Jump to content

పర్ణో మిత్ర

వికీపీడియా నుండి
పర్ణో మిత్ర
అమీ అర్ అమర్ గర్ల్‌ఫ్రెండ్స్ ప్రీమియర్‌లో పర్ణో మిత్ర
జననం (1992-10-31) 1992 అక్టోబరు 31 (వయసు 32)
జాతీయతభారతీయురాలు
వృత్తినటి, రాజకీయవేత్త
క్రియాశీల సంవత్సరాలు2007–ప్రస్తుతం
గుర్తించదగిన సేవలు
రంజన అమీ అర్ అష్బోనా,
అలీనగరేర్ గోలోక్ధధ
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ

పర్నో మిత్ర (జననం 1992 అక్టోబరు 31) బెంగాలీ చిత్రసీమకు చెందిన భారతీయ నటి.[1][2]

ఆమె బుల్లితెరపై కెరీర్ ప్రారంభించింది. రవి ఓజా రూపొందించిన బెంగాలీ టెలీవిజన్ ధారావాహిక ఖేలా (2007)లో ఆమె మొదటిసారిగా నటించింది.[3] ఆ తరువాత, ఆమె జాతీయ పురస్కారం గెలుచుకున్న రంజన అమీ అర్ అష్బోనా (2011)లో రంజన పాత్ర పోషించి స్టార్ డమ్‌కి చేరుకుంది. ఈ చిత్రం అంజన్ దత్తా దర్శకత్వంలో వచ్చింది.[4][5]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

ఆమె కోల్‌కతాలో 1992 అక్టోబరు 31న జన్మించింది. ఆమె తండ్రి అరుణాచల్ ప్రదేశ్‌లో పనిచేశారు. దానివల్ల ఆమె తన చిన్ననాటి రోజులలో ఎక్కువ భాగం అక్కడే గడిపింది. ఆమె డార్జిలింగ్‌లో కుర్సియోంగ్‌లోని డౌ హిల్ స్కూల్, కోల్‌కతాలోని ప్రాట్ మెమోరియల్ స్కూల్‌లలో చదువుకుంది.[6][7]

సినిమా కెరీర్

[మార్చు]

పర్ణో మిత్ర 2007లో టెలీవిజన్ సీరియల్ ఖేలాతో కెరీర్ మొదలుపెట్టింది. ఆమె రవి ఓజా ప్రొడక్షన్ మోహొనాలో ప్రధాన పాత్ర పోషించింది. ఇందులో ఆమె నటనకు ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది. అలాగే, ఆమె బౌ కోతా కావోలో రెండవ కథానాయికగా నటించింది.[8][9]

అంజన్ దత్ రూపొందించిన రంజన అమీ అర్ అష్బోనా (2011)లో ఆమె నటించింది. ఈ చిత్రానికి ఉత్తమ బెంగాలీ చిత్రం, ప్రత్యేక జ్యూరీ అవార్డు, ఉత్తమ సంగీతం.. ఇలా మూడు జాతీయ అవార్డులను అందుకుంది.[10][11]

ఆమె నవంబరు 2013లో 44వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ప్రదర్శించబడిన దర్శకుడు కౌశిక్ గంగూలీ చిత్రం అపూర్ పాంచాలిలో ఆషిమాగా పరంబ్రత చటోపాధ్యాయ సరసన నటించింది.[12]

బెడ్‌రూమ్[13], అమీ ఆర్ అమర్ గర్ల్‌ఫ్రెండ్స్, మాచ్ మిష్టి మోర్, ఎక్లా ఆకాష్ వంటి విజయవంతమైన చిత్రాలలోనూ ఆమె నటించింది.[14]

2015లో, ఆమె నటించిన మూడు చిత్రాలు భీతు, గ్లామర్, శ్రీజిత్ ముఖర్జీ రాజ్‌కహిని విడుదలైయ్యాయి.[15] వీటిలో రాజ్‌కహిని చిత్రం బేగం జాన్‌గా హిందీలో నిర్మించారు.[16] ఆమె గ్లామర్ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసింది.[17]

ఆమె ప్రతిమ్ డి గుప్తా ఎక్స్ పాస్ట్ ఈజ్ ప్రెజెంట్‌లో నటించింది, ఇందులో ఆమె రజత్ కపూర్ సరసన నటించింది.

2018లో అనిర్బన్ భట్టాచార్య సరసన సయంతన్ ఘోసల్ దర్శకత్వం వహించిన అలీనగరర్ గోలోక్‌ధాధలో బ్రిష్టిగా ఆమె ప్రధాన పాత్ర పోషించింది.[18]

ఆమె అరిందమ్ సిల్ ఇండో-బంగ్లా చిత్రం బలిఘావర్, ప్రతిమ్ డి గుప్తా ఆహారే మోన్ చిత్రాలలో నటించింది.[19]

రాజకీయ జీవితం

[మార్చు]

ఆమె 2021లో భారతీయ జనతా పార్టీలో చేరి, అదే సంవత్సరం పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో బారానగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసింది.[20][21] అయితే, ఆమె ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన తపస్ రాయ్ చేతిలో 35,147 ఓట్ల తేడాతో ఓడిపోయింది.[22][23]

మూలాలు

[మార్చు]
  1. "Parno's 'short' story". Archived from the original on 22 November 2015. Retrieved 2016-06-23.
  2. "Parno, Ranadeb glam up gym B\'day". indiablooms.com. Archived from the original on 4 March 2016. Retrieved 2016-06-23.
  3. "Women on top". Archived from the original on 28 June 2012. Retrieved 2016-06-23.
  4. "Women on top". Archived from the original on 28 June 2012. Retrieved 2016-06-23.
  5. Dutt, Anjan (2011-06-24), Ranjana Ami Ar Ashbona, retrieved 2016-06-23
  6. "Heritage gutted at Dow Hill". Archived from the original on 13 February 2016. Retrieved 2016-06-23.
  7. "Parno Mittra". cinetalkers.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2015-11-18. Retrieved 2016-06-23.
  8. "Parno is chilled out". The Times of India. Retrieved 2016-06-23.
  9. "Actress Parno Mitra Wiki Biodata Career Personal Details - Hindi Songs Lyrics". lyricsdelhi.com (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2016-08-16. Retrieved 2016-06-23.
  10. "The bong connection at the national awards". Archived from the original on 17 January 2014. Retrieved 2016-06-23.
  11. "Vidya Balan bags National Award for The Dirty Picture". Retrieved 2016-06-23.
  12. "I don't take myself seriously as a filmmaker, says Kaushik Ganguly". 2015-12-05. Retrieved 2016-06-23.
  13. "Parno and Mainak are a couple and we have proof!". The Times of India. Retrieved 2016-06-23.
  14. Bhaumik, Mainak (2013-02-17), Fish, Sweets & More, retrieved 2016-06-23
  15. "Vidya Balan all set for partition tale 'Begum Jaan'". 2016-04-21. Retrieved 2016-06-23.
  16. Hungama, Bollywood. "Vidya Balan's Begum Jaan gets Gauhar Khan, Pallavi Sharda, Ila Arun and Mishti on board | Bollywood News | Hindi Movies News | News – BollywoodHungama.com". Bollywood Hungama. Archived from the original on 20 June 2016. Retrieved 2016-06-23.
  17. "Parno Mittra on being choosy and having no inhibitions on screen". Archived from the original on 13 August 2016. Retrieved 2016-06-23.
  18. "Mystery intensifies with new 'Alinagarer Golokdhadha' trailer". The Times of India. Retrieved 2018-04-02.
  19. "Pratim's Next". The Telegraph (in ఇంగ్లీష్). Archived from the original on 2 April 2018. Retrieved 2018-04-02.
  20. "West Bengal assembly elections: BJP pits 'stars' to take on TMC veterans". The Times of India.
  21. "Old-timers, new entrants and celebs pepper BJP's 3rd List". The Times of India.
  22. "Bengal Election: 'নগরের নটী' পায়েল, তনুশ্রীরা কেন প্রার্থী, বিজেপি-র 'প্রভু'দের প্রকাশ্য তোপ তথাগতর". anandabazar.com (in Bengali). Retrieved 2021-05-07.
  23. "পায়েল, শ্রাবন্তী, পার্ণোদের 'নগরনটী' বানালেন তথাগত রায়". eiimuhurte (in ఇంగ్లీష్). Archived from the original on 2021-05-15. Retrieved 2021-05-07.