పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి
పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి
జననంపంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి
1890
మరణం1951
ప్రసిద్ధిసంస్కృతాంధ్ర ప్రాకృత భాషా పండితులు
తండ్రివేంకటేశ్వర్లు
తల్లిఅలమేల్మంగ

పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి (1890 - 1951) సంస్కృతాంధ్ర ప్రాకృత భాషా పండితులు.[1]

జీవిత సంగ్రహం

[మార్చు]

వీరి తల్లిదండ్రులు వేంకటేశ్వర్లు, అలమేల్మంగ. వీరి అన్నయ్య పంచాగ్నుల దక్షిణామూర్తి శాస్త్రి.

వీరు మద్రాసులోని ఆంధ్ర పత్రిక కార్యాలయంలో పనిచేశారు. 1908 నుండి ఆ పత్రిక ఉగాది సంచికలు వీరి పర్యవేక్షణలోనే విదులయ్యాయి. వీరు 1930లో ఆర్య భారతీ గ్రంథమాలను నెలకొల్పి కొన్ని సంస్కృత గ్రంథాలను ప్రకటించారు. తర్వాత బరంపురంలోని కళ్లికోట రాజా కళాశాలలో ఆంధ్ర పండిత పదవిని జీవితాంతం అలంకరించారు.

రచనలు

[మార్చు]

వీరు రాజశేఖరుని కావ్యమీమాంస; వ్యాత్సాయనుని కామసూత్రాలు, గౌతముని ధర్మసూత్రాలు విశేషాంశాలను చేర్చి సులభమైన ఆంధ్ర వివరణలతో ప్రకటించారు. కౌటిల్యుని అర్థశాస్త్రానికి అపూర్వ విశేషాలతో తెలుగు వ్యాఖ్యను, ఆంధ్ర లిపి పరిణామం అను గ్రంథాన్ని రచించారు. వీరికి నవ్య సాహిత్యంలోను, వ్యవహారిక భాషలోను మక్కువ ఎక్కువ. గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారికి తోడుగా ఉండి వ్యవహారిక భాషోద్యమంలోను, నవ్య సాహిత్య పరిషత్తు వారితో ఎంతో కృషిచేసి అనేక వ్యాసాలు రచించారు. వీరు "ప్రతిభ" పత్రికలో నవ్య సాహిత్య స్వరూప స్వభావాలను విపులంగా చర్చించారు.

  • శ్రీ వేమనయోగి జీవితము (1917) [2]

మూలాలు

[మార్చు]
  1. ఆదినారాయణ శాస్త్రి, పంచాగ్నుల, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, పొట్టి శ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం, హైదరాబాద్, పేజీ: 41.
  2. శ్రీ వేమనయోగి జీవితము పుస్తకం అర్కీవ్.ఆర్గ్ లో ప్రతి

యితర లింకులు

[మార్చు]
Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:

పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి జీవిత విశేషాలు