Jump to content

నేహా సింగ్ రాథోడ్

వికీపీడియా నుండి
నేహా సింగ్ రాథోడ్
జన్మ నామంనేహా సింగ్ రాథోడ్
జననం1997
కైమూర్, బీహార్, భారతదేశం
మూలంకైమూర్
సంగీత శైలిభోజ్‌పురి జానపద గాయకురాలు
వృత్తిజానపద గాయకురాలు
లేబుళ్ళుNSR

నేహా సింగ్ రాథోడ్ భారతీయ జానపద గాయని. ఆమె భోజ్‌పురి భాషలో పాడుతుంది. ఆమె తన పాటల ద్వారా ద్రవ్యోల్బణం, అవినీతి, పేదరికం, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నలను సంధిస్తుంది. అవి వ్యంగ్యాస్త్రాలను కూడా కలిగి ఉంటాయి. బీహార్‌లోని కైమూర్ జిల్లాకు చెందిన ఆమె బీహార్ మే కా బా?, యూపీ మే కా బా?, యూపీ మే కా బా? పార్ట్ 2 వంటి పాటలు బాగా వైరల్ అయ్యాయి.[1]

ఇటీవల విడుదలైన యూపీ మే కాబా రెండో వెర్షన్ పాట నెట్టింట వైరల్ కావడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ పాట సమాజంలో అసమ్మతి, ఉద్రికత్త సృష్టించేలా ఉందని ఆరోపిస్తూ పోలీసులు 2023 ఫిబ్రవరి 21న ఆమెకు 160 సిఆర్‌పిసి నోటీసు ఇచ్చారు.[2]

నేపథ్యం

[మార్చు]

1997లో బీహార్‌లోని కైమూర్ జిల్లాలో మధ్యతరగతి కుటుంబంలో నేహా సింగ్ రాథోడ్ జన్మించింది. అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఆమె కంపోజ్ చేసిన ఒక్క జానపద పాటతో ప్రముఖవ్యక్తిగా అవతరించింది. అలాగే వివాదాలకు కూడా చిరునామాగా మారింది. ఆ తర్వాత రోజ్గర్ దేబా కి కర్బా డ్రామా అనే పాట యూట్యూబ్‌లో విడుదలై వైరల్ అయ్యింది. ఈ పాట బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువతకు మద్దతుగా రూపొందించబడింది.[1]

బాహ్య లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 News Desk, Harraiya Times (2023-02-08). "नेहा सिंह राठौर (Bhojpuri Singer) जीवन परिचय". Harraiya Times (in హిందీ). Archived from the original on 2023-02-24. Retrieved 2023-02-08.
  2. Telugu, ntv (2023-02-22). "Neha Singh Rathore: యోగితో అట్లుంటది.. ప్రభుత్వంపై సెటైరికల్ సాంగ్.. సింగర్‌కు పోలీసుల నోటీసులు". NTV Telugu. Retrieved 2023-02-24.