Jump to content

నూతక్కి రామశేషయ్య

వికీపీడియా నుండి
(నూతక్కి రామ శేషయ్య నుండి దారిమార్పు చెందింది)
దస్త్రం:Sri Nutakki Ramaseshaiah.gif
శ్రీ నూతక్కి రామశేషయ్య
నూతక్కి రామశేషయ్య

నూతక్కి రామశేషయ్య (1897 - 1969) ప్రముఖ న్యాయవాది, పరిపాలనా దక్షులు, పారిశ్రామిక వేత్త. వీరి పూర్వీకులు గుంటూరు జిల్లా చిలువూరు గ్రామానికి చెందినవారు. అయినా వీరు ఒడిషాలో స్థిరపడ్డారు. పార్లమెంటు సభ్యునిగా,ఒరిస్సా శాసన సభ్యునిగా,మంత్రిగా పనిచేసారు.

జననం,విద్య

[మార్చు]

నూతక్కి రామశేషయ్య గారు గుంటూరు జిల్లా చిలువూరు గ్రామంలో నూతక్కి ఉద్దండ రామయ్య దంపతులకు 1897 సెప్టంబరు 29న జన్మించారు . మద్రాసులో న్యాయశాస్త్రాన్ని చదివి, విజయవాడలో కొంతకాలం న్యాయవాదిగా పనిచేశారు. వీరి వివాహం 1924 లో శ్రీమతి పున్నమ్మ గారితో జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు,ఇద్దరు కుమార్తెలు. ప్రముఖ అణు శాస్త్రవేత్త నూతక్కి భాను ప్రసాద్ గారు వీరి కుమారుడే.

రాజకీయ జీవితం

[మార్చు]

రామశేషయ్య గారు ఒరిస్సా లోని జైపూర్ సంస్థానంలో అసిస్టెంటు దివానుగా, తరువాత దివానుగా నియమితులయ్యారు. 1929-30 లో బెజవాడ తాలుకా బోర్డు అధ్యక్షునిగా పనిచేసారు. గ్రంథాలయ ఉధ్యమంలో పనిచేసారు.

వెలగపూడి రామకృష్ణ గారు స్థాపించిన పరిశ్రమలను వీరు నిర్వహిస్తూ ఉండేవారు. ఆ ప్రాంతంలో రాజకీయంగా పలుకుబడి సంపాదించి 1952 సంవత్సరంలో పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు.

తరువాత జైపూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా ఒడిషా శాసనసభకు ఎన్నికయ్యారు. ఒడిషా ప్రభుత్వంలో ఆరోగ్య శాఖామంత్రిగా పనిచేశారు. 1962 లో నౌరంగ్ పూర్ నుండి లోక్ సభకు పోటి చేసి పరాజయం పొందారు.

మరణం

[మార్చు]

నూతక్కి రామశేషయ్య గారికి సాహిత్యం మీద ఎంతో అభిమానం ఉండేది. వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి 'దీపావళి' ఖండకావ్య సంపుటిని వీరికి అంకితమిచ్చారు.

వీరు 1969 సంవత్సరం జూన్ 1 వ తేదీన నిర్యాణం చెందారు.