పటేల్ అనంతయ్య
Jump to navigation
Jump to search
పటేలు అనంతయ్య | |
---|---|
జననం | పటేలు అనంతయ్య 1933 డిసెంబరు 25 ![]() |
వృత్తి | జాయింట్ రిజిస్ట్రార్ ఆఫ్ కో ఆపరేటివ్ సొసైటీస్ రచయిత |
మతం | హిందూ |
తండ్రి | వెంకటలక్ష్మయ్య |
తల్లి | పుల్లమ్మ |
పటేలు అనంతయ్య ఇంగ్లీషు, ఉర్దూ, తెలుగు త్రిభాషా నిష్ణాతుడు.
జీవిత విశేషాలు[మార్చు]
పటేలు అనంతయ్య[1] 1933, డిసెంబరు 25వ తేదీన పాలమూరు జిల్లా నాగర్‌కర్నూల్ తాలూకా గోరిట గ్రామంలో పుల్లమ్మ, వెంకటలక్ష్మయ్యలకు జన్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బి.ఏ పట్టా, బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో స్నాతకోత్తర డిప్లొమా చదివాడు. సహకార శాఖలో వివిధ హోదాలలో నల్లగొండ, హైదరాబాదు, అనంతపురం మొదలైన ప్రాంతాలలో పనిచేసి జాయింట్ రిజిస్ట్రార్‌గా పదవీవిరమణ చేశాడు. పదవీవిరమణ తర్వాత నల్లగొండ జిల్లాలో సమగ్ర సహకార అభివృద్ధి పథకం కింద రైతుల ఆర్థిక అవసరాలను సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేశాడు. ఉర్దూ అకాడెమీ "తెలుగు - ఉర్దూ నిఘంటువు" ప్రాజెక్టుకు డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ఆకాశవాణిలో బాలగేయాలు, జాతీయ కవితానువాదాలు ప్రసారం చేశాడు.
రచనలు[మార్చు]
- గజల్ గీతికలు (1981)
- తేటవెలది (1989)
- అనంతకవితలు (1987)
- వేంకటేశ్వర శతకం(1988)
- ఆదిత్య శతకము (2004)
- మఖ్దుం మొహినుద్దీన్ (1988)
- తెలుగునాట జానపద వైద్య విధానాలు (1990)
- హిస్టరీ ఆఫ్ ఇండియా (అముద్రితము) (ఉర్దూనుండి అనువాదం)
- అనంతరామాయణము(అముద్రితము) (సుందరకాండ పద్యకావ్యం)
మూలాలు[మార్చు]
- ↑ పాలమూరు జిల్లా సమకాలీన కవులు - ఆచార్య ఎస్వీ రామారావు