నేతి పరశురామశర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నేతి పరశురామశర్మ
జననంతెనాలి, గుంటూరు జిల్లా
ప్రసిద్ధిరంగస్థల నటులు
తండ్రినేతి సీతారామశర్మ
తల్లికమలాంబ

నేతి పరశురామశర్మ ప్రముఖ రంగస్థల నటులు.

జీవిత విశేషాలు[మార్చు]

పరశురామశర్మ, నేతి పరమేశ్వరశర్మకు తమ్ముడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేశారు.

రంగస్థల ప్రస్థానం[మార్చు]

పరశురామశర్మ అన్నలందరు కళారంగంలో ఉన్నారు. దాంతో పరశురామశర్మ కూడా కళారంగంలోకి వచ్చారు. తను పనిచేస్తున్న బ్యాంకులో ఒక నాటక సమాజాన్ని ఏర్పాటుచేసి, నాటకాలు ప్రదర్శించారు.

కళాభారతినాటక సంస్థను ప్రారంభించి, అ సంస్థ ప్రదర్శించిన నాటకాలలో ప్రముఖ పాత్రలు పోషించారు. తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘానికి ప్రథమ కార్యాదర్శిగా పనిచేసి, అనేకమంది కళాకారులను సన్మానించారు. రచయితల, కళాకారుల గోష్ఠి కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తమ చలనచిత్ర అభిమానుల సంఘం యొక్క కార్యక్రమాలలో పాల్గొన్నారు.

నటించిన నాటకాలు - నాటికలు[మార్చు]

నాటకాలు

 1. నాలుగిళ్ల చావిడి
 2. బొమ్మా బొరుసు
 3. పట్టాలు తప్పిన బండి
 4. మరో మొహంజదారో
 5. జై భవానీ

నాటికలు

 1. తుఫాన్
 2. దంత వేదాంతం
 3. పేటెంట్ మందు
 4. పెండింగ్ ఫైల్
 5. మబ్బులు
 6. కళ్లు
 7. హిమజ్వాల
 8. అతిధి
 9. మంచుతెర
 10. ఆడది కోరే మొగవాడు

రేడియో నాటకాలు

 1. పల్నటి యుద్ధం
 2. జైభవానీ
 3. ఆశ్వఘోషుడు
 4. విజయాంబిక
 5. రేపేంది

మూలాలు[మార్చు]

 • నేతి పరశురామశర్మ, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 316.