |
Scientific classification | |
Kingdom: | Plantae |
Clade: | Tracheophytes |
Clade: | పుష్పించే మొక్కలు |
Clade: | Eudicots |
Clade: | Asterids |
Order: | Lamiales |
Family: | Pedaliaceae |
Genus: | Sesamum |
Species: | S. indicum
|
Binomial name | |
Sesamum indicum | |
Synonyms[1] | |
|
నువ్వులు | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | S. indicum
|
Binomial name | |
Sesamum indicum |
నువ్వులు (ఆంగ్ల భాష sesame; సంస్కృతం: తిలలు) ఒక రకమైన నూనె గింజలు.
నువ్వులు en:Sesamum indicum సెసమం ప్రజాతికి చెందిన ఒక పుష్పించే మొక్క. దీని అడవి బంధువులు అనేకం ఆఫ్రికాలోనూ, కొంత స్వల్ప సంఖ్యలో భారతదేశంలోనూ కనిపిస్తాయి. కాని సాగు జాతి నువ్వులు భారతదేశంలోనే పుట్టినట్లు శాస్త్రవేత్తలు తీర్మానించేరు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల ప్రాంతాల్లో సహజసిద్ధంగా విస్తృతంగా పెరుగుతుంది. ఈ మొక్కల కాయలలోపల ఉన్న గింజలనుండి వచ్చే ఖాద్య తైలాలకి ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది. నువ్వుల ప్రపంచ ఉత్పత్తి సా. శ. 2016 లో 6.1 మిలియను టన్నులని ఒక అంచనా ఉంది.
నువ్వుల పంటకి 3000 సంవత్సరాల చరిత్ర ఉంది. నువ్వులలోని అనేక జాతులు ఆఫ్రికా అటవీ ప్రాంతాలలో ఉన్నాయి. సేద్యానికి అనుకూలమైన రకం నువ్వులు భారతదేశంలో వృద్ధి చెందాయి. ఎక్కువ ఉష్ణోగ్రత గల ప్రాంతాలలోనూ, అనావృష్టి వంటి పరిస్థితులకు కూడా తట్టుకోగల సామర్ధ్యం ఈ నువ్వుల మొక్కలకు ఉంది.
తెలుగు మాట నువ్వులని సంస్కృతంలో తిలలు అంటారు. ఈ తిలలు లోంచి వచ్చిన మాటే "తైలం." ఇంగ్లీషు మాట sesame లేటిన్ లోని sesamum నుండి వచ్చింది. లేటిన్ మాట అరబ్బీ మాట "సెంసెం" నుండి వచ్చింది. అరబ్బీలో "సెంసెం" అంటే "ద్రవరూపంలో ఉన్న కొవ్వు" అని అర్థం.
చమురు గింజలలో అత్యధిక చమురు దిగుబడిని ఇచ్చేవి నువ్వులు. వీటికి ఒక రకమైన, ఆకర్షణీయమైన షాడబంతో పాటు, వగరు రుచి ఉండడం వల్ల ఇవి ప్రపంచ వ్యాప్తంగా వంటకాల్లో ముఖ్యాంశంగా ఉంటున్నాయి. కాని నువ్వులు కొంత మందిలో (నోటిపూత వంటి) ఎలర్జీని కలుగజేస్తాయి కనుక వీటిని అప్రమత్తతతో వాడాలి.
ప్రపంచంలో నువ్వు గింజల ఎగుమతిలో భారతదేశానిది అగ్రస్థానం. 2013 లో నువ్వులు విత్తనాలు అతిపెద్ద నిర్మాత మయన్మార్ ఉంది 2013. నువ్వులు విత్తనాలు గురించి 4.8 మిలియన్ మెట్రిక్ టన్నుల సాగుచేసేవారు, జపాన్ అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది.
నువ్వు గింజలు నూగుతో గుళికలా ఉన్న కాయలో ఉంటాయి. ఈ గుళిక కాయలు అడ్డుకోతలో దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి (బొమ్మ చూడండి).
నువ్వులు విత్తనాలు చిన్నవి. వీటి పరిమాణం, ఆకృతి,, రంగులు ఇప్పుడు తెలిసిన అనేక వేల రకాలుగ ఉమన్నయి. సాధారణంగా, విత్తనాలు విస్తృత 2 mm, మందపాటి 1 mm దీర్ఘ 3 కు 4 మిమీ. విత్తనాలు వ్యతిరేక చివరిలో కంటే కొద్దిగా అండాకారమైన విత్తనం.
సాగు
నువ్వుల కారణంగా దాని విస్తృతమైన వెరు వ్యవస్థ చాలా కరువు తట్టుకుంటాయి . అంకురోత్పత్తి ప్రారంభ వృద్ధి కోసం తగినంత తేమ అవసరం. పంట కరువు, అలాగే అదనపు నీటి ఉనికిని నిలిచి ఉంతుంది. దిగుబడి గాని పరిస్థితులు గణనీయంగా తక్కువ. నాటడం పుష్పించే ప్రభావం దిగుబడి ముందు తేమ స్థాయిలు.
నువ్వులు ఎక్కువ వాణిజ్య సాగు నీటి అసహనంతో ఉంటాయి. చివరి దెసలో వర్షపాతం పెరుగుదల కంపిస్తుంది అధిక పంట పొడిగిస్తుంది. గాలి కూడా పంట సమయంలో బ్రద్దలై కారణమవుతుంది.
పుష్పించే దీక్షా కాంతి పరివర్తనకాలం నువ్వులు సున్నితంగా ఉంటుంది. కాంతి పరివర్తనకాలం ప్రభావాలు నువ్వుల గింజ చమురు కలిగి ఉంతుంది కాంతి పరివర్తనకాలం చమురు పెరుగుతుంది . గింజ చమురు కంటెంట్ దాని పొషకాలు విలోమానుపాతంలో ఉంటుంది.
నువ్వు ఒక చిన్న విత్తనం నుండి, ఇది చిన్న విత్తనం గింజ చుట్టూ వాయు కదలికను చేస్తుంది ఎందుకంటే పంట తర్వాత దీనిని పొడిగా ఉంచాలి. అందువలన, విత్తనాలు సాధ్యమైనంత పొడి వంటి గానీ లెద 6 % తేమ లేదా తక్కువ వద్ద నిల్వ చేయాలి. సీడ్ చాలా తేమ ఉంటే, అది త్వరగా అప్ వేడి తీస్కుంటుంది. ఇది పులిసిపోయినట్టు తయారవుతుంది.
సంవిధానం
[మార్చు]పండించిన తర్వాత, విత్తనాలు సాధారణంగా శుభ్రం చేసి ఉంటాయి . కొన్ని దేశాల్లో, వారు కచ్చితమైన రంగు నిర్ధారించడానికి బయటకు తిరస్కరిస్తుంది ఒక ఎలక్ట్రానిక్ రంగు సార్టింగ్ యంత్రం నుండి పంపించడం జరుగుతుంది . స్థిరమైన రూపాన్ని నువ్వు గింజలు వినియోగదారుల ద్వారా మంచి నాణ్యత ఉంటుంది . పరిపక్వత విత్తనాలు తొలగించబడ్డాయి చమురు ఉత్పత్తి కోసం ఉపయోగిస్తారు
ఉపయోగాలు
[మార్చు]- నువ్వు గింజల నుండి నువ్వులనూనె తీస్తారు. ఈ నూనెను చాలా వంటలలో ఉపయోగిస్తారు.
- నువ్వులు దంచి తీయని చిమ్మిలి, వేయించి నువ్వుండలు మొదలైన మిఠాయిలు తయారుచేస్తారు.
- నువ్వులను వేయించి వివిధ వంటకాలలో, కూరలలో, పచ్చడిగా వాడతారు. దీనిని నువ్వుల పొడిగా చేసి ఇడ్లీ మొదలైన వాటితో కలిపి తింటారు.
- నువ్వులను భారతీయులు శ్రాద్ధ కర్మలలో వాడతారు.
- నువ్వులలోని మెగ్నీషియం క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు కలిగి ఉంటుంది.
- నువ్వులలో ఉండే జింక్ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
- నువ్వులు ఒమేగా -3, ఒమేగా -6, ఒమేగా -9 ఆమ్లాలని కలిగి ఉండి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.
నువ్వుల సాగు
[మార్చు]ఖరీప్, రబీ రెండు సీజనులలో నువ్వుల పంటను సాగు చేస్తారు. ఖరీప్‌లో ఎక్కువగా సాగు చేస్తారు. ఖరీఫ్ లో సాగు చేసిన పంట దిగుబడి అక్టోబరులో, రబీలో సాగు చేసిన జనవరిలో దిగుబడి వస్తుంది. ఎక్కువ వర్షాధార పంటగా సాగు చేస్తారు. ఖరీఫ్ సీజను అయితే జూన్-జూలైలో, రబీ అయితే అక్టోబరు, నవంబరులో విత్తడం మొదలు పెడతారు. పంటసాగుకు 25-27 డిగ్రీల ఉష్ణోగ్రత అనుకూలం. క్షారలక్షణాలున్న తేలికపాటి ఇసుక నేలలు వ్యవసాయ భూములలో ఈ పంట బాగా దిగుబడి యిచ్చును. నువ్వుల మొక్క తల్లి వేరు కలిగియుండి 2-5 అడుగుల ఎత్తు పెరుగుతుంది. కొమ్మలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో నువ్వుల పంటను జొన్నలు, వేరుశనగ, ప్రత్తి వంటి పంటలతో కలిపి మిశ్రమ పంటగా సాగు చేస్తారు. విత్తటానికి నెల రోజుల ముందే 20-25 టన్నుల కాంపొస్ట్ ఎరువు, సేంద్రియ ఎరువును/హెక్టరుకు పొలమంతట కలిసే కలియ దున్నుతారు. కనీసం 50 మి.మీ వాన పడిన తరువాత విత్తడం మొదలు పెడతారు. సాలుకు, సాలుకు (వరుస) మధ్య దూరం 45 సెం.మీ. సాలులోని మొక్కల మధ్య దూరం 15 సెం.మీ వచ్చెలా నువ్వులను విత్తవలెను. నేల లోపల 2-3 సెం.మీ. లోతులో వుండేలా విత్తాలి. పంటకు పంటకాలం మొత్తం మీద 30 కీ.జిల నత్రజని, 60 కే.జి.ల భాస్వరం, 20 కే.జి.ల పోటాసియం రసాయనిక ఎరువులను వాడాలి. పొటాషియం, భాస్వరంలను ఒకేసారి విత్త్నాలు విత్తితకు ముందు చల్లాలి. నత్రజనిని మాత్రం మూడు దఫాలుగా, మొదటి మూడో వంతు విత్తనం విత్తేటప్పుడు, రెండో దఫా విత్తిన 30రోజులకు, మూడో దఫా, విత్తిన 40 రోజులకు వేయాలి. పంటకాలంలో పైరుకు నీరు పెట్టాలి. పైరుకు నీరు మొదటిసారి విత్తిన 20-30 రోజులకు, రెండో సారి పైరుపూతకు వచ్చే సమయానికి (45-50రోజులు), తరువాత కాయకాచే సమయంలో (65-70) పెట్టాలి. ఆకులు, కాయలు పసుపు రంగుకు రాగానే కోతచెయ్యలి. కాయ పూర్తిగా ఎండు వరకు వదలి వేసిన, కాయ పగిలి నువ్వులు రాలి పోతాయి. ఒకకాయలో 60-100 నువ్వులు వుండును. అందువలన కాయ ప్సుపు రంగుకు వచ్చి కొద్ది పచ్చిగా వున్నప్పుడే కోతచేసి, కంకులను చినచిన్న కట్టలులుగా కట్టి, కాయలున్న భాగంపైకి ఉండేలా, శుభ్రంగా వున్న కళ్లంలో ఆరబెడతారు. ఆరిన కాయలున్న కట్తలు చేతులతో, కళ్లంనేల మీదకాని, లేదా వస్త్రాని పరచి దాని మీదకొట్టి, నువ్వులను నూర్చెదరు. మిగతా పంటలతో పొల్చిన నువ్వుల దిగుబడి తక్కువగా ఉంటుంది. తతిమా నూనె గింజల దిగుబడి 1.0-2.0 టన్నులు/హెక్టరుకు వుండగా నువ్వులు 0.35-.04 టన్నులు మాత్రమే వచ్చును. నూనెను తీసిన నువ్వుల పిండిని పశువుదాణాగా, కోళ్లమేతలో వాడెదరు.నువ్వులనుండి ఎక్స్‌పెల్లరు అనే యంత్రాలద్వారా తీస్తారు. ఎక్స్‌పెల్లరునుండి వచ్చు తెలగపిండిలో 6-8% వరకు నూనె మిగిలి ఉంటుంది. ఆయిల్ కేకు నుండి సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్షన్ పద్ధతిలో సంగ్రహిస్తారు. సాల్వెంట్‌ఎక్స్‌ట్రాక్షన్ వలన అయిల్‌కేకు లోని మొత్తం నూనెను తీయడం జరుగుతుంది.
ఉత్పత్తి
[మార్చు]నువ్వుల ఎక్కువగా పండించే దేశాలు :
- ఇండియా
- ఛైనా
- మయన్మారు
- సుడాను
- ఉగాండా
- యుథోపియా
- నైజీరియా.
ఇండియాలో నువ్వులను సాగు చెయ్యు రాష్ట్రాలు :
- గుజరాత్
- పశ్చిమ బెంగాల్
- కర్నాటక
- రాజస్ధాన్
- మధ్య ప్రదేశ్
- తమిళనాడు
- ఆంధ్ర ప్రదేశ్
- మహరాష్ట్ర
నువ్వుపొడి
[మార్చు]తెల్లనువ్వులు నూనె లేకుండా దోరగా వేయించుకోవాలి. ఆ నువ్వులు వేగుతుండగానే వాటికి సరిపడా ఎండుమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలి. వీటిని చల్లార్చి మిక్సీ జార్ లోకి తీసుకొని, సరిపడ ఉప్పు వేసి చాలా కొద్దిసేపు గ్రైండ్ చేయాలి. ఈ పొడిని గట్టిగా మూత ఉన్న గాజుసీసాలో జాగ్రత్త చేసుకోవాలి. తినడానికి రెడీ.
మూలాలు
[మార్చు]- ↑ "The Plant List: A Working List of All Plant Species". Archived from the original on 19 మే 2020. Retrieved 14 January 2015.