పతివాడ నారాయణస్వామి నాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పతివాడ నారాయణస్వామి నాయుడు భారతదేశ రాజకీయ నాయకుడు. నెలిమర్ల నియోజకవర్గంగా ఏర్పడక ముందు భోగాపురం నియోజకవర్గం నుంచి అతను ఆరుసార్లు గెలిచి రికార్డు సృష్టించాడు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

అతని స్వగ్రామం విజయనగరం జిల్లా, పూసపాటిరేగ మండలానికి చెందిన రెల్లివలస గ్రామం.[2]

రాజకీయ జీవితం[మార్చు]

2014 సార్వత్రిక ఎన్నికలలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల శాసనసభా నియోజకవర్గం నుంచి ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు శాసనసభ్యునిగా ఎన్నికైనాడు. ఇతను భోగాపురం శాసనసభా నియోజకవర్గం నుండి 1983, 1985, 1989, 1994, 1999, 2004 సంవత్సరాలలో 7సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. అతను తెలుగు దేశం పార్టీ ఆవిర్భావంనుండి జరిగిన ఎన్నికలలో 2009 శాసనసభ ఎన్నికలలో మినహా ఏడు సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. [3] తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు హయాంలో టీడీపీ ఆవిర్భావ సమయంలో అతను పార్టీలోకి వచ్చాడు. ఒక దఫా మంత్రి పదవిని చేపట్టాడు.[4]

ప్రొటెం స్పీకర్‌గా[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్‌ గవర్నర్‌ నరసింహన్‌ 20-06-2014న ఆంధ్ర ప్రదేశ్‌ శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా పతివాడ నారాయణ స్వామి నాయుడు చేత రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించారు.

మూలాలు[మార్చు]

  1. Batchali, Ravi (2018-10-04). "స్ట్రాంగ్ లీడర్ రింగ్ లో జగన్.....?". తెలుగు పోస్ట్. Retrieved 2020-06-18.
  2. "మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి నిరాహారదీక్ష | Prajasakti::Telugu Daily". www.prajasakti.com. Retrieved 2020-06-18.
  3. Journalist, Telugu (2017-11-06). "ఏపీ టీడీపీ ఎమ్మెల్యే పార్టీకి బై చెపుతారా..! బాబుపై గుస్సా..!". Telugu Journalist (in ఇంగ్లీష్). Retrieved 2020-06-18.
  4. "PSLV TV". PSLV TV. Retrieved 2020-06-18.