పద్మావతి రావు
పద్మావతి రావు | |
---|---|
జననం | 1963 |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1978 - ప్రస్తుతం |
కుటుంబం | అరుంధతి నాగ్ |
పద్మావతి రావు, నాటకరంగ-సినిమా నటి, కవయిత్రి, నర్తకి, అనువాదకురాలు.[1][2] ఒండనొండు కలదల్లి (1978), గీతా (1981 చిత్రం), పర్దేస్ (1997), పద్మావత్ (2018), తాన్హాజీ (2020) వంటి సినిమాల్లో నటించింది.
జననం
[మార్చు]పద్మావతి 1963లో ఢిల్లీలో జన్మించింది. నటి అరుంధతి నాగ్ సోదరి.[2]
నాటకరంగం
[మార్చు]నాటకరంగంలో నటిగా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. భారతదేశం అంతటా నాటకాలు, వర్క్‌షాప్‌లను నిర్వహించింది. నాటకాలను ప్రదర్శించింది. మొదటగా శంకర్ నాగ్ దర్శకత్వంలో పలు నాటకాలలో నటించింది. మాల్గుడి డేస్‌లో సహాయ దర్శకురాలిగా, నటిగా, డబ్బింగ్ కూడా చెప్పింది.[3] గిరీష్ కర్నాడ్, ఎం.ఎస్. సత్యు, రమేష్ తల్వార్, షౌకత్ అజ్మీ, ఏకే. హానగల్ వంటి అనేకమంది రంగస్థల ప్రముఖులతో కలిసి నాటకరంగంలో పనిచేసింది.[4] నాటకరంగంలో కిచెన్ పొయెమ్స్, సోలో పెర్ఫార్మెన్స్ తదితర అంశాలలో ప్రశంసలు అందుకుంది.[5] చిల్డ్రన్ థియేటర్ పనిచేస్తోంది.[4][6][7]
సినిమారంగం
[మార్చు]1978లో గిరీష్ కర్నాడ్ దర్శకత్వం వహించిన ఒండనోండు కలదల్లి అనే కన్నడ సినిమాలో తొలిసారిగా నటించింది. 1981లో శంకర్ నాగ్ దర్శకత్వం వహించిన గీత (గీత పాత్రలో), పర్దేస్, పద్మావత్ వంటి సినిమాల్లో కూడా నటించింది.[8] రిభు దాస్‌గుప్తా దర్శకత్వం వహించిన విమర్శకుల ప్రశంసలు పొందిన తీన్ సినిమాలో అమితాబ్ బచ్చన్ భార్యగా నటించింది. 2020లో విడుదలైన తాన్హాజీ చిత్రంలో శివాజీ తల్లి జిజాబాయిగా నటించింది.
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | భాష | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|---|
1978 | ఒందనోండు కలదల్లి | కన్నడ | సావంత్రి | తొలిచిత్రం |
1981 | గీత | కన్నడ | గీత | |
1997 | పర్దేస్ | హిందీ | నర్మద | |
2016 | తీన్ | హిందీ | నాన్సీ | |
2018 | ఏక్ సంగయ్చయ్ | మరాఠీ | ||
పద్మావత్ | హిందీ | కున్వర్ బైసా | ||
ఫామస్ | హిందీ | లాల్ తల్లి | ||
2019 | ప్రణయ మీనుకలుడే కాదల్ | మలయాళం | బిని నూర్జెహాన్ | |
2020 | తాన్హాజీ | హిందీ | జీజాబాయి | |
రాత్ అకేలీ హై | హిందీ | ప్రమీలా సింగ్ | ||
2021 | మార | తమిళం | మీనాక్షి/మేరీ ఆంటీ | అమెజాన్ ప్రైమ్ ఫిల్మ్ |
మూలాలు
[మార్చు]- ↑ Ranjan Govind (4 May 2020). "This refrigerator made by Padmavati Rao does not run on electricity". The Hindu. Retrieved 2022-06-09.
- ↑ 2.0 2.1 Vidya Iyengar (19 Jun 2016). "I lead my life in disbelief". Bangalore Mirror. Retrieved 2022-06-09.
- ↑ Nina C George (20 May 2020). "How Shankar Nag's Malgudi Days come into life". Deccan Herald. Retrieved 2022-06-09.
- ↑ 4.0 4.1 Bindu Gopal Rao (17 Jul 2016). "From stage to stage". Deccan Herald. Retrieved 2022-06-09.
- ↑ Deepa Ganesh (8 Oct 2015). "A Kitchen Katha". The Hindu. Retrieved 2022-06-09.
- ↑ "A bagful of tales..." Deccan Herald. 26 Mar 2012. Retrieved 2022-06-09.
- ↑ "Metrolife in the city". Deccan Herald. 24 Aug 2011. Retrieved 2022-06-09.
- ↑ Namrata Joshi (24 Jan 2018). "Padmaavat' review: an insipid love letter to Rajputs". The Hindu. Retrieved 2022-06-09.