Jump to content

పర్యావరణ కవితోద్యమము

వికీపీడియా నుండి
(పర్యావరణ కవితోద్యమం నుండి దారిమార్పు చెందింది)

పర్యావరణ కవితోద్యమం తెలుగు నాట ప్రారంభమైన ఓ ఉద్యమం. ఇది 2008 లో ప్రారంభమైనది. తెలుగు సాహిత్యంలో ఇది ఓ గొప్ప మలుపు[ఆధారం చూపాలి]. తెలుగు సాహిత్యంలో పర్యావరణ స్పృహ తేవాలనే తపనతో ఈ ఉద్యమం ప్రారంభమైనది. అది 2008, తెలుగు కవి లోకం దళితవాదం, స్త్రీవాదం గురించి చర్ఛిస్తున్న రోజుల్లో ఈ ఉద్యమం కవులను తన వైపు ఆకర్షించింది. ఒక్కసారి అందరినీ ఆలోచింపచేసింది[ఎవరు?]. ఇప్పటికి దీని ప్రభావం తెలుగు కవిత్వం మీద ఎంతో ఉంది[ఆధారం చూపాలి]. అనేకమంది కవులు దీనికి ప్రభావితులు అయ్యారు[ఎవరు?].

హరిత కవిత

[మార్చు]
[1] పర్యావరణ కవితొద్యమసారథి ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ ఎన్ మూర్తి, ఎమ్ రామారావు, కథాకేళి, పలువురు కవులు, కళాకారులు హరిత కత బ్యానర్ తొ రాజమండ్రిలో తెలుగు కథానిక శతజయంతి సందర్భాన శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి విగ్రహం ముందు ఆయనకు నివాళులర్పిస్తున్న దృశ్యం 24 జనవరి 2010

హరిత కవిత అనేది పర్యావరణ కవితోద్యమంలో ఒక కార్యక్రమము. ఇది అంతర్జాతీయ తెలుగు కవితల పోటీ. జాగృతీకిరణ్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని మల్లెతీగ అనే పత్రికతో కలసి ప్రారంభించింది. .2008లో ప్రారంభమైన ఈ ఉద్యమానికి శ్రీకారం హరిత కవితతోనే జరిగింది. సృజనాత్మక ప్రక్రియలద్వారా, రచనలద్వారా పర్యావరణం మీద అవగాహన కల్పించాలనదే ఈ ఉద్యమం యొక్క ముఖ్యలక్ష్యం.

హరిత కత

[మార్చు]

హరిత కత 2009 లో ప్రారంభింపబడింది. ఇది తెలుగు కథానికల పోటి. జాగృతీకిరణ్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని కథాకేళి అనే పత్రికతో కలసి ప్రారంభించింది.

పర్యావరణ కవితోద్యమసారథి ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ ఎన్ మూర్తి రాజమండ్రిలో 24 జనవరి 2010 తెలుగు కథానిక శతజయంతిలో జరిగిన సదస్సులో హరిత కవిత గురించి ప్రత్యేక ఉపన్యాసం ఇస్తున్న దృశ్యం

హరిత చిత్ర

[మార్చు]

హరిత చిత్ర ఇది తెలుగు కార్టూనుల పోటీ. జాగృతీకిరణ్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ప్రముఖుల సందేశాలు

[మార్చు]

విద్యాలయాలలొ కార్యక్రమాలు

[మార్చు]

కళాశాలల్లొ కార్యక్రమాలు

[మార్చు]

శిక్షణా కార్యక్రమాలు

[మార్చు]

జాతీయ అంతర్జాతీయ సదస్సులలో పత్ర సమర్పణ

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]