పరకాల పఠాభిరామారావు

వికీపీడియా నుండి
(పరకాల పట్టాభిరామారావు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

స్వాతంత్ర్య సమర యోధుడు.హేతువాది. పశ్చిమగోదావరి జిల్లా కవిటం గ్రామంలో జన్మించారు. విజయవాడలో స్థిరపడ్డారు. విశాలాంధ్ర పత్రికలో ఎడిటర్ గా పనిచేశారు.

రచనలు

[మార్చు]

స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు

[మార్చు]

భారత జాతీయోద్యమంలో కాంగ్రెస్ వాదులే కృషిచేశారన్న అభిప్రాయం దురదృష్టవశాత్తూ చరిత్ర పుస్తకాలు కలిగిస్తున్నాయి. కమ్యూనిస్టుల ప్రస్తావన వచ్చినా విడిగా రావడమే గానీ స్వాతంత్ర్య సమరంలోని ప్రముఖులుగా చరిత్రలో రాదు. భగత్‌సింగ్ వంటి ప్రముఖ స్వాతంత్ర్య విప్లవ యోధులు కమ్యూనిస్టులే. ఐతే 1940ల్లో రెండవ ప్రపంచ యుద్ధాన్ని ప్రజాయుద్ధంగా అభివర్ణించి రష్యాను మిత్రదేశమైన బ్రిటన్‌ను సమర్థించడం, ఆపైన కాంగ్రెస్ చేసిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించడం వంటి పరిణామాలు దీనికి కారణం కావచ్చు. కానీ అనంతర కాలంలో బొంబాయి నేవీ తిరుగుబాటు వంటి పోరాటాలలో కమ్యూనిస్టులు చురుకుగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టులు దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన ప్రయత్నాలు, పోరాటాలను ఈ గ్రంథంలో వ్యక్తుల వారీగా రాశారు. దీన్ని 2000 సంవత్సరంలో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రచురించింది.[1] ఇందులో ఎక్కువ భాగం " నేనెలా స్వాతంత్ర్య్యోద్యమంలోకి, కమ్యూనిష్టు ఉద్యమంలోకి వచ్చాను " అన్న సంక్షిప్త స్వీయ కథనాలు. మరికొన్ని కామ్రేడ్లు మరణానంతరం ఇతరులు వ్రాసినవి. వీనిలో ఎక్కువభాగం 1995, 1996 కమ్యూనిజం ప్రత్యేక సంచికలలో ప్రచురించబడినవి.

ఇతర రచనలు

[మార్చు]
  1. భక్తివిశ్వాసాల ముసుగులో 1982
  2. జాతీయ పునరుజ్జీవనమా? మతమౌఢ్య పునరుద్ధరణమా? 1984
  3. మతమౌఢ్యానికి వ్యతిరేకంగా 1984

పురస్కారాలు

[మార్చు]
  • 2001 : ఆంధ్రప్రదేశ్ అభ్యుదయరచయితల సంఘం, గుంటూరు జిలాశాఖ వారిచే అమరజీవి పులుపుల వెంకటశివయ్య సాహితీ సత్కారం.[2]

మూలాలు

[మార్చు]
  1. భారత డిజిటల్ లైబ్రరీలో స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు పుస్తకం.
  2. పెనుగొండ లక్ష్మీనారాయణ (1 January 2020). గుంటూరు సీమ సాహిత్య చరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం. pp. 282–283.