పంజాబీ తండూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంజాబీ తండూర్
Clay Pots
మూలము
మూలస్థానంPunjab region

పంజాబీ తండూర్ (Gurmukhī:ਤੰਦੂਰ; Shahmukhi:تندور) అనేది పంజాబ్లో వంట తయారు చేయడానికి ఉపయెగించే ఒక మట్టితో తయారు చేయబడ్డ పాత్ర.

తయారీ[మార్చు]

దీనిని ప్రత్యేకమైన మట్టితో తయారు చేస్తారు. గోళాకారంగానూ నిలువుగానూ ఉండే వీటిని పంజాబ్ లోని గ్రామాలలో సాంప్రదాయ వంటకాలకు వాడుతారు. ఈ తండూర్లను నేలలో అతికించేస్తారు. కర్రలు, చెక్కలు, బొగ్గులతో అందులో మంట వేస్తారు. దాదాపు 480 డిగ్రీలు కూడా మండగలవు వీటిలో.[1] కొన్ని రకాల పంజాబీ తండూర్లు నేలకు ఎత్తులో కూడా ఉంటాయి.[2] కొన్ని గ్రామాలలో గ్రామ మొత్తానికి ఉమ్మడి తండూర్లు కూడా కలిగి ఉంటారు.[3][4][5]

సింధు లోయ నాగరికత ప్రదేశాల్లో ఈ పంజాబీ తండూర్ల అవశేషాలు కూడా దొరికాయి.[6] అవిభాజ్య పంజాబ్‌లో కూడా ఈ పంజాబీ తందూర్లను వాడేవారు.[3][7]

ఉపయోగాలు[మార్చు]

పంజాబీ సంస్కృతిలో కూడా ఈ తండూర్లు భాగమైపోయాయి. ఈ సామూహిక తండూర్ల వద్ద కూర్చొని ఎన్నో జానపద పాటలకు ప్రాణం పోశారు పంజాబీ పడుచులు.[3]

భారత విభజన తరువాత ఇతర ప్రదేశాల్లో స్థిరపడిన పంజాబీల ద్వారా ఈ తండూర్లు భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు పరిచయమయ్యాయి.[8]

తండూర్ కీ, భథికి తేడా[మార్చు]

తండూర్ మట్టి, ఇటుకలతో తయారు చేస్తారు. ఒక వైపు ఓపెన్ గా ఉండి, దాంట్లో పదార్ధాలను వండుతారు. కాని భథి పైన ఎదైనా లోహంతో తయారు చేసిన మూత ఉంచి వండుతారు. భథి నుంచి పొగ వేరే సిలిండర్ వంటి దాని నుండి బైటకు వస్తుంది.[3]

కొన్ని భథిలపై మట్టితో శాశ్వతంగా కప్పేస్తారు. వాటిని భట్టీలు అంటారు. వీటిని ఎక్కువగా రాజస్థాన్ లో వాడతారు.[9] ఎక్కువ మోతాదులో వండాలంటే ఈ భథిలపై అసలు మూతే ఉంచరు.[10]

మూలాలు[మార్చు]

  1. Vahrehvah
  2. Punjabi tandoor in Amritsar
  3. 3.0 3.1 3.2 3.3 Alop ho riha Punjabi virsa byHarkesh Singh Kehal Pub Lokgeet Parkashan ISBN 81-7142-869-X
  4. Pind Diyan Gallian PTC Channel - Bilga (Jalandhar) which are also known as tadoors in Punjabi.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-09-14. Retrieved 2016-07-23.
  6. Pop's Mops and Sops - Barbecue and Sauces from Around the World By "B" "B" Quester [1]
  7. [2] The Rough Guide to Rajasthan, Delhi and Agra By Daniel Jacobs, Gavin Thomas
  8. New York Times STEVEN RAICHLEN 10 05 2011
  9. The Hindu Mohammed Iqbal 14 10 2012
  10. "Traditional stoves". Archived from the original on 2016-10-28. Retrieved 2016-08-02.