పంకజ్ భుజ్‌బల్
పంకజ్ ఛగన్ భుజ్‌బల్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 అక్టోబర్ 15 | |||
నియోజకవర్గం | గవర్నర్ చేత నామినేట్ చేయబడ్డాడు | ||
---|---|---|---|
పదవీ కాలం 2009 – 2019 అక్టోబర్ 24 | |||
ముందు | సంజయ్ పవార్ | ||
తరువాత | సుహాస్ కాండే | ||
నియోజకవర్గం | అంధేరి పశ్చిమ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | ఛగన్ భుజ్‌బల్, | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
పంకజ్ ఛగన్ భుజ్‌బల్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు నందగావ్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
పంకజ్ భుజ్‌బల్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఛగన్ భుజ్‌బల్ కుమారుడు.
రాజకీయ జీవితం
[మార్చు]పంకజ్ భుజ్‌బల్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 మహారాష్ట్ర ఎన్నికలలో నందగావ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి సంజయ్ పవార్‌పై 21,369 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2] ఆయన 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి సుహాస్ కాండేపై 18,436 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]
పంకజ్ భుజ్‌బల్ 2019 ఎన్నికలలో నందగావ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి సుహాస్ కాండే చేతిలో 89,874 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4] ఆయన 2024లో అక్టోబర్ 15న మహారాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ "Nandgaon Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 16 December 2024. Retrieved 16 December 2024.
- ↑ The Hindu (15 October 2024). "Seven Maharashtra MLCs sworn in, hours before EC announcement of Assembly polls" (in Indian English). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.