Jump to content

నేను స్టూడెంట్ సర్

వికీపీడియా నుండి
నేను స్టూడెంట్ సర్
దర్శకత్వంరాఖీ ఉప్పలపాటి
రచనకృష్ణ చైత‌న్య
నిర్మాతసతీష్‌ వర్మ
తారాగణం
ఛాయాగ్రహణంఅనిత్ మధాడి
కూర్పుచోటా కే ప్రసాద్
సంగీతంమహతి స్వరసాగర్‌
నిర్మాణ
సంస్థ
ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్‌
విడుదల తేదీs
2 జూన్ 2023 (2023-06-02)(థియేటర్)
14 జూలై 2023 (2023-07-14)(ఆహా ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

నేను స్టూడెంట్ సర్ 2023లో విడుదలైన యాక్షన్‌ థ్రిల్లర్‌ తెలుగు సినిమా. ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై సతీష్‌ వర్మ నిర్మించిన ఈ సినిమాకు రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించాడు. బెల్లంకొండ గ‌ణేశ్, అవంతిక దాసాని, సునీల్‌, సముద్రఖని, శ్రీకాంత్ అయ్యంగర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 13న విడుదల చేసి[1], సినిమాను మార్చి 10న విడుదల కావాల్సి ఉండగా[2], అనివార్య కారణాల వల్ల  విడుదల వాయిదా వేసి[3] జూన్ 1న విడుదల చేశారు.[4][5]

వైజాగ్ లో సుబ్బారావు(గణేశ్) కాలేజీ స్టూడెంట్, అతడికి ఐఫోన్ అంటే తెగ పిచ్చి ఒక 'ఐ ఫోన్' కొనాలని అనుకుంటాడు, కానీ ఆర్ధికంగా అతను అంత స్తోమత లేనివాడు. దానికోసం చాలా కస్టపడి 90వేల రూపాయలు రెడీ చేసుకుని కొనుక్కుంటాడు. దానికి వాళ్ల అమ్మ బుచ్చిబాబు అని పేరు పెడుతుంది. సొంత తమ్ముడిలా ఐఫోన్ ను చూసుకుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు యూనివర్సిటీలో గొడవ జరుగుతుంది. దీంతో స్టూడెంట్స్ అందరిని పోలీసులు తీసుకువెళ్లి స్టూడెంట్స్ ఫోన్స్ తీసుకుంటారు. అందులో నుంచి సుబ్బారావు ఫోన్ పోతుంది. పోలీస్ కమిషనర్ వాసుదేవన్(సముద్రఖని)కి ఫిర్యాదు చేస్తాడు. ఫోన్ కోసం ప్రయత్నాలు చేస్తుండగానే స్టూడెంట్ లీడర్ చనిపోతాడు. ఐఫోన్ పోవడానికి హత్యకు సంబంధమేంటి? ఈ కుట్రలో నుంచి సుబ్బారావు ఎలా బయటపడ్డాడు? అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్‌
  • నిర్మాత: సతీష్‌ వర్మ
  • కథ: కృష్ణ చైత‌న్య
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాఖీ ఉప్పలపాటి
  • సంగీతం: మహతి స్వరసాగర్‌
  • సినిమాటోగ్రఫీ: అనిత్ మధాడి
  • ఎడిటర్: చోటా కే ప్రసాద్
  • మాటలు: కళ్యాణ్ చక్రవర్తి
  • కోరియోగ్రఫీ: రఘు మాస్టర్
  • ఫైట్స్: రామకృష్ణన్

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (13 November 2022). "ఐఫోన్‌ ఎవరు దొంగిలించారు?". Archived from the original on 18 February 2023. Retrieved 18 February 2023.
  2. Mana Telangana (17 February 2023). "'నేను స్టూడెంట్ సార్'! విడుదల తేదీ ఖరారు". Archived from the original on 18 February 2023. Retrieved 18 February 2023.
  3. Namasthe Telangana (27 February 2023). "బెల్లంకొండ గణేశ్‌ నేను స్టూడెంట్‌ సర్ విడుదల వాయిదా.. కారణమిదే". Archived from the original on 27 February 2023. Retrieved 27 February 2023.
  4. 4.0 4.1 Eenadu (2 June 2023). "రివ్యూ: నేను స్టూడెంట్‌ సర్‌". Archived from the original on 5 June 2023. Retrieved 5 June 2023. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "రివ్యూ: నేను స్టూడెంట్‌ సర్‌" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  5. Sakshi (3 July 2023). "అఫీషియల్: ఓటీటీకి వచ్చేస్తోన్న 'నేను స్టూడెంట్ సర్'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?". Archived from the original on 6 July 2023. Retrieved 6 July 2023.
  6. 10TV Telugu (9 September 2022). "నేను స్టూడెంట్ సర్.. అంటోన్న బెల్లంకొండ హీరో!". Archived from the original on 18 February 2023. Retrieved 18 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. Namasthe Telangana (10 October 2022). "నేను స్టూడెంట్ స‌ర్‌ హీరోయిన్ ఫైన‌ల్‌..లుక్ విడుద‌ల". Archived from the original on 18 February 2023. Retrieved 18 February 2023.
  8. V6 Velugu (18 October 2022). "నేను స్టూడెంట్ సర్!' నుంచి మరో అప్ డేట్". Archived from the original on 18 February 2023. Retrieved 18 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు

[మార్చు]