Jump to content

పర్యాయపదం

వికీపీడియా నుండి
Synonym list in cuneiform on a clay tablet, Neo-Assyrian period.

ఒక భాషలో ఒకే అర్థం గల రెండు పదాలను పర్యాయ పదాలు అంటారు. ఉదాహరణకు వాన, వర్షం పర్యాయపదాలు. ఏవైనా రెండు పదాలను పర్యాయ పదాలు అనాలంటే, ఒక వాక్యంలో రెండు పదాలను ఒకదాని బదులు ఒకటి వాడినప్పుడు అర్థం మారకూడదు. ఈ ప్రతిపాదికన చూస్తే చాలా పదాలు ఏదో ఒక అర్థఛాయలోనే పర్యాయ పదాలుగా ఉంటాయి. ఉదాహరణకు భూగోళాన్ని గురించి చెప్పేటప్పుడు భూమీ, ధరిత్రి పర్యాయపదాలుగా ఉంటాయి. కానీ స్థలాన్ని గురించి మాట్లాడేటప్పుడు రెండెకరాల భూమి అన్నట్లు రెండెకరాల ధరిత్రి అని అనడం వ్యాకరణ సమ్మతం కాదు. అదేవిధంగా ఒక చర్చ చాలా సమయం జరిగింది ఆని లేక చర్చ సుదీర్ఘమైన కాలం జరిగింది అన్న ఈ పదాల్లో చాలా సమయం, సుదీర్ఘమైన కాలం అనే పదాలు ఒకే అర్థాన్ని సూచిస్తాయి కాబట్టి ఒక పదానికి మరొక పదం పర్యాయపదం అని చెప్పవచ్చు. కానీ కాలం చేసారు అనడానికి సమయం చేసారు అనే వాడుక లేదు.

పూర్తిగా పర్యాయపదాలైన రెండు పదాలు ఉండవని కొందరు నిపుణుల అభిప్రాయం. వ్యుత్పత్తీ, అక్షర లక్షణాలూ, వాడే సందర్భాలూ, సూచించే భావాలూ వంటి రకరకాల కారణాల వల్ల ప్రతీ పదం పత్యేక అర్థాన్ని కలిగి ఉంటుందని వారి ఉద్దేశం. చాలా పర్యాయ పదాలను వాడే సందర్భాలు వేరు అయ్యి ఉంటాయి. ఉదాహరణకు నిలిపివేయడం అనేది ఆపివేయడంతో పోల్చితే మరింత నియత పదంగా చూడబడుతుంది. భూమి, ధరిత్రి అనే పదాలు మన్ని అర్థఛాయల్లోనూ పర్యాయపదాలుగా సరిపోవు. ఇక పర్యాయ పదాలు సభ్యోక్తులుగా కూడా వాడబడుతుంటాయి.

కొన్ని సందర్భాలలో అన్యాపదేశ పదాలు పర్యాయ పదాలుగా మారతాయి. ఉదాహరణకు సింహాసనానికి విధేయుడను, రాజుకు విధేయుడను అనే రెండు వాక్యాల్లో సింహాసనం, రాజు పర్యాయ పదాలుగా మారాయి.

వెంకటేశ్వరస్వామిని శ్రీనివాసుడు, బాలాజీ, తిరుమలేశుడు, వెంకటాద్రీశుడు, ఏడుకొండలవాడు, వడ్డీకాసులవాడు అని అనేక రకాల పేర్లతో పిలుస్తారు. ఈ నామాలన్నింటిని పర్యాయపదాలుగా చెప్పవచ్చు.

కొన్ని ఉదాహరణలు చూడవచ్చు.

రక్తం = రుధిరం, శోణం, నెత్తురు

లుబ్దకుడు = బోయవాడు, వ్యాధుడు, శబరుడు

వహ్ని = అగ్ని, నిప్పు, అనలం

విజయం = గెలుపు, జయం

వీరుడు = ధీరుడు బంటు పోటరి, మేటి

శౌర్యం = విక్రమం, పరాక్రమం

సౌరభం = సువాసన, పరిమళం

హృదయం = మనసు, చిత్తం, ఉల్లం

హైన్యం = నీచత్వం, హీనత్వం, అల్పత్వం

మంజులం = మనోహరం, ఒప్పిదం

అరి = శత్రువు, వైరి, విరోధి

ఆత్మీయత = ప్రేమ, ఆదరం

ఆసక్తి = ఆశ, కోరిక, కాంక్ష, వాంఛ

ఉత్తరోత్తర = ముందు ముందు, కాలక్రమమున

ఉదకం = నీరు, జలం, పయస్సు

కలను = యుద్ధమ,సంగ్రామం, పోరు

కిరీటం = మకుటం, కోటీరం

కృప = దయ, కనికరం, జాలి

చక్షవు = కన్ను, నేత్రం, నయనం

చిత్తం = మనసు, హృదయం

తండ్రి = జనకుడు, నాయన, పిత, అయ్య

ధ్వజం = కేతనం, పతాకం, జెండా

దేహం = శరీరం ఒడలు,తనువు కాయము

నాట్యం = నర్తనం, తాండవం, నృత్యం, లాస్యం

నెత్తావి = పరిమళం, సువాసన, సౌరభం

పథం = త్రోవ, మార్గం, దారి

పయోదము = మేఘం, మబ్బు, జలదం

పశువు = జంతువు, మృగం

ప్రణామం = నమస్కారం, మొక్కు, ప్రణతి

బాల్యం = చిన్నతనం, పసితనం, శైశవం

బీజం = విత్తనం, విత్తు

బృందము = సంఘం, సమూహం, గుంపు

పుట్టుక

[మార్చు]

పర్యాయపదాల పుట్టుకకు చాలా కారణాలు ఉంటాయి. రెండు భాషలు కలిసి ఒక భాషగా ఏర్పడినప్పుడు ఆ మునుపటి భాషల్లోని పదాలు కొత్త భాషలో మిగిలిపోవడం ఒక కారణం. ఉదాహరణకు ఆధునిక ఆంగ్లం, పురాతన ఆంగ్లం, నొర్మన్ ఫ్రెన్చ్‌ల కలయికతో పుట్టిన భాష. కనుక రెండు భాషల పదాలూ ఇందులో కనబడతాయి. ఉదాహరణకు విలుగాడికి ఆంగ్లంలో ఫ్రెన్చ్ పదమైన ఆర్చర్ (archer), పాత ఆంగ్ల పదమైన బోమన్ (bowman) అనే రెండు పదాలున్నాయి.

ఒక భాషపై ఇతర భాషల ప్రభావం పర్యాయ పదాల పుట్టుకకు మరొక కారణం. తెలుగులో మత కార్యకలాపాలకు సంస్కృతం ఎక్కువగా వాడగా, వ్యవహారిక భాషలో దేశ్యాల వాడకం ఎక్కువ. ఉదాహరణకు పురాణేతిహాసాల్లోని యుద్ధాల వర్ణనలో శిరచ్ఛేదం అనే పదం వాడగా, సమకాలిక కక్షలూ, ముఠా గొడవలు వల్లెవేసేటప్పుడు తల నరుకుట అనే మాట ఎక్కువ వినబడుతుంది.

పర్యాయ పదాల తయారీకి ఇంకో కారణం అన్యదేశ్యాలు. తెలుగులో ఒక పగలూ, రాత్రిని సూచించేందుకు ఉర్దూ అన్యదేశ్యమైన రోజునూ, దేశ్యపదమైన నాడునూ వాడతారు. ఉదాహరణకు ఆరోజు, ఆనాడు. చాలా ఐరోపా భాషల్లో సాంకేతిక సందర్భాన్ని సూచించేందుకు లాటిను, గ్రీకు అన్యదేశ్యాలను వాడి, ఇతర సందర్భాల్లో ఆ సంబంధిత భాష దేశ్యాలను వాడుతుంటారు. ఇస్లామిక సంస్కృతుల్లో అరబీ, ఫార్సీ భాషల ప్రభావం స్థానిక భాషలపై ఉంటుంది.

ఇక పర్యాయ పదాలకు మరొక ముఖ్య కారణం పూనుకుని చేసిన కొత్త పదాల సృష్టి. ఉన్న పదాలకు కొత్త పదాలను సాధారణంగా మేలిమి భాషావాదులు సృష్టిస్తుంటారు. ఉదాహరణకు పుస్తకపు ముందుమాటను సూచించే ఆంగ్ల పదం ప్రెఫిస్ (preface)కు రోమను వ్యుత్పత్తి ఉన్నందున, దానికి దీటుగా ఫోర్‌వార్డ్ (foreword) అనే ఆంగ్ల పదం తయారైంది. తెలుగులో ఇలాంటి ఒక ప్రయత్నం కనిపించే పుస్తకం బంగారు నాణేలు.

వాడుక

[మార్చు]

కొన్ని సందర్భాలలో పర్యాయ పదాలు అర్థఛాయలలోని సూక్ష్మమైన వ్యత్యాసాలను తెలియజేయగా, కొన్నిసార్లు అవి వాడబడే సందర్భాలు వేరేవి అయ్యి ఉంటాయి. ఉదాహరణకు మలవిసర్జనా అవయువముకు ముడ్డి, గుద్ద, మలద్వారం అను మూడు పర్యాయపదాలు ఉండగా, గుద్ద చాలాసార్లు బూతుగా, ముడ్డి వాడుక భాషలో పదంగా, మలద్వారం సభ్యోక్తిగా చెలామణీ అవుతున్నాయి.

కొన్ని సాంకేతిక రంగాలు పర్యాయ పదాలను వేర్వేరు సాంకేతిక అర్థాలకు పరిమితం చేయవచ్చు.

కొందరు రచయితలు ఒకే వాక్యంలో లేదా దగ్గరగా ఉన్న వాక్యాలలో ఒకే పదాన్ని వాడకుండా, పర్యాయ పదాలు వాడుతుంటారు.

భాషాభాగాలూ-పర్యాయపదాలూ

[మార్చు]

పర్యాయపదాలు అన్ని భాషాభాగాల్లోనూ ఉంటాయి.

నామవాచకాలు

[మార్చు]

క్రియలు

[మార్చు]

విశేషణాలు

[మార్చు]
  • పెద్ద, భారీ

క్రియా విశేషణాలు

[మార్చు]
  • వెంటనే, త్వరగా

విభక్తి ప్రత్యయము

[మార్చు]
  • పైన, మీద

నిఘంటువులు

[మార్చు]

పర్యాయపదాలు నిఘంటువులలో అర్థంతో పాటుగా ఉండవచ్చు. కేవలం పర్యాయపదాలు తెలియజేసే నిఘంటువులు కూడా ఉంటాయి. తెలుగులో ఉన్న నిఘంటువులు:

  • తెలుగు పర్యాయపద నిఘంటువు; ఆచార్య జి.యన్. రెడ్డి విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, మే 1998. ఆర్కైవ్ ప్రతి

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]