పచ్చా రామచంద్రరావు
పచ్చా రామచంద్రరావు ప్రపంచ ప్రఖ్యాత లోహ శాస్త్రజ్ఞుడు. 1942 మార్చి 21 న కృష్ణా జిల్లా కౌతవరం గ్రామంలో నారాయణస్వామి, లక్ష్మీబాయి దంపతులకు జన్మించాడు. కాశీ హిందూ విశ్వవిద్యాలయములో విద్యార్థిగా (1963-68), ఆచార్యునిగా (1964-92), ఉపకులపతిగా (2002-05) చేసిన ఎకైక వ్యక్తి రామచంద్రరావు. 1992 నుండి 2002 వరకు జంషెడ్ పూర్ లోని జాతీయ లోహశాస్త్ర పరిశోధనాశాల నిర్దేశకునిగా పనిచేశాడు. పిమ్మట 2005 నుండి 2007 వరకు Defence Institute of Advanced Technology తొలి ఉపకులపతిగా పనిచేశాడు. పదవీ విరమణ తరువాత హైదరాబాదు లోని 'అంతర్జాతీయ లోహశాస్త్ర, నూతన పదార్థ పరిశోధనా సంస్థ' లో రాజా రామన్న ఫెలోగా చేశాడు.
బాల్యము, విద్య
[మార్చు]రామచంద్రరావు తండ్రి నారాయణస్వామి సహకార సంఘముల ఉప రిజిస్ట్రార్ గా పనిచేశాడు. మేనమామ నార్ల వెంకటేశ్వరరావు ప్రఖ్యాత సంపాదకుడు, రచయిత. ఇంటివద్దే తల్లిదండ్రుల వద్ద ప్రాథమిక విద్యాభ్యాసము చేసి, పాఠశాలలో ఏడవ తరగతిలో చేరాడు. పదమూడవ ఏట విజయవాడలో ఆంధ్ర లయోలా కళాశాలలో ఇంటర్మీడియెట్, తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయములో ఉన్నత విద్య (భౌతిక శాస్త్రము) చేశాడు. బెంగళూరులోని భారత శాస్త్ర సంస్థలో లోహశాస్త్ర పట్టభద్రుడయ్యాడు. రెండవ సంవత్సరములో దొరాబ్జి టాటా ఉపకార వేతనము పొందాడు. కాశీ హిందూ విశ్వవిద్యాలయములో అనంతరామన్ వద్ద శిష్యునిగా చేరి 1965 లో ఎం.యస్సీ,1968లో పి.హెచ్.డి పట్టాలు సాధించాడు.
పరిశోధనలు
[మార్చు]రామచంద్రరావు చేసిన పరిశోధనలు లోహశాస్త్రమును కొత్త పుంతలు తొక్కించాయి. ద్రవపదార్థములను త్వరిత గతిన ఘనపదార్థములుగా చేయు ప్రక్రియలు కనిపెట్టి ప్రపంచ ఖ్యాతి పొందాడు. గత పది సంవత్సరములుగా అధిక ఉష్ణోగ్రతలు ఉపయోగించకుండా, ప్రకృతిలో జరుగు జీవ రసాయన క్రియలు ఆధారముగా ఘనపదార్థములు చేయు పద్ధతులు కనిపెట్టాడు.
వ్యక్తిగతం
[మార్చు]రామచంద్రరావుకు శాస్త్రపరిశోధనతో బాటు వివిధ వ్యాపకములున్నాయి. మృదంగము, కార్టూన్ లు మున్నగు వానిలో శ్రద్ధ గలదు.
పదవులు
[మార్చు]- ఆచార్యుడు, లోహశాస్త్ర విజ్ఞాన విభాగము, కాశీ హిందూ విశ్వవిద్యాలయము, వారబణాసి.
- నిర్దేశకుడు, జాతీయ లోహశాస్త్ర పరిశోధనాశాల, జంషెడ్ పూరు.
- ఉపకులపతి, కాశీ హిందూ విశ్వవిద్యాలయము, వారణాసి.
- ఉపకులపతి, అగ్రస్థాయి టెక్నాలజీ రక్షణ సంస్థ, పూనే.
- రాజా రామన్న ఫెలో, అంతరజాతీయ లోహశాస్త్ర అగ్రస్థాయి పరిశోధనా సంస్థ, హైదరాబాదు.
పురస్కారాలు
[మార్చు]- కామన్ వెల్త్ ఫెలోషిప్ - 1970-71
- జాతీయ లోహశాస్త్రజ్ఞ పురస్కారము; భారత ప్రభుత్వ ఉక్కు, గనుల శాఖ మంత్రాలయము - 1979
- ఇంటర్ కాస్మోస్ పురస్కారము; సోవియట్ యూనియన్ - 1984
- శాంతి స్వరూప్ భట్నాగర్ శాస్త్ర సాంకేతిక పురస్కారం - 1985
- కాశీ హిందూ విశ్వవిద్యాలయము - ప్రఖ్యాత పూర్వ విద్యార్థి పురస్కారము - 1994
Distinguished Materials Scientist Award, IE (India) (1995) Indian National Science Academy Prize for Materials Science 1997 ; VASVIK Award 1997 ; Om Prakash Bhasin Award 1998 ; Distinguished Engineer Award, IE (India) (1998) ; Yalavarthi Nayudamma Award (1999) ; Distinguished Lecturership Award, Materials Research Society of India, 1999-2001 ; Distinguished Alumnus Award, Indian Institute of Science 2001; Federation of Indian Chambers of Commerce and Industry (FICCI), 1999-2000; Nijhawan Award for Best Technical Paper Published from NML in the year 2001 ; MRSI-ICSC Superconductivity & Materials Science Prize, MRSI, 2002 ; Best Paper Award LERIG-2002 Prof. P. Banerjee Award for best technical paper (Ferrous) published in Indian Foundry Journal (2001-2002) ; Loyola Ratna - Awarded by Andhra Loyola College, Vijayawada 2003; National Metallurgist Award, Min. of Steel & Mines, Govt of India, 2004 ; MRSI-ICSC Superconductivity & Materials Science Sr. Award, MRSI, 2005 ; Shanti Swarup Bhatnagar Gold Medal, INSA, 2005 ; Dr. Ramineni Foundation (USA) Vishishta Puraskar, 2007
Fellow Indian National Science Academy The National Academy of Sciences Indian Academy of Sciences Indian National Academy of Engineering The Institution of Engineers (India) The Institute of Materials, Minerals & Mining (London) UK Third World Academy of Sciences, Italy Indian Institute of Metals Maharashtra Acadeny of Science
గౌరవ పురస్కారాలు
[మార్చు]President, The Asia-Pacific Academy of Materials (APAM), India Chapter President, Indian Institute of Metals Vice President, Materials Research Society of India Vice-President, Indian National Science Academy, New Delhi. Sectional President, Materials Science Section, Indian Science Congress