నెల్లూరులో కన్యాశుల్కం పూర్తి నాటక ప్రదర్శన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గురజాడ 152వ జయంతిని పురస్కరించుకొని నెల్లూరులో 2014 సెప్టెంబరు 21న శ్రీ కస్తూరిదేవి కళాక్షేత్ర ఆడిటోరియంలో విజయనగరం "నవయువ ఆర్ట్సు" సంస్థ మధ్యాహ్నం 2 గంటలనుంచి రాత్రి పదివరకు కన్యాశుల్క పూర్తినాటకం ప్రదర్శన ఇచ్చింది . ఈ ప్రదర్శన రెండు విరామాలతో రాత్రి పదిగంటల వరకు కొనసాగింది. కన్యాశుల్కం నాటకం తోలి ప్రదర్శన 1893 అగస్టు మాసంలో విజయనగరంలో జరిగింది. గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకం 1893 జనరిలో అచ్చయినది. తర్వాత అనేక చేర్పులు మార్పులతో గురజాడ దాన్ని 1909 లో పునర్ముద్రణ చేశాడు. రెండోముద్రణ అనేక ప్రదేశాలలో ప్రదర్శింపబడింది. అయితే చాలా పెద్ద నాటకం అని దాన్ని కుదించి మూడు గంటల నాటకంగా ప్రదర్శిస్తూ వచ్చారు. నవయువ ఆర్ట్సు సంస్థ 2013 జనవరిలో విజయనగరం, విశాఖపట్నంలో 8 గంటల పూర్తినాటకాన్ని ప్రదర్శించింది. మరొకసారి విశాఖట్టణం పోర్ట్ ట్రస్ట్ లో ప్రదర్శన ఇచ్చింది. ఈ ప్రదర్శనకు నెల్లూరు నుంచి డాక్టర్ కాళిదాసు పురుషోత్తం హాజరయ్యాడు, ఆ తర్వాత నవయువ ఆర్ట్సు హైదరాబాదు రవీంద్ర భారతిలో మరొక ప్రదర్శన ఇచ్చింది. నెల్లూరు సింహపురి రైతు పత్రిక సంపాదకుడు నిరంజన్ రెడ్డి హైదరాబాదు వెళ్లి ఆ నాటకం చూచి వచ్చాడు.

ఏం.ఎల్.సి శ్రీ విఠపు బాలసుబ్రమణ్యం నాయకత్వంలో కన్యాశుల్క నాటక ప్రదర్శన కమిటి ఏర్పడి నెల్లూరులో ప్రదర్శనకు ప్రయత్నం చేసింది.

కమిటి సభ్యలు:ఆచార్య ఆదిత్య, డాక్ట ర్ పులుగండ్ల చెంద్రసేఖర్, డాక్టర్ కాళిదాసు పురుషోత్తం, చిరసాని కోటిరెడ్డి, చలంచర్ల భాస్కర్ రెడ్డి, అనందరావు తదితరులతో నాటక ప్రదర్శన కమిటి ఏర్పడింది. కమిటి మొదటి సమావేశం నిరంజన్ రెడ్డి తమ గ్రామంలో ఏర్టుపాటు చేశాడు. ప్రదర్శనకు షుమారు నాలుగు లక్షలు పైగా అవసరం అని అంచనా. కమిటి సభ్యలు తలా పదివేలు విరాళం ఇచ్చారు. కొందరు దాతలు సహృదయంతో విరాళాలిచ్చి ప్రోత్సహించారు. ఉడుతా కృష్ణయ్య 50వేల రూపాయలు, తుంగా ఆదినారాయణరెడ్డి 30వేల రూపాయలు, రత్నం స్కూల్ అధినేత రత్నం 20వేల రూపాయలు, ఎస్ఆ.ర్. కె అధినేత కృష్ణమూర్తి , మరికొందరు 10వేలకు తగ్గకుండా విరాళం ఇచ్చారు. ఒక డాక్టర్ కాష్ బాక్స్ తెరిచి ఆరోజు వచ్చిన సంపాదన మొత్తం ఇచ్చారు. ఎంమెల్సి విఠపు బాలసుబ్రమణ్యం నేతృత్వంలో కమిటి జిల్లా కలెక్టరు శ్రీకాంత్ గారిని కలిస్తే, వారు 50వేల రూపా యల విరాళం మంజూరుచేసి, నెల్లూరు కస్తూరిబా కళాక్షేత్ర ఆడిటోరియంను ప్రదర్శనకు ఉచితంగా ఇచ్చారు.

ఎనిమిది గంటల పాటు ప్రేక్షకులు నాటకం చూస్తారా అనే కొండంత అనుమానం? ప్రజల సహకారంతో సినిమా విడుదల రోజు చేసినట్లు నగరం అంతటా పోస్టర్లు, కట్ ఔట్లు, బేనర్లు, వేల కరపత్రాలు.. ప్రతి ఆఫీసు, బ్యాంకి , స్కూల్ దేన్నీ విడిచిపెట్టలేదు. కరపత్రాలు ఊళ్ళకు కూడా వెళ్ళాయి. స్థానిక పత్రికలూ ప్రచారం చేసాయి. 2014 september, 20 వేకువనే విజయనగరం నుంచి నాటకబృందం మొత్తం నెల్లూరులో దిగారు. వారు ఎంపిక చేసుకొన్న కళాక్షేత్ర ఆడిటోరియంలోనే విడిది కూడా ఏర్పాటయింది. నాటక ప్రదర్శనకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి.

సెప్టెంబరు 21 మధ్యాహ్నం 12 దాటింది. ఒక్కొక్కరే ప్రేక్షకులు రావడం మొదలయింది. కొందరు వృద్ధ దంపతులు చేతి సంచి, ఫ్లాస్క్ తో, వచ్చారు. మధ్యాహ్నం రెండు గంటలకల్లా హాలు ప్రేక్షకులతో నిండిపోయింది. ఖచ్చితంగా 2 గంటలకు ఏంఏల్.సి విఠపు బాలసుబ్రమణ్యం జ్యోతి వెలిగించి ప్రదర్శన ప్రారంభించాడు. నాటకం కచ్చితంగా 2 గంటలకే ఆరంభమయింది. అంతజనాన్ని ఎవరూ ఊహించలేదు. కార్యకర్తలు హాలు ముందు విశాలమయిన వరండాలో పెద్ద టీవి ఏర్పాటుచేసి రెండుమూడు వందల కుర్చీలు వేయించారు. అక్కడే కాంటీన్ పెట్టడంతో కుర్చీలలో కూర్చొని, టీలు సేవిస్తూ జనం నాటకం చూచారు. మద్రాసు, బెంగుళూరు, విజయవాడ, వంటి నగరాలనుండి కూడా కొందరు తరలివచ్చారు.

నటీనటులు పోటీపడి నటించారు, నాటక సమన్వయకర్త వెలుగు రామినాయుడు, దర్శకుడు కిశోర్, ఆర్గనైజర్ ఏం. కె . బాబు అందరూ నాటక ప్రదర్శనకు సహకరించారు.

రాత్రి పదిగంటలకు నాటకం పూర్తయింది. మధ్యలో రెండు 15 నిమిషాల విశ్రాంతి .. జిల్లా కలెక్టరు, వారి శ్రీమతి నాటకం ముగిసేదాక ఉండి, నటులకు, సాంకేతిక నిపుణులకు, దర్శకునికి అందరికీ మొమెంటోలు బాహూకరించారు. నాటకంలో వెంకటేశం పాత్రధారి అనాథ శరణాలయం విద్యార్థి. అతనికి పదివేల రూపాయలు విడిగా బహూకరిచబద్దవి.

నెల్లూరు పత్రికలు ప్రదర్శనను గురించి ప్రత్యేక సంచికలు వెలువరిచాయి. నాటకం పూర్తి అయిన తర్వాత మిగిన ఏభయి వేల రూపాయలు నవయువ ఆర్ట్స్ వారికే కబాహూక రించబడినవి.

నాటక ప్రదర్శన కమిటీ సభ్యలు ఎక్కడ కనపడినా చాలా కాలం కన్యాశుల్కం బాచ్ అని నెల్లూరులో అనేవారు. ఆ విధంగా మహాకవి గురజాడ ఆశయాలను కమిటీ నెల్లూరు ప్రజల ముందుకు తీసుకొని వెళ్ళగలిగింది.

మూలాలు[మార్చు]

  1. సింహపురి రైతు, అక్టోబరు 2014 సంచిక,
  2. లాయరు వార పత్రిక Sept 26th, 2014.
  3. విశాలాక్షి, అక్టోబరు సంచిక,
  4. జమీన్ రైతు, Sept 26th, 2014.
  5. పున్నమి దినపత్రిక, 25 -9-214
  6. State leader, 01-11-2914.