Coordinates: 16°07′09″N 79°41′21″E / 16.119042°N 79.689148°E / 16.119042; 79.689148

పలుకూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పలుకూరు
పలుకూరు is located in Andhra Pradesh
పలుకూరు
పలుకూరు
అక్షాంశరేఖాంశాలు: 16°07′09″N 79°41′21″E / 16.119042°N 79.689148°E / 16.119042; 79.689148
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం బొల్లాపల్లి మండలం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522657
ఎస్.టి.డి కోడ్

పలుకూరు పల్నాడు జిల్లా, బొల్లాపల్లి మండలానికి చెందిన గ్రామం.

విశేషాలు[మార్చు]

నల్లమల అటవీ అంచున విసిరేసినట్లుగా ఉన్న ఒక చిన్న పల్లె ఇది. వివిధ ప్రాంతాలనుండి వచ్చిన 40 కుటుంబాలవారు ఈ గ్రామానికి 3 కి.మీ. దూరంలో నివాసం ఏర్పరచుకున్నారు. దీనిపేరు ఎర్రవేణి చెంచు కాలనీ. కుడి ప్రధాన కాలువకు కూతవేటు దూరంలో ఉంటూ పోడు వ్యవసాయం చేసుకుంటూ వీరు జీవించుచున్నారు. ఓటు హక్కు, రేషను కార్డు ఇచ్చారు. పక్కా ఇళ్ళు లేవు. మొండిగోడలపై కప్పు వేసికొని ఉంటున్నారు. నీటిసోసం రెండు చేతిపంపులున్నవి. చీకటి పడితే అంధకారమే. వీధిదీపాలు లేవు. ఈ పరిస్థితులలో అసిస్ట్ స్వచ్ఛంద సంస్థ చొరవ తీసికొని కాలనీవాసుల వెతలను ఇటలీకి చెందిన "కడూరీ ఫౌండేషన్" కు వివిరించగా, వారు కాలనీని దర్శించి సౌరవిద్యుత్తు సౌకర్యం కలిగించడానికి ఏడు లక్షల రూపాయలను మంజూరుచేసి, దానిద్వారా వీధిదీపాలు ఏర్పాటుచేసారు. ఇంటికొక బల్బును ఉచితంగా అందజేసినారు. ఆపైన ఒక చేతిపంపుకు విద్యుత్తు సౌకర్యం కలుగజేసి, దానిద్వారా పెరటిసాగుకు అవకాశం కల్పించి కూరగాయల సాగు చేసికొనుటకు వీరికి అవకాశం కలిపించి వీరికి శాస్వతంగా జీవనోపాధి కల్పించారు.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పలుకూరు&oldid=3617412" నుండి వెలికితీశారు