పరిచయం (2018 సినిమా)
పరిచయం | |
---|---|
దర్శకత్వం | లక్ష్మీకాంత్ చెన్నా |
దేశం | భారతదేశం |
పరిచయం 2018, జూలై 21 శనివారం[1] విడుదలైన తెలుగు సినిమా
కథ
[మార్చు]ఆనంద్ (విరాట్), లక్ష్మీ (సిమ్రత్ కౌర్) రైల్వేలో ఉద్యోగాలు చేసే సుబ్రమణ్యం (రాజీవ్ కనకాల), సాంబ శివరావు (పృథ్వీ)ల పిల్లలు. ఒకే రోజు ఒకే ఆసుపత్రి లో పుట్టిన వీరిద్దరు చిన్నతనం నుంచి కలిసే పెరుగుతారు. ఒకరంటే ఒకరికి ప్రేమ ఉన్నా అది చెప్పుకోకుండానే సంవత్సరాలు గడిచిపోతాయి. చిరవకు ఆనంద్ ధైర్యం చేసి తన ప్రేమ గురించి చెప్పేస్తాడు. కానీ వెంటనే విషయం ఇద్దరి ఇళ్లలో తెలియడంతో గొడవ అవుతుంది. అబ్బాయి అమ్మాయి కలిసి రోడ్డు మీద కనిపించటమే తప్పు అని భావించే సాంబశివరావు తన కూతురే మరో అబ్బాయితో కనిపించే సరికి కోపంతో రగిలిపోతాడు. కూతుర్ని దండించి మరొకరితో పెళ్లికి ఏర్పాట్లు చేస్తాడు. దీంతో లక్ష్మీ చనిపోవాలని పురుగుల మందు తాగుతుంది. లక్ష్మీ చేసిన పనివల్ల వారి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి..? చిరవకు ఆనంద్, లక్ష్మీలు ఒక్కటయ్యారా..? తల్లిదండ్రులు వారి ప్రేమను అర్థం చేసుకున్నారా..? అనేది కథలో భాగం
తారాగణం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- సంగీతం : శేఖర్ చంద్ర
- దర్శకత్వం : లక్ష్మీకాంత్ చెన్నా
- నిర్మాత : రియాజ్