నేలతాడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


నేలతాడి
Curculigo orchioides.jpg
Curculigo orchioides
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
(unranked): పుష్పించే మొక్కలు
(unranked): Monocots
క్రమం: Asparagales
కుటుంబం: Hypoxidaceae
జాతి: Curculigo
ప్రజాతి: C. orchioides
ద్వినామీకరణం
Curculigo orchioides
Gaertn., 1788
పర్యాయపదాలు
  • Curculigo ensifolia R. Br.[1]

నేలతాడి యొక్క వృక్ష శాస్త్రీయ నామం కర్కులిగో ఆర్కి యూయిడిస్ (Curculigo orchioides). ఇది హైపాక్సిడేసి అనే కుటుంబమునకు చెందినది. వేరులో రెసిన్, టానిక్ మరియు కాల్షియం ఆక్సలేట్స్ ఉన్నాయి.

ఇతర భాషలలో పేర్లు[మార్చు]

శాస్త్రీయంగా - కర్కులిగో ఆర్కి యూయిడిస్, సంస్కృతంలో - తాలమూరి లేక ముసాలి. మలయాళంలో నిలప్పన

వ్యాప్తి[మార్చు]

అనేక గుణాలున్న ఈ మొక్కను పెరటిలో పెంచవచ్చును. ఇసుక నేలలు ఈ మొక్క పెరుగుదలకు మంచిది. ఈ మొక్కలను అరణ్యాల నుంచి సేకరించాలి.

లైంగిక వృద్ధికి[మార్చు]

నేలతాడి వేరును లైంగిక వృద్ధికి వాడే ఔషధాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. నేలతాడి వేరు శతావరి, బోడతరం, మోదుగ విత్తులు కలిపి చూర్ణం చేసి తగు మోతాదులో తేనెలో తీసుకుంటే ముసలితనంలో వచ్చే నిస్సత్తువ పోతుందని అంటారు.

తెల్లబట్ట వ్యాధి నివారణకు[మార్చు]

తెల్లబట్ట వ్యాధికి ఋతు సంబంధ బాధలకు నేలతాడి వేర్లను, పల్లేరు కాయలు, బూరుగు (జిగురు), దూలగొండి విత్తులు, మాసారి తీగ సమభాగాలుగా కలిపి, ఎండించి చూర్ణం చేసి, పాలతో ఇస్తే తగ్గుతుంది. దీనినే ముసల్యాది చూర్ణం అని అంటారు.

ఆయుర్వేదం[మార్చు]

వేరు నూరి పైపూతగా చనుకట్లు గట్టిపడడానికి, పెరగడానికి వాడతారు. ఆయుర్వేద ఔషధమయిన అశ్వగంధారిష్టలో ఈ మొక్కను ఉపయోగిస్తారు. అరటి దుంప రసంలో, నేలతాడి దుంపల చూర్ణం కలిపి, రోజుకు రెండు లేక మూడు సార్లు ఇస్తే, రోజు మార్చి రోజు వచ్చే జ్వరాలు తగ్గుతాయి. ఈ చూర్ణాన్ని పిపళ్ళ చూర్ణములో కలిపి తింటే, జీర్ణ జ్వరాలన్నీ పోతాయి. వన చూర్ణంలో, నేలతాడి దుంపల చూర్ణం కలిపి గుంటగలిజేరు రసంలో తీసుకుంటే, సకలవాత వ్యాధులు హరిస్తాయి. ఈ చూర్ణాన్ని మజ్జిగలో కలుపుకొని ప్రతి నిత్యం తీసుకుంటే, బొల్లి వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. కొంత కాలానికి గుణం కనిపిస్తుంది. నేలతాడి చూర్ణం త్రిఫల కషాయంలో రెండు లేక మూడు పూటలు 40 రోజులు తీసుకుంటే జలధరు వ్యాధి తగ్గుతుంది.

మూలాలు[మార్చు]

  1. USDA, ARS, National Genetic Resources Program. "Curculigo orchioides Gaertn". Germplasm Resources Information Network - (GRIN). Beltsville, Maryland, USA: National Germplasm Resources Laboratory. Retrieved 30 May 2011.CS1 maint: multiple names: authors list (link)

మందుమొక్క - ఆదివారం, ఆంధ్రజ్యోతి - డా.వేదవతి

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=నేలతాడి&oldid=2156022" నుండి వెలికితీశారు